వికీపీడియా:బాబెల్
వికీమీడియా ప్రాజెక్టులలో, బాబెల్ అనేది వాడుకరి భాషా మూసలను సూచిస్తుంది. వాడుకరికి ఏయే భాషలు తెలుసో ఇతరులకు తెలిసినందువలన ఆయా భాషలు మాట్లాడేవారికి ఇతరులతో సంభాషించడం సులభమౌతుంది. ఈ ఆలోచన వికీమీడియా కామన్స్ లో ఉద్భవించింది. మెటా-వికీ లోను, కొన్ని ఇతర వికీపీడియాలలో కూడా దీన్ని స్థాపించుకున్నారు. దిగువ ఇచ్చిన సూచనలను అనుసరించడం ద్వారా మీరు మీ వాడుకరి పేజీకి బాబెల్ మూసను చేర్చుకోవచ్చు.
ఉదాహరణలు
వికీకోడ్ | వివరణ |
---|---|
{Babel|te} | తెలుగు మాతృభాష |
{Babel|te-5} | తెలుగులో వృత్తిగత స్థాయి నైపుణ్యం |
{Babel|te-4} | తెలుగులో అత్యున్నత స్థాయి నైపుణ్యం |
{Babel|te-3} | తెలుగులో ఉన్నత స్థాయి నైపుణ్యం |
{Babel|te-2} | తెలుగులో మధ్యమ స్థాయి నైపుణ్యం |
{Babel|te-1} | తెలుగులో ప్రాథమిక స్థాయి నైపుణ్యం |
{Babel|te|en-3|kn-1} | తెలుగు మాతృభాష, ఇంగ్లీషులో ఉన్నత స్థాయి, కన్నడంలో ప్రాథమిక స్థాయి |
{Babel|te|ml-4|hi-2} | తెలుగు మాతృభాష, మలయాళంలో అత్యున్నత స్థాయి ప్రావీణ్యత, హిందీలో మధ్యమ స్థాయి |
వాడే పద్ధతి
నమూనా ప్రదర్శన | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
{Babel|
అనే కోడ్‌తో మొదలుపెట్టండి.Babel
తరువాత ఉన్నది పైపు సింబల్ (|
)- ఆ తరువాత మీకు వచ్చిన భాషల రెండక్షరాల కోడ్‌ను చేరుస్తూ పొండి. భాషల మధ్య | (పైపు) ను పెట్టండి. వివిధ భాషల రెండక్షరాల కోడ్ కోసం ఇంగ్లీషు వికీపీడియా లోని ఈ పేజీ చూడండి. ఆయా భాషలో మీ ప్రావీణ్యత స్థాయిని తెలియజెప్పే అంకెల వివరాల కోసం కింది జాబితా చూడండి.
- xx-1 ప్రాథమిక స్థాయి నైపుణ్యం - చదవగలిగే నైపుణ్యం.
- xx-2 మధ్యమ స్థాయి నైపుణ్యం - దిద్దుబాట్లు చేసే, చర్చల్లో పాల్గొనగలిగే నైపుణ్యం.
- xx-3 ఉన్నత స్థాయి నైపుణ్యం - రాయడమ్లో ఇబ్బందులేమీ లేనప్పటికీ, చిన్న తప్పులు దొర్లే అవకాశం ఉంది.
- xx-4 దాదాపుగా మాతృభాషా స్థాయి - ఇది మీ మాతృభాష కానప్పటికీ, దాదాపుగా ఆ స్థాయిలో నైపుణ్యం ఉంది.
- xx-5 వృత్తిపరమైన నైపుణ్యం.
- xx (అంకె ఏమీ లేకుండా) మాతృభాష. రోజూ వాడే భాష. జాతీయాలు, నానుడులు, సామెతలు అలవోకగా వాడుతూ మాట్లాడగలిగే రాయగలిగే భాష.
- ఆ తరువాత } - ఇలా మూసే బ్రాకెట్లు పెట్టి ముగించండి.
వర్గాలు
ఈ మూసలను మీ వాడుకరిపేజీలో వాడినపుడు మిమ్మల్ని మీ నైపుణ్య స్థాయికి సంబంధించిన వర్గం లోకి చేరుస్తాయి. ఆ భాషకు చెందిన మాతృవర్గానికి కూడా జోడిస్తాయి.
ఫలానా భాష మాట్లాడగలిగే వారి కోసం వెతకాలంటే భాషవారీగా వికీపీడియనులు అనే వర్గంలో చూడవచ్చు.
ఇతర పద్ధతులు
బాబెల్ మూసలను కింది పద్ధతులలో కూడా చేర్చుకోవచ్చు:
- ఒక్కొక్క భాషతో ఒక్కొక్క మూసను పెట్టుకుంటూ స్టాండలోన్ భాష మూసలను చేర్చుకోవచ్చు ఇలాగ:
{User te-1}
{User kn-1}
{User ml-1}
. - బాబెల్-ఎన్ మూసను వాడుకోవచ్చు. పద్ధతి:
{Babel-N|1={User te-1}{User kn-1}{User ml-1}}
. - టాప్ బాటం బాక్సు మూసలను వాడి పెట్టుకోవచ్చు. పద్ధతి:
{Userboxtop}
{User te-1}
{User kn-1}
{User ml-1}
{Userboxbottom}
. - బాబెల్ ఎక్స్టెన్షన్ను వాడి పెట్టుకోవచ్చు. పద్ధతి:
{#Babel:te|kn-1|ml-2}
.