విద్యా సంస్థలు

విద్యా సంస్థలను యాజమాన్యము ఆధారంగా ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందిన, ప్రైవేటు సంస్థలుగా వర్గీకరించవచ్చు. వీటి పరిధిని బట్టి పాఠశాల, ఉన్నత విద్యగా వర్గీకరించవచ్చు.

ప్రభుత్వ సంస్ఠలు

పాఠశాల స్థాయి

సాధారణ పాఠశాలలు

పురపాలకసంఘం, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పాఠశాలలు పనిచేస్తాయి.

గురుకులాలు

ప్రభుత్వ విద్యా సంస్థలలో నివాస సౌకర్యాలతో కూడిన విద్యాలయాలను ప్రభుత్వ గురుకులాల రూపంలో ప్రభుత్వం నిర్వహిస్తున్నది. వీటిలో విద్యార్థులు ఎక్కువ సమయం చదువు, పరీక్షల సాధన చేస్తారు. వీటిలో కూడా యాజమాన్యాన్ని బట్టి సాంఘీక సంక్షేమ గురుకులాలు, ఆదివాసి గురుకులాలు,, నవోదయ పాఠశాల లాంటివి వున్నాయి.

మాధ్యమిక, ఉన్నత విద్యా స్థాయి

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలు గురుకులాల తరహాలో నడపబడుతున్నాయి.

వృత్తి విద్యాస్థాయి

ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఇంజనీరింగ్ విద్యను గురుకుల తరహాలో విద్యనందించే సంస్థ ఐఐఐటి.

ప్రైవేటు సంస్థలు

పాఠశాల స్థాయి

గురుకులాలు

ప్రభుత్వ గురుకులాల తరహాలో ప్రైవేటు సంస్థలుకూడా విద్యాలయాలను నిర్వహిస్తున్నాయి, ఇవి ఇంటర్మీడియట్ స్ధాయిలో, లేక పోటీ పరీక్షల తర్ఫీదులో ఎక్కువ వున్నాయి, వీటిలో విద్యార్థులు ఎక్కువ సమయం చదువు, పరీక్షల సాధన చేస్తారు. వీటిలో కొన్ని శ్రీ చైతన్య, నారాయణ, విజ్ఞాన్, ఎన్నారై, మాస్టర్ మైండ్స్.

ఉన్నత విద్యా స్థాయి

ఇవీ చూడండి

వనరులు