వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం
వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | సివిల్ భాగం | ||||||||||
కార్యనిర్వాహకత్వం | భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ | ||||||||||
సేవలు | పోర్ట్ బ్లెయిర్, అండమాన్ నికోబార్ దీవులు, భారతదేశం | ||||||||||
ప్రారంభం | 2005 జనవరి 20 | ||||||||||
ఎయిర్ హబ్ | జల్ హన్స్ | ||||||||||
ఎత్తు AMSL | 4 m / 14 ft | ||||||||||
అక్షాంశరేఖాంశాలు | 11°38′28″N 092°43′47″E / 11.64111°N 92.72972°E | ||||||||||
పటం | |||||||||||
రన్‌వే | |||||||||||
| |||||||||||
గణాంకాలు (2020 ఏప్రిల్- 2021 మార్చి) | |||||||||||
| |||||||||||
వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం.ఇది విదేశీ సుంకం విధించటానికి అర్హత ఉన్న విమానాశ్రయం. భారతదేశంలోని అండమాన్, నికోబార్ దీవుల లో పోర్ట్ బ్లెయిర్‌కు పట్టణానికి దక్షిణాన 2 కి.మీ.దూరంలో ఉన్న ప్రధాన విమానాశ్రయం.[4]వాస్తవానికి ఇది "పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయం" అనే పేరుతో పిలువబడేది. నగరంలోని సెల్యులార్ జైలులో 10 సంవత్సరాల పాటు నిర్బంధించబడిన స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ పేరుతో 2002లో మార్చబడింది.[5] ఇది విదేశంలో ఉన్న స్వదేశ భాగం సంస్థగా పనిచేస్తుంది. ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ ఉత్క్రోష్‌తో ఎయిర్‌సైడ్ సౌకర్యాలను పంచుకుంటుంది.[6]
అవలోకనం
విమానాశ్రయంలో విమానాలు దిగటానికి 3,290 మీ. (10,794 అడుగులు) పొడవు ఉన్న ఒక మార్గం మాత్రమే ఉంది. విమానాశ్రయంలో చాలా ఇరుకైన సామర్థ్య నిర్మాణం గల విమానాలను కలిగి ఉంది. ఇందులో ఎయిర్‌బస్ ఎ320, ఎయిర్‌బస్ ఎ321, బోయింగ్ 737 ఉన్నాయి. భారత విమానాల ప్రాధికార సంస్థ నిర్వహిస్తున్న పౌర టెర్మినల్ మినహా, పోర్ట్ బ్లెయిర్‌పై ఇతర అన్ని ఎయిర్ ట్రాఫిక్ కార్యకలాపాలు భారత నావికాదళం ద్వారా నిర్వహించబడతాయి.[7]
టెర్మినల్
ప్రయాణికుల టెర్మినల్ 400 మంది ప్రయాణీకుల సామర్థ్యాన్ని కలిగి ఉంది.ఇది 6100 చ.మీ. విస్తీర్ణంతో కలిగి ఉంది.[8] ఏరోబ్రిడ్జ్‌లు లేని, రెండు ప్రధాన సింహ ద్వారాలు కలిగిన ఒక టెర్మినల్ మాత్రమే ఉంది. ఆప్రాన్ మీద పార్క్ చేసిన విమానానికి రవాణా అందించడానికి టెర్మినల్ నుండి బస్సులు ఉపయోగిస్తారు. విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ నిర్మాణం 40,837 చ.మీ. విస్తీర్ణంలో ఉంటుంది. టెర్మినల్ సామర్థ్యం 1200 గరిష్ఠంగా ఉంటుంది. (1000 దేశీయ, 200 అంతర్జాతీయ).[9] 2009లో, ఆప్రాన్ విస్తరించడానికి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.[10] ఈ విమానాశ్రయం నుండి 2019 నాటికి అంతర్జాతీయ విమానాలు లేవు.అంతర్జాతీయ విమానాలు 2020 జూలై నుండి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.[10][11]
కొత్త టెర్మినల్ భవనం నిర్మాణంలో ఉంది, 2020 జూన్ నాటికి ప్రారంభించడానికి ప్రణాళిక చేయబడింది. కొత్త టెర్మినల్ భవనం నిర్మాణానికి ఎఎఐ ప్రారంభంలో 26 ఎకరాల భూమి అవసరమని అంచనా వేసింది. స్థానిక పరిపాలనా ప్రభుత్వం దీనిని దాదాపు 19 ఎకరాలకు తగ్గించింది. ఇందులో 10.60 ఎకరాలు అండమాన్, నికోబార్ పరిపాలనా విభాగం నుండి, 4.72 ఎకరాలు భారత నావికాదళం నుండి సేకరించింది.మిగిలిన 3.39 ఎకరాలు సేకరించవలసఉంది [6][11]
విమానయాన సంస్థలు, గమ్యస్థానాలు
విమానయాన సంస్థలు | గమ్యస్థానాలు | Refs. |
---|---|---|
ఎయిర్ ఇండియా | చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, విశాఖపట్నం | |
గో ఫస్ట్ (విమానయాన సంస్థ)[12] | బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై | |
ఇండిగో | బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా | |
స్పైస్ జెట్ | చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా సీజనల్: కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం , బెంగళూరు |
[13] |
విస్తారా | సీజనల్: చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా | [14] |
మూలాలు
- ↑ "Annexure III - Passenger Data" (PDF). www.aai.aero. Retrieved 19 May 2021.
- ↑ "Annexure II - Aircraft Movement Data" (PDF). www.aai.aero. Retrieved 19 May 2021.
- ↑ "Annexure IV - Freight Movement Data" (PDF). www.aai.aero. Retrieved 19 May 2021.
- ↑ "Integrated terminal building of Veer Savarkar International Airport to be ready by June 2022". www.projectstoday.com. Retrieved 2021-10-14.
- ↑ "Lok Sabha Debates - Regarding Renaming Of Port Blair Airport In Andaman After The Name Of Port Blair airport on 8 May, 2002". www.indiankanoon.org. Government of India. Retrieved 17 April 2019.
- ↑ 6.0 6.1 "New Terminal Building at Port Blair Airport by March 2018". Press Information Bureau. 22 August 2013. Retrieved 6 January 2014.
- ↑ "Andaman & Nicobar Command: Saga of Synergy". Sainik Samachar. Retrieved 9 January 2012.
- ↑ "PortBlair Airport".
- ↑ "PortBlair Airport".
- ↑ 10.0 10.1 "New integrated terminal building at Andaman's VSI Airport to be ready by June 2022". The New Indian Express. Retrieved 2021-10-14.
- ↑ 11.0 11.1 "పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయానికి కొత్త టెర్మినల్ భవనం సిద్ధమౌతోంది". pib.gov.in. Retrieved 2021-10-27.
- ↑ "Budget airline GoAir rebrands as Go First".
- ↑ "SpiceJet schedule list". spicejet.com. Archived from the original on 2018-09-10. Retrieved 2019-01-11.
- ↑ "Vistara adds Chennai service from Feb 2018". Routesonline. Retrieved 2018-04-17.