వృక్షశాస్త్రం

వృక్షశాస్త్రం అనగా వృక్షాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం లేక వృక్ష జీవశాస్త్రాన్ని అధ్యయనం చేసే శాస్త్రం అని అర్థం. వృక్షశాస్త్రాన్ని ఇంగ్లీషులో బొటనీ అంటారు. బొటనీ అనే పదం పురాతన గ్రీకుభాష నుంచి స్వీకరించబడింది.

గ్రీకు భాషలో బొటనీ అనగా పశువులు మేసే పొలము, గడ్డి, గోగ్రాసం, పశువులను మేపుట అని అర్థం. జీవశాస్త్రంలోని చెట్టు యొక్క జీవితచరిత్రను నేర్పే శాస్త్రమే వృక్షశాస్త్రం. అనాది నుంచి శిలీంధ్రాలు, శైవలాలు, వైరస్ లు కూడా ఈ శాస్త్రంలో భాగంగానే అధ్యయనం చేయబడుతుంది. వృక్షశాస్త్రాన్ని గురించి పరిశీలన చేయడానికి పూనుకున్న వ్యక్తిని వృక్ష శాస్త్రజ్ఞుడు అంటారు. వృక్షశాస్త్రం విస్తృతమైన పరిధిలో శాస్త్రీయ పద్ధతులను నేర్పిస్తుంది. నిర్మాణక్రమం, పెరగడం, పునరుత్పత్తి, జీవక్రియ, అభివృద్ధి, రోగాలు, రసాయన గుణగణాలు, పరిణామాత్మక సంబంధాలు వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని వృక్షశాస్త్రం శాస్త్ర వర్గీకరణ చేస్తుంది.

ఆది మానవుడి కాలంలోనే వృక్షశాస్త్రం ఆరంభమైనది. ఆనాడే మానవుడు ఏది తినదగినది, ఏది ఔషధ సంబంధమైనది, ఏది విషపూరితమైన చెట్టు అని గుర్తించడం మొదలుపెట్టాడు. విజ్ఞానశాస్త్రంలోని అనేక శాఖలలో వృక్షశాస్త్రం ప్రాచీనమైన, ప్రత్యేకమైన శాస్త్రంగా రూపొందించబడింది. ప్రస్తుతం జీవిస్తున్న వృక్షరాశిలో నాలుగు లక్షల రకాల పైనే ఉన్న వీటి గురించి వృక్షశాస్త్రవేతలు అధ్యయనం చేస్తున్నారు.

సూక్ష్మంగా చెప్పాలంటే వృక్షములు, మొక్కలు, మొదలగు వాటి పుట్టుక, అభివృద్ధి, వ్యాప్తి, మొదలగు విషయాలను కూలంకషంగా తెలిజేచే శాస్త్రమును వృక్ష శాస్త్రము అని అంటారు. భూగోళం పై ఆవరించి వున్న జీవావరణములో అధికంగా వ్యాపించియున్నది నీటి తర్వాత ఈ వుక్షాలే. అనగా పచ్చదనము. చెట్లు, పొదలు, మొక్కలు, తీగలు, మొదలగు ఎన్నో జాతులున్నాయి. మానవుల వంటి ఇతర ప్రాణులకు ఇవే జీవాదారము. ఇతర జీవజాతుల మనుగడకు ప్రాణప్రధమైన ప్రాణ వాయువునందిస్తున్నాయి. వాటికి ఆహారంగా వుపయోగ పడుతున్నాయి. జంతువులు వాటి ఆహారాని అవి తయారు చేసుకోలేవు. వాటి ఆహారము కొరకు అవి తప్పని సరిగా వృక్షాల పైనే ఆధార పడ వలసినదే... ఈ జీవులు తమ ఆహార సంపాదనకు అనేక చోట్ల తిరుగు తుంటాయి కనుక వాటిని జంగమములు అని అంటారు. కాని వృక్షాలు తమ ఆహారమును తామె తయారు చేసుకోగలవు. అందు చేత అవి స్థిరంగా ఒకచోటునే వుంటాయి. వాటిని స్థావరములు అని అంటారు.

ఈ వృక్షాలలో అనేక జాతులు, ఉప జాతులు, తెగలు, కుటుంబాలు మొదలగుగా గల విభాగాలను ఏర్పరిచారు. వాటిని గురించి పరిపూర్ణ పరిజ్ఞానమునకే ఈ విభజన. ఈ పరిపూర్ణ విజ్ఞాన సమ్మిళతమే వృక్ష శాస్త్రము. వృక్ష శాస్త్రమును ఆంగ్లములో బోటని అని అంటారు. గ్రీకు భాషలో బౌన్. అనే పదానికి పశువులనీ, బౌంకిన్ అనే మాటకు పశువులకు మేత అని అర్థం. ఆవిధంగా పుట్టినదే బోటనీ అనే పదం.

వృక్షశాస్త్రం వర్గీకరణ

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
మొక్కలు
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
పుష్పించని మొక్కలు
 
 
పుష్పించే మొక్కలు
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
థాలోఫైటా
 
 
బ్రయోఫైటా
 
 
టెరిడోఫైటా
 
 
వివృత బీజాలు
 
 
 
 
 
 
 
ఆవృతబీజాలు
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
శైవలాలు
 
శిలింధ్రాలు
 
 
సైకనోఫైటా
 
పైనోఫైటా
 
నీటోఫైటా
 
జింకోఫైటా
 
ఏకదళ బీజాలు
 
ద్విదళ బీజాలు
 
 
 
 
 
 
 
 
 
 


వృక్షశాస్త్ర విభాగాలు

  • వృక్ష బాహ్యస్వరూపశాస్త్రం
  • వృక్ష అంతర్నిర్మాణశాస్త్రం
  • వృక్ష వర్గీకరణశాస్త్రం
  • వృక్ష శరీరధర్మశాస్త్రము
  • ఫైకాలజీ: థాలోఫైటా విభాగంలోని వర్ణసహిత శైవలాల గురించి తెలిపే శాస్త్రం.
  • మైకాలజీ: థాలోఫైటా విభాగంలోని వర్ణరహిత శిలింధ్రాల గురించి తెలిపే శాస్త్రం.
  • లైకానాలజీ: శైవలాలు, శిలింధ్రాలు కలిసి సహజీవనం చేసే విధానాన్ని తెలిపే శాస్త్రం.
  • బ్రయాలజీ: నీటిని వదిలిన మొదటి మొక్కలుగా గుర్తింపబడి, తేమ ప్రాంతాలలో వేరులాంటి వ్యవస్థను ఏర్పరచుకొని పెరిగే బ్రయోఫైటా మొక్కల గురించి తెలిపే శాస్త్రం.
  • టెరిడాలజీ: మొట్ట మొదటి నాళికా కణజాల వ్యవస్థను ఏర్పరచుకొని; వేరు, కాండం, పత్రం వంటి విభేదాన్ని కలిగిన మొదటి మొక్కలుగా గుర్తింపబడిన టెరిడోఫైటా మొక్కల గురించి తెలిపే శాస్త్రం.
  • పేలినాలజీ: సూక్ష్మసిద్ధబీజాయం, సూక్ష్మసిద్ధబీజాల నిర్మాణం, వాటి విధులను గురించి తెలిపే శాస్త్రం.
  • ఎంభ్రియాలజీ: స్థూల సిద్ధబీజాయం, స్థూల సిద్ధబీజాల నిర్మాణం, వాటి విధులను గురించి తెలిపే శాస్త్రం.

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి