శివకాశి
Sivakasi | |
---|---|
town | |
Country | India |
రాష్ట్రం | తమిళనాడు |
జిల్లా | Virudhunagar |
Elevation | 101 మీ (331 అ.) |
జనాభా (2001) | |
• Total | 72,170 |
భాషలు | |
• అధికార | Tamil |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 626 123 |
టెలిఫోన్ కోడ్ | 04562 |
Vehicle registration | TN-67 |
భారతదేశం యొక్క తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లాలో గల శివకాశి ఒక క్రియాశీలక పట్టణం, మునిసిపాలిటీ.
చరిత్ర
శివకాశికి 600 ఏళ్ల చరిత్ర ఉంది. 14 శతాబ్దం నుంచే ఈ నగరం ఉంది. హిందువుల పవిత్ర క్షేత్రం కాశీ ఉత్తరాదిన ఉండగా.. దక్షిణాదిన రెండు కాశీలు ఏర్పాటయ్యాయి. వాటిలో ఒకటి తెన్ కాశీ కాగా మరోటి శివకాశి. ఇవి రెండూ తమిళనాడులోనే ఉన్నాయి. శివకాశి మదురైకి దక్షిణాన ఉంది. 14వ శతాబ్దంలో హరికేసరి పరాక్రమ పాండియన్ ఈ ప్రాంతాన్ని పాలించేవాడు. ఆయన వారణాసిలో శివుడిని దర్శించుకొని అక్కడి నుంచి శివలింగాన్ని తీసుకొచ్చాడు. దీన్ని తాను ఉంటున్న తెన్ కాశిలో ప్రతిష్ఠించాలని భావించాడు. శివకాశికి వచ్చాక ప్రయాణబడలిక తీర్చుకున్నారు. ఈ లింగాన్ని తీసుకొస్తున్న గోవు అక్కడ నుంచి కదలనని మొండికేసింది. దీంతో ఆయన ఆ లింగాన్ని తన స్వస్థలం తెన్ కాశికి తీసుకెళ్లలేమని భావించి దాన్ని ఇక్కడే ప్రతిష్ఠించాడు. దీంతో ఈ నగరానికి శివకాశి అని పేరొచ్చిందని ఒక కథ ప్రచారంలో ఉంది. చెన్నైకి 500 కిలోమీటర్ల దూరంలో ఈ శివకాశి ఉంది.
స్వరూపం
విస్తీర్ణం : 343.76 చదరపు కిలోమీటర్లు
జనాభా : దాదాపు 2.5 లక్షలు
కుటుంబాల సంఖ్య : దాదాపు 65 వేలు
మొత్తం పరిశ్రమలు : 8 వేలు (అనుమతిలేనివాటితో సహా)
బాణాసంచా వ్యాపారం : ఏటా 1500కోట్ల రూపాయలు
అగ్గిపుల్లల పరిశ్రమలు
అగ్గిపుల్లలు అందరికీ చాలా కీలకం. వీటికి పుట్టినిల్లు చైనా. భారత్ కు ఫ్రాన్స్, ఇంగ్లండ్ నుంచి ఇవి దిగుమతి అయ్యేవి. 1921 తర్వాత పరిస్థితి మారింది. కోల్ కతాలో మొదటిసారి అగ్గిపెట్టెల పరిశ్రమ ఏర్పాటైంది. దీని గురించి తెలుసుకున్న శివకాశికి చెందిన పి.అయ్యానాడార్, ఎ.షణ్ముగనాడార్ అనే ఇద్దరు వ్యక్తులు జర్మనీ నుంచి యంత్రాలను తీసుకొచ్చి ఇక్కడ అగ్గిపుల్లల పరిశ్రమ ఏర్పాటు చేశారు. అప్పట్లో స్వాతంత్ర్య ఉద్యమం ఊపందుకోవడం.. విదేశి వస్తు బహిష్కరణతో వీరి అగ్గిపుల్లలకు డిమాండ్ పెరిగింది. దీంతో అప్పటి నుంచీ ఇక్కడ పెద్దఎత్తున అగ్గిపుల్లల తయారీ మొదలైంది. తర్వాత ఇక్కడ పరిశ్రమల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ 280 అగ్గిపుల్లల చిన్నస్థాయి పరిశ్రమలు, 3200 కుటీర పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఏటా 15 కోట్ల అగ్గిపుల్లలు తయారు చేస్తున్నారు. దేశానికి అవసరమైన అగ్గిపుల్లల్లో 70 శాతం ఈ తరహా పరిశ్రమల నుంచే ఉత్పత్తి అవుతున్నాయి.
బాణాసంచా తయారీ పరిశ్రమలు
అగ్గిపుల్లల పరిశ్రమలతో పాటు తర్వాత ఇక్కడ బాణాసంచా పరిశ్రమలు కూడా భారీ ఎత్తున ఏర్పాటయ్యాయి. దాదాపు మూడులక్షల మంది కార్మికులు ఈ పరిశ్రమలపై అధారపడి జీవనం సాగిస్తున్నారు. శివకాశి శివారులోని 15కి పైగా గ్రామాల్లోనూ అగ్గిపుల్లలు, బాణాసంచా పరిశ్రమలుండగా తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, కడలూరు తదితర జిల్లాల నుంచి వేలాది మంది ఇక్కడ వచ్చి పనిచేస్తుంటారు. శివకాశిలో అనుమతి పొందిన 630 బాణాసంచా తయారీ పరిశ్రమల్లో 1.3 లక్షల మంది పనిచేస్తుండగా అనుమతుల్లేని పరిశ్రమల్లో మరో లక్ష మంది పనిచేస్తున్నట్లు సమాచారం.
భారతీయ మిని జపాన్
1960వ సంవత్సరం దేశంలో నిరుద్యోగం రాజ్యమేలుతోంది. అందరూ ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తుంటే శివకాశిలో ఉన్న నిరుద్యోగులు ప్రభుత్వం నుంచి సాయం పొందకుండా అభివృద్ధి చెందాలని కలిసి నిర్ణయించుకున్నారు. అగ్గిపుల్లలు, బాణాసంచా, ముద్రణ, ఇతర పరిశ్రమల్లో రాణించారు. గణనీయమైన వృద్ధి సాధించారు. దీని గురించి సమాచారం తెలుసుకున్న అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఈ నగరానికి కుట్టిజపాన్ అనే పేరు పెట్టారు. అప్పటి నుంచి ఇది మిని జపాన్గా ప్రశస్తి సాధించింది.
ఇవి కూడా చూడండి
బయటి లింకులు
మూలాలు
2012 సెప్టెంబరు 6 - ఈనాడు పత్రిక