షిండ్లర్స్ లిస్ట్
షిండ్లర్స్ లిస్ట్ | |
---|---|
దర్శకత్వం | స్టీవెన్ స్పీల్బర్గ్ |
తారాగణం | లియామ్ నీసన్ బెన్ కింగ్స్‌లే |
సినిమా నిడివి | 195 నిమిషాలు |
బడ్జెట్ | $25,000,000 |
బాక్సాఫీసు | 321 మిలియన్ డాలర్లు |
షిండ్లర్స్ ఆర్క్ అనే నవల ఆధారంగా స్టీవెన్ స్పీల్బర్గ్ 1993లో తీసిన చిత్రం ఇది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యూదుల పైన జర్మనులు మారణహోమం సాగిస్తున్నపుడు జర్మన్ వ్యాపారవేత్త అయిన ఆస్కార్ షిండ్లర్ వెయ్యిమందికి పైగా యూదులను తన ఫ్యాక్టరీలో ఉద్యోగులుగా నియమించి వారి ప్రాణాలను కాపాడిన యథార్థ సంఘటన ఈ చిత్రానికి మూలం. 2007లో అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిటూట్ ఈ చిత్రాన్ని సినీ చరిత్రలో అత్యున్నత 100 చిత్రాలో ఎనిమిదవ చిత్రంగా ఎన్నుకున్నది. 66వ అకాడమీ పురస్కారాలలో దీనిని ఉత్తమ చిత్రంగా ఎంపిక చేశారు.
కథాంశం
1939లో చెకోస్లోవేకియాకు చెందిన ఆస్కార్ షిండ్లర్ అనే ధనవంతుడు తక్కువ కూలికి పని చేసే యూదులున్న క్రాకో అనే పట్టణానికి వస్తాడు. అప్పటికే నాజీ సభ్యుడయిన షిండ్లర్ ఆ పట్టణాన్ని తన గుప్పిట ఉంచుకున్న జర్మన్ సైన్యానికి పెద్ద ఎత్తున లంచాలు చెల్లించి యూదులను అతి తక్కువ కూలికి పని చేసే విధంగా తన ఫ్యాక్టరీకి రప్పించుకుంటాడు. జర్మన్ సైన్యానికి అవసరమయిన చిన్న చిన్న పరికరాలు తయారు చేసి లాభాలు గడిస్తూ జర్మనుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు.
అమోన్ గోథ్ అనే క్రూరుడయిన మిలటరీ అధికారి ఆ పట్టణంలో నిర్భంధ కూలీల క్యాంపు నిర్మించడానికి వచ్చి ఎదురు తిరిగినవారిని నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపించడం కళ్ళారా చూసి షిండ్రల్ చలించిపోతాడు. డబ్బుకంటే మనిషి ప్రాణం ఎంతో విలువయినది అని తెలుసుకుంటాడు. కొద్ది రోజులకు ఆ పట్టణాన్ని వదిలి అక్కడున్న యూదులను 'ఆస్విచ్' అనే ప్రాంతానికి తరలించమని జర్మన్ సైనికులకు ఆదేశాలు అందుతాయి. ( ఆస్విచ్ అన్నది అతి పెద్ద జర్మన్ 'కాన్సంట్రేషన్ క్యాంపు. ఈ క్యాంపులో జర్మన్ సైన్యం చేతిలో పది లక్షలకు పైగా యూదులు హింసలకు గురి అయి మరణించారు. )
తన దగ్గర పనిచేస్తున్న యూదులు అక్కడికి వెళ్తే మరణిస్తారు అని తెలుసుకున్న షిండ్లర్ వారి ప్రాణాలను కాపాడడానికి అమోన్ గోథ్‌కు తన వద్ద ఉన్న మొత్తం ధనం లంచంగా చెల్లించి దాదాపు 1100 మందిని సురక్షితమయిన మరో ప్రాంతానికి తరలించగలుగుతాడు.
అప్పుడే రష్యా జర్మనీ సైన్యాన్ని ఓడించడంతో యూరోప్‌లో యుద్ధం ముగుస్తుంది. జర్మన్ అయిన షిండ్లర్ ఆ ప్రాంతం విడిచి వెళ్ళవలసి వస్తుంది. షిండ్లర్ కు వీడ్కోలు చెప్పడానికి కార్మికులు వచ్చి తమ ప్రాణాలు కాపాడిన గొప్పవాడిగా కీర్తిస్తూ "He who saves the life of one man, saves the world entire." అని ఉన్న ఉంగరం ఇస్తారు. తన దగ్గర ఇంకా డబ్బు ఉంటే మరి కొందరి ప్రాణాలు కాపాడగలిగేవాడినని బాధపడుతూ షిండ్లర్ తన కారులో భార్యతో కలసి వెళ్ళిపోతాడు.
నిర్మాణ విశేషాలు
షిండ్లర్ పాత్ర పోషించడానికి కెవిన్ కాస్ట్నర్, మెల్ గిబ్సన్ వంటి నటులు ఆసక్తి చూపినా లియం నీసన్‌ను ఎన్నుకున్నాడు స్టీవెన్ స్పీల్బర్గ్. దాదాపు 30,000 మంది ఎక్‌స్ట్రా నటులు కావలసి వచ్చింది. షూటింగ్ పోలండ్ లోని క్రాకో వద్ద మార్చి 1 1993 న మొదలయి 71 రోజుల్లో ముగిసింది. యదార్థ సంఘటనలు జరిగిన ప్రదేశంలోనే దాదాపు మొత్తం షూటింగ్ జరిగింది. చిత్రానికి దర్శకత్వం చేస్తున్నపుడు స్పీల్బర్గ్ మానసికంగా ఎంతో క్షోభ పడ్డాడు. ముఖ్యముగా యూదులను నగ్నంగా పరిగెత్తించే దృశ్యం అందరినీ తీవ్రంగా కలచివేసింది. 40 శాతానికి పైగా చేతితో కెమెరాలు పట్టుకొని తీసిన ఈ చిత్రం బ్లాక్ అండ్ వైట్ లో చిత్రీకరింబడింది.
స్పందన
విడుదలయిన తర్వాత ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా $321.2 మిలియన్లు కలెక్షన్లు సాధించింది. మొత్తం ఏడు ఆస్కార్ అవార్డులు గెలుచుకొంది. 2008 నాటికి ఇంటర్నెట్ మూవీ డేటాబేసులో అత్యుత్తమ చిత్రాలలో ఏడవ స్థానంలో ఉంది. ఈ చిత్రం అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 10 టాప్ 10 చిత్రాలు జాబితాలో ఎపిక్స్ విభాగంలో మూడవ స్థానంలో నిలిచింది. Film editing Film editing is part of the process of filmmaking. It involves the selection and combining of shots into sequences, and ultimately creating a finished motion picture. It is an art of storytelling. Film editing is the only art that is unique to cinema, separating film-making from other art forms that preceded it (such as photography, theater, dance, writing, and directing), although there are close parallels to the editing process in other art forms like poetry or novel writing. Film editing is often referred to as the "invisible art"[citation needed] because when it is well-practiced, the viewer can become so engaged that he or she is not even aware of the editor's work. On its most fundamental level, film editing is the art, technique, and practice of assembling shots into a coherent whole. A film editor is a person who practices film editing by assembling the footage. However, the job of an editor isn’t simply to mechanically put pieces of a film together, cut off film slates, or edit dialogue scenes. A film editor must creatively work with the layers of images, story, dialogue, music, pacing, as well as the actors' performances to effectively "re-imagine" and even rewrite the film to craft a cohesive whole. Editors usually play a dynamic role in the making of a film.
బయటి లింకులు
- Official website
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో షిండ్లర్స్ లిస్ట్
- The Shoah Foundation, founded by Steven Spielberg to videotape and preserve the testimonies of Holocaust survivors and witnesses.