ఎగువ సీలేరు ప్రాజెక్ట్ సైట్ క్యాంప్
ఎగువ సీలేరు ప్రాజెక్ట్ సైట్ క్యాంప్ | |
---|---|
Coordinates: 18°02′14″N 82°01′09″E / 18.03722°N 82.01917°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అల్లూరి సీతారామారాజు |
జనాభా (2001) | |
• Total | 4,744 |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్‌కోడ్ | 531105 |
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | 08938 |
Website | -- |
ఎగువ సీలేరు ప్రాజెక్ట్ సైట్ క్యాంప్ (సీలేరు డామ్) ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, గూడెం కొత్తవీధి మండలంలోని ఒక జనగణన పట్టణం.[1][2] దీనికి సమీప రైల్వే స్టేషను 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సిపట్నం రోడ్. ఇది విశాఖపట్నానికి 204 కిలోమీటర్ల దూరంలో ఉంది.[3]
జనాభా
2011 భారత జనాభా లెక్కలు ప్రకారంఎగువ సిలేరు ప్రాజెక్ట్ సైట్ క్యాంప్ పట్టణంలో మొత్తం 1,088 కుటుంబాలు నివసిస్తున్నాయి.ఎగువ సిలేరు ప్రాజెక్ట్ సైట్ క్యాంప్ మొత్తం జనాభా 4,632 మంది ఉండగా, అందులో 2,617 మంది పురుషులు, 2,015 మంది మహిళలు ఉన్నారు.ఎగువ సిలేరు ప్రాజెక్ట్ సైట్ క్యాంప్ పట్టణ సగటు సెక్స్ నిష్పత్తి ప్రతి 1000 మందు పురుషులకు 770 మహిళలుగా ఉంది.ఎగువ సిలేరు ప్రాజెక్ట్ సైట్ క్యాంప్ పట్టణంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 531, ఇది మొత్తం జనాభాలో 11%.గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 269 మగ పిల్లలు, 262 ఆడ పిల్లలు ఉన్నారు.ఎగువ సిలేరు ప్రాజెక్ట్ సైట్ క్యాంప్ పిల్ల లింగ నిష్పత్తి 974గా ఉంది.ఇది సగటు పట్టణ మొత్తం లింగ నిష్పత్తి (770) కంటే ఎక్కువగా ఉంది.. అక్షరాస్యత రేటు 72.6%గా ఉంది.విశాఖపట్నం జిల్లా అక్షరాస్యత 66.9% తో పోలిస్తే ఎగువ సిలేరు ప్రాజెక్ట్ సైట్ క్యాంప్ అధిక అక్షరాస్యత కలిగి ఉంది. ఎగువ సిలేరు ప్రాజెక్ట్ సైట్ క్యాంప్‌లో పురుషుల అక్షరాస్యత రేటు 83.69%, స్త్రీల అక్షరాస్యత రేటు 57.79%గా ఉంది.[4]
ఎగువ సిలేరు ప్రాజెక్ట్ సైట్ క్యాంప్ పట్టణ జనాభాలో మొత్తంలో 6.69% షెడ్యూల్డ్ కులం (ఎస్సీ), 43.07% షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) లకు చెందిన వారు ఉన్నారు.[3]
వర్షపాతం, శీతోష్ణస్థితి
వార్షిక సగటు వర్షపాతం 63 మి.మీ. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 43 ° C వరకు ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత 7 to C కి తగ్గుతుంది.
సమీప గ్రామాలు
విద్యా సౌకర్యాలు
పట్టణంలో ఏపీజెన్కో డిఏవీ హైస్కూల్ ఇంగ్లీఘ మీడియం, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, ఎంపీపీ పాఠశాల, గిరిజన బాలికల పాఠశాల, టిఆర్సీక్యాంప్ గురుకుల బాలుర పాఠశాల, సీలేరు కాన్వెంట్ పాఠశాలలు ఉన్నాయి.
రవాణా సౌకర్యాలు
సీలేరు నుంచి నర్సీపట్నం వెళ్ళే ప్రధాన రహదారి, సీలేరు నుంచి భద్రాచలం, సీలేరు నుంచి ఒడిశాలోగల చిత్రకొండ రహదారి ప్రదానమైనవి.
మౌలిక వసతులు
ఏపీజెన్కో వారి రెండు అథిదిగృహాలు ఉన్నాయి. ఐబి, 12 గదులు హస్టల్ ఉన్నాయి.పట్టణం అన్ని బీటీరోడ్లు ఉన్నాయి. ఈరోడ్లు అన్నీ ఏపీజెన్కో వారిచే వేసినవి.తపాలా సౌకర్యం ఉంది
ఆరోగ్య సంరక్షణ
ఎపీజెన్కో ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి ( పిహెచ్సీ) ఉన్నాయి.
మంచినీటి వసతి
ఏపీజెన్కో ఇంటింటికి మంచినీటి సౌకర్యం కల్పిస్తుంది. రామాలయం వద్ద బోరుబావి గ్రామానికి మంచి నీటికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సీలేరుకు మంచినీటికి ఎటువంటి ఇబ్బందులు లేవు
విద్యుద్దీపాలు
పట్టణంలో విద్యుత్ దీపాలు అన్నీ జెన్కో రోడ్డ రోడ్డుకు వేసింది.పంచాయతీ తన పరిధిలో విద్యుత్ లైట్లు వేసింది.
రాజకీయాలు
ప్రధానంగా వైఎస్ఆర్సీపి, తెలుగుదేశం, కాంగ్రేస్ పాఠ్టీలు ఉన్నాయి
దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు
- ఏపీజెన్కో జలవిద్యుత్కేంద్రం ఉంది. ఇక్కడ 60 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయు సామర్ధ్యం గల నాలుగు జనరేటర్లు ఉన్నాయి. 1, 2 జనరేటర్లను స్విజ్జర్లాండ్ జనీవా దేశస్తులు నిర్మించారు. మరో రెండింటికి డిజైన్ చేసి వదిలేశారు. ఆరెండు జనరేటర్లను బిహెచ్ఈఎల్ కంపెనీ 1995లో నిర్మించింది. ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో 20 గేట్లతో కూడిన గుంటవాడ డ్యామ్ ఉంద. 8 గేట్లతో మరో రెగ్యులేటర్ డ్యామ్ ఉంది.
- మారెమ్మ అమ్మవారి దేవాలయం ఉంది. ఇది ప్రదాన ఆలయం
- అయ్యప్పదేవాలయం
- ఐస్ గెడ్డ జలపాతం. ఇది సీలేరుకు 5కిలోమీటర్లదూరంలో ఉంది.
ప్రధాన పంటలు
ఇక్కడ ఎటువంటి సాగులేదు. సీలేరు పరిసర ప్రాంతాల్లో వరి, రాగులు, కంది, మినుములు, సాములు పండిస్తారు.
ప్రధాన వృత్తులు
ఇతర ప్రధాన వృత్తులు ఏమీ లేవు. ఇక్కడ అందరూ జెన్కో సంస్థలో ఉద్యోగులుగా పనిచేస్తారు.
మూలాలు
- ↑ "Villages and Towns in Gudem Kotha Veedhi Mandal of Visakhapatnam, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-09. Retrieved 2022-10-09.
- ↑ "Upper Sileru Project Site Camp (Visakhapatnam, Andhra Pradesh, India) - Population Statistics, Charts, Map, Location, Weather and Web Information". www.citypopulation.de. Retrieved 2020-10-31.
- ↑ 3.0 3.1 "Upper Sileru Project Site Camp Census Town". indikosh.com. Archived from the original on 2017-01-10. Retrieved 2021-02-13.
- ↑ "Upper Sileru Project Site Camp Population, Caste Data Visakhapatnam Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2021-07-27. Retrieved 2021-02-13.