తిరుమల (పట్టణం)

తిరుమల
Adivarahakshetra[1][2]
Venkatadri[3]
తిరుమల
A view of the Maha Dwaram and the Ananda Nilayam Garbha Griha of the Sri Venkateswara Swami Vaari Temple
A view of the Maha Dwaram and the Ananda Nilayam Garbha Griha of the Sri Venkateswara Swami Vaari Temple
Nickname: 
Kaliyuga Vaikunta[4]
తిరుమల is located in ఆంధ్రప్రదేశ్
తిరుమల
తిరుమల
Location in Andhra Pradesh, India
Coordinates: 13°40′51″N 79°21′02″E / 13.680916°N 79.350600°E / 13.680916; 79.350600
Country భారతదేశం
StateAndhra Pradesh
DistrictTirupati
MandalTirupati (rural)
విస్తీర్ణం
 • Total32.21 కి.మీ2 (12.44 చ. మై)
Elevation
976 మీ (3,202 అ.)
జనాభా
 (2011)
 • Total7,741
 • జనసాంద్రత240/కి.మీ2 (620/చ. మై.)
Languages
 • OfficialTelugu
Time zoneUTC+5:30 (IST)
PIN
517 504
Telephone code+91–877
Vehicle registrationAP-03

తిరుమల, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా లోని ఒక ఆధ్యాత్మిక జనగణన పట్టణం. ఇది తిరుపతి పట్టణ సముదాయం లోని శివారు ప్రాంతాలలో ఒకటి. ఈ పట్టణం తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో ఒక భాగం. ఇది తిరుపతి రెవెన్యూ డివిజన్‌ లోని తిరుపతి పట్టణ మండలంలో ఉంది. ఇది విష్ణు నివాసం అయిన తిరుమల వేంకటేశ్వర ఆలయంతో ఏడుకొండలుగా చెప్పబడుచున్న కొండల ప్రదేశంలో ఉన్న పట్టణం. ఇది పూర్తి శాఖాహార పట్టణం.తిరుమల అవిభాజ్య చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలానికి చెందిన జనాభా లెక్కల పట్టణం.[6]

భౌగోళిక శాస్త్రం

తిరుపతి, తిరుమల కొండల వద్ద శిలాతోరణం (సహజ వంపు.)

తిరుమల సముద్ర మట్టానికి 980 మీటర్లు (3,200 అడుగులు) ఎత్తులో ఉంది. సుమారుగా 26.8 చదరపు కిలోమీటర్లు (10.33 చ.మై) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కొండల చుట్టూ శేషాచలం శ్రేణిలోని ఏడు శిఖరాలు, శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషబాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అనే ఏడు తూర్పు కనుమలు ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వరుని ఆలయం ఏడవ శిఖరం (వెంకటాద్రి)పై ఉంది.[7] తిరుపతి - తిరుమల ఘాట్ రోడ్డులో 21 కిమీ (13 మై) పాయింట్ వద్ద, భూమి భౌగోళిక చరిత్రలో చెప్పుకోదగ్గ ప్రశాంతత కాలాన్ని సూచించే స్ట్రాటిగ్రాఫిక్ ప్రాముఖ్యత ప్రధాన నిలిపివేత ఉంది. తిరుమల వేంకటేశ్వర ఆలయానికి 1 కిమీ (0.62 మై) దూరంలో తిరుమల కొండలలో సహజమైన వంపుతో ఏర్పడిన శిలాతోరణం 8 మీటర్లు (26 అడుగులు) వెడల్పు, 3 మీటర్లు (9.8 అడుగులు) ఎత్తుతో విలక్షణమైన భౌగోళిక అద్భుతం ఉంది. నీరు గాలి వంటి వాతావరణ కారకాల ద్వారా మిడిల్ టు అప్పర్ ప్రొటెరోజోయిక్ (1600 నుండి 570 మై) కడప సూపర్‌గ్రూప్‌లోని క్వార్టిజైట్ నుండి తొలగించబడింది.[8]

వాతావరణం

తిరుమలలో ఉష్ణమండల తడి, పొడి వాతావరణంతో ఉంటుది. కొండల మధ్య ఉన్న కారణంగా, శీతాకాలంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. ఎండాకాలం ఇక్కడ అంత వేడి వాతావరణం ఉండదు. ముఖ్యంగా తిరుపతితో పోలిస్తే, నైరుతి రుతుపవనాలు జూన్ నుండి ప్రారంభమవుతాయి, కానీ వర్షాలు భారీ స్థాయిలో ఉండవు. అప్పుడప్పుడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని గంటలపాటు కొనసాగుతాయి.

పట్టణ ప్రాముఖ్యత

ప్రాచీన సాహిత్యంలో తిరుమలని (తిరుపతి) ఆది వరాహ క్షేత్రంగా పేర్కొంటారు. పురాణాలు ఈ స్థలాన్ని విష్ణువు దశావతారాలలో ఒకటైన వరాహ భగవానుడితో అనుబంధించాయి. వరాహ పురాణంలో, వెంకటాద్రి మేరు పర్వతంలో ఒక భాగమని నమ్ముతారు. ఇది విష్ణు నివాసం వైకుంఠం నుండి అతని గరుడ పర్వతం ద్వారా దీనిని భూమిపైకి తీసుకురాబడిందని పురాణాల ద్వారా తెలుస్తుంది.ఏడు శిఖరాలు ఆదిశేషుని ఏడు తలలను సూచిస్తాయి.[9]

పట్టణ జనాభా

2011 గణాంకాలు

2011 జనాభా లెక్కల ప్రకారం తిరుమల నగరంలో మొత్తం 1,672 కుటుంబాలు నివసిస్తున్నాయి. తిరుమల మొత్తం జనాభా 7,741. వారిలో 3,970 మంది పురుషులు కాగా, 3,771 మంది స్త్రీలు ఉన్నారు. సగటు లింగ నిష్పత్తి 950. నగరంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 744, ఇది మొత్తం జనాభాలో 10%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 383 మంది మగ పిల్లలు ఉండగా, 361 మంది ఆడ పిల్లలు ఉన్నారు. ఆ విధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం తిరుమలలో బాలల లింగ నిష్పత్తి 943, ఇది సగటు లింగ నిష్పత్తి (950) కంటే తక్కువ. అక్షరాస్యత 85.7%. దీనిని అవిభాజ్య చిత్తూరు జిల్లా 71.5% అక్షరాస్యతతో పోలిస్తే తిరుమలలో అక్షరాస్యత ఎక్కువగా ఉంది. తిరుమలలో పురుషుల అక్షరాస్యత రేటు 91.33%, స్త్రీల అక్షరాస్యత రేటు 79.82%గా ఉంది.[10]

2001 గణాంకాలు

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం,[11] తిరుమలలో 7,741 మంది జనాభా ఉన్నారు. జనాభాలో పురుషులు 52 శాతం మంది ఉండగా, స్త్రీలు 48 శాతం మంది ఉన్నారు. తిరుమలలో సగటు అక్షరాస్యత 72.8 శాతం ఉంది.దీనిని జాతీయ సగటు 59.5 శాతంతో పోల్చగా ఎక్కువ ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 57.1 శాతం, స్త్రీల రేటు 42.9 శాతం. తిరుమలలో 11 శాతం జనాభా ఆరేళ్లలోపు వారే.తెలుగు ప్రధాన భాష.[12]

సంస్కృతి

తిరుమల పూర్తి శాఖాహార పట్టణం.ఇది అమలు జరపటానికి కఠిన నియమాలు అమలులో ఉన్నాయి. తిరుమలలో మాంసాహార ఉత్పత్తులు ఆహార వినియోగం, మద్యం, పొగాకు ఉత్పత్తులు వాడకం పూర్తిగా నిషేధించబడింది. దీనికి అతిక్రమించినవారు తీవ్రమైన నేరస్థులుగా పరిగణించబడతారు.[13] ధోతిస్, చీర సాంప్రదాయక దుస్తులు ఎక్కువుగా వాడతారు. వేంకటేశ్వరుని భక్తులు ఎక్కువుగా పూర్తిగా క్షవరం చేయుంచుకుని, నామాలు బొట్టు ఉపయోగించడం వంటివి పట్టణంలో ప్రసిద్ధి చెందాయి.

శ్రీహరివాసం

వేంకటేశ్వర దేవాలయం తిరుమలలో వేంకటేశ్వరుని నివాసం. దీనిని తిరుమల ఆలయం అని కూడా అంటారు.[14] ఇది నేచురల్ ఆర్చ్ ఆలయానికి ఉత్తరంగా ఉంది, ఇది 8 మీటర్లు (26 అడుగులు) వెడల్పు , 3 మీ (9.8 అడుగులు) ఎత్తుతో సహజంగా క్వార్ట్జ్ నుండి ఏర్పడింది. శ్రీవారి పాదాలు (భగవంతుని పాదముద్రలు) వేంకటేశ్వరుడు తిరుమల కొండలపై మొదటిసారిగా నిలబడినప్పుడు ఏర్పడిన పాదముద్రలు అని నమ్ముతారు.[15] పాపవినాశనం అనేది స్వర్ణముఖి నది ఉపనది నుండి ప్రవహించే జలపాతం. దేవతలు వాటి క్రింద స్నానం చేయడానికి ఎత్తు నుండి ఏడు సింహం తలలు గల కాలువలు తెరుచుకునే ఆలయం కూడా ఉంది. గంగాదేవికి అంకితం చేయబడిన ఆలయం ఆవరణకు సమీపంలో ఉంది. తిరుమలలోని మరొక సహజ జలపాతం ఆకాశ గంగ.[16]

ఉత్సవాలు, పండగలు

ప్రతి సంవత్సరం సెప్టెంబరు/అక్టోబరు నెలలో జరిగే శ్రీ వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు తిరుమలలో జరిగే అతి ముఖ్యమైన పండుగ. ఇది తొమ్మిది దినాల జరుగుతుంది.ఈ స్వల్ప వ్యవధిలో జరిగే ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు వస్తారు.[17][18] నగరంఈ నగరం సంక్రాంతి, ఉగాది మొదలైన అన్ని ప్రధాన హిందూ పండుగలను జరుపుకుంటుంది. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వారాలు తెరవబడతాయని విశ్వసించే దినం, తిరుమలలో జరుపుకుంటారు. రథసప్తమి మరొక పండుగ, ఫిబ్రవరిలో జరుపుకుంటారు,శ్రీ వేంకటేశ్వరుడు ఊరేగింపు దేవుడు (మలయప్ప) ఉదయం నుండి అర్థరాత్రి వరకు ఏడు వేర్వేరు వాహనాలపై ఆలయం చుట్టూ ఊరేగింపుగా తీసుకువెళతారు.[19][20]

తిరుపతి లడ్డు

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి లడ్డు. ఇది వెంకటేశ్వర ఆలయం తరుపున భక్తులకు విక్రయించే ప్రసాదం. తిరుపతి లడ్డు భౌగోళిక గుర్తింపు అర్హతపొందింది. తిరుమల తిరుపతి దేవస్థానం దీన్ని తయారు చేస్తుంది.[21][22]

మూలాలు

  1. "Vaishnava Divya Desha Darshana Kaipidi". 2000. Retrieved 2019-09-19.
  2. "Astabandhanam to be held from April 22". The Times of India. Retrieved 2019-09-19.
  3. Krishna, Nanditha (2000). Balaji-Venkateshwara, Lord of Tirumala-Tirupati: An Introduction. ISBN 9788187111467. Retrieved 2019-09-19.
  4. Vasumathi, V. (19 April 2018). Purandaradasa'S (And Others') 108 Verses, Transliterated, Translated and Interpreted. ISBN 9781546282815. Retrieved 2019-09-19.
  5. "District Census Handbook - Chittoor" (PDF). Census of India. p. 14,226. Retrieved 20 November 2015.
  6. "Tirumala Town Population - Chittoor, Andhra Pradesh". Censusindia2011.com. Retrieved 2023-02-05.
  7. "AP bars propagating other faiths near shrines".
  8. "Geological Survey of India - Monuments of Stratigraphic Significance". Retrieved 2015-07-22.
  9. "Archived copy". Archived from the original on 19 July 2011. Retrieved 2011-07-04.{cite web}: CS1 maint: archived copy as title (link)
  10. "Tirumala Population, Caste Data Chittoor Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2023-02-05. Retrieved 2023-02-05.
  11. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  12. "WELCOME TO CENSUS OF INDIA : Census India Library". www.censusindia.gov.in. Retrieved 2016-03-10.
  13. Raghavan, Sandeep (13 May 2020). "Scribe smuggling liquor and non-veg food to Tirumala nabbed by TTD vigilance". The Times of India. Tirupati: The Times Group. Retrieved 24 November 2021.
  14. "Tirumala Temple". Archived from the original on 11 అక్టోబరు 2007. Retrieved 13 సెప్టెంబరు 2007.
  15. "Scratch-proof glass case to cover Srivari Padalu on Tirumala". The New Indian Express. Tirumala. 18 September 2013. Archived from the original on 5 ఏప్రిల్ 2016. Retrieved 25 March 2016.
  16. "Cascading waterfalls enliven Tirumala". Deccan Chronicle. Tirupati. 11 November 2015. Retrieved 25 March 2016.
  17. "Annual Brahmotsavam starts at Tirupati-Tirumala, 1,400 CCTV cameras to keep eye on crowds". Indian Express.
  18. "Over 7 lakh Devotees Take Part In Tirumala Brahmotsavam On Concluding Day". Sakshi Post.
  19. "Pilgrims throng Tirumala". The Hindu.
  20. "Gear up for Rathasapthami: TTD EO to staff". The Hans India.
  21. "Only TTD entitled to make or sell 'Tirupati laddu': High Court". The Hindu. Retrieved 23 June 2015.
  22. "Now, Geographical Indication rights for 'Tirupati laddu'". Business Standard India. Business Standard. 28 February 2014. Retrieved 23 June 2015.


వెలుపలి లంకెలు