రమణయ్యపేట (కాకినాడ గ్రామీణ)

రమణయ్యపేట
రమణయ్యపేట పట్టణంలో ఆంధ్రాబ్యాంకు బ్రాంచి
రమణయ్యపేట పట్టణంలో ఆంధ్రాబ్యాంకు బ్రాంచి
రమణయ్యపేట is located in ఆంధ్రప్రదేశ్
రమణయ్యపేట
రమణయ్యపేట
ఆంధ్రప్రదేశ్ పటంలో రమణయ్యపేట స్థానం
Coordinates: 17°19′13″N 82°06′05″E / 17.32028°N 82.10139°E / 17.32028; 82.10139
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ
విస్తీర్ణం
 • Total9.99 కి.మీ2 (3.86 చ. మై)
జనాభా
 (2011)[1]
 • Total28,369
 • జనసాంద్రత2,800/కి.మీ2 (7,400/చ. మై.)
భాష
 • అధికారకతెలుగు
Time zoneUTC+5:30 (IST)

రమణయ్యపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా, కాకినాడ గ్రామీణ మండలం లోని జనగణన పట్టణం.[2]

గణాంకాలు

రమణయ్యపేట, కాకినాడ జిల్లా, కాకినాడ గ్రామీణ మండలానికి చెందిన జనాభా లెక్కల పట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం రమణయ్యపేట పట్టణంలో మొత్తం 7,616 కుటుంబాలు నివసిస్తున్నాయి. రమణయ్యపేట మొత్తం జనాభా 28,369 మంది ఉండగా, అందులో పురుషులు 13,989 మంది కాగా, స్త్రీలు 14,380 మంది ఉన్నారు. సగటు లింగ నిష్పత్తి 1,028.పట్టణంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2684, ఇది మొత్తం జనాభాలో 9%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 1366 మంది మగ పిల్లలు ఉండగా, ఆడ పిల్లలు 1318 మంది ఉన్నారు.బాలల లింగ నిష్పత్తి 965, ఇది సగటు లింగ నిష్పత్తి (1,028) కంటే తక్కువ.పట్టణ అక్షరాస్యత శాతం మొత్తం 87%. దీనిని అవిభాజ్య తూర్పుగోదావరి జిల్లా 71%తో పోలిస్తే రమణయ్యపేటలో అక్షరాస్యత ఎక్కువగా ఉంది. రమణయ్యపేటలో పురుషుల అక్షరాస్యత రేటు 90.26% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 83.84%గా ఉంది.[3]

పరిపాలనా నిర్వహణ

రమణయ్యపేట సెన్సస్ టౌన్ పరిధిలో మొత్తం 7,616 గృహాలకు పైగా పరిపాలనను కలిగి ఉంది.వీటికి నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి ప్రాథమిక సౌకర్యాలను స్థానిక స్వపరిపాలన సంస్థ అందిస్తుంది. సెన్సస్ టౌన్ పరిమితుల్లో రోడ్లు నిర్మించడానికి, వాటి నిర్వహణకు దాని అధికార పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్నులు విధించడానికి దీనికి అధికారం ఉంది.[3]

మూలాలు

  1. 1.0 1.1 "District Census Handbook - East Godavari" (PDF). Census of India. p. 42–43. Retrieved 18 January 2015.
  2. "Villages and Towns in Kakinada Mandal of East Godavari, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-10. Retrieved 2022-10-10.
  3. 3.0 3.1 "Ramanayyapeta Population, Caste Data East Godavari Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-10. Retrieved 2022-10-10.

వెలుపలి లంకెలు