చీనాబ్ నది
చీనాబ్ | |
---|---|
స్థానం | |
దేశం | భారతదేశం, పాకిస్థాన్ |
పరీవాహకం (భారతదేశ ప్రదేశాలు) | చంబా జిల్లా - కిష్వార్ తాత్రి - డోడా జిల్లా రంబన్ - అఖూర్ |
పరీవాహకం (పాకిస్థాన్ ప్రదేశాలు) | పంజాబ్, ఉచ్ |
భౌతిక లక్షణాలు | |
మూలం | బారాలాచా లా కనుమ |
• స్థానం | లాహుల్ అండ్ స్పిటి జిల్లా హిమాచల్ ప్రదేశ్ భారతదేశం |
• అక్షాంశరేఖాంశాలు | 32°38′09″N 77°28′51″E / 32.63583°N 77.48083°E |
సముద్రాన్ని చేరే ప్రదేశం | |
• స్థానం | బహావాల్ పూర్ జిల్లా పంజాబ్, పాకిస్థాన్ |
• అక్షాంశరేఖాంశాలు | 29°20′57″N 71°1′41″E / 29.34917°N 71.02806°E |
పొడవు | 960 కి.మీ. (600 మై.)approx. |
ప్రవాహం | |
• స్థానం | Marala Headworks[1] |
• సగటు | 977.3 m3/s (34,510 cu ft/s) |
• కనిష్టం | 310.53 m3/s (10,966 cu ft/s) |
• గరిష్టం | 31,148.53 m3/s (1,100,000 cu ft/s) |
పరీవాహక ప్రాంత లక్షణాలు | |
River system | ఇండస్ నది |
ఉపనదులు | |
• ఎడమ | తావి నది |
• కుడి | మరుసాదర్ నది [2] |
చీనాబ్ నది, భారతదేశం, పాకిస్తాన్లలో ప్రవహించే ఒక ప్రధాన నది.ఇది పంజాబ్ ప్రాంతంలో ప్రవహించే 5 ప్రధాన నదులలో ఒకటి.భారతదేశం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లాహౌల్, స్పితి జిల్లాలోని ఎగువ హిమాలయాలనుండి వృద్ధిచెందింది.ఉచ్ షరీఫ్ నగరానికి సమీపంలో ఉన్న సింధు నదిలోకి ప్రవహించే ముందు జమ్మూ కాశ్మీర్ లోని జమ్మూ ప్రాంతం గుండా పాకిస్తాన్లోని పంజాబ్ మైదానంలోకి ప్రవహిస్తుంది. సింధు జలాల ఒప్పందం నిబంధనల ప్రకారం చెనాబ్ జలాలను పాకిస్తాన్‌కు కేటాయించారు.[3] [4]
సింధూ నది ఉపనదులలో ఒకటైన చీనాబ్ నది (Chenab River) హిమాచల్ ప్రదేశ్లో చంద్ర, భాగ అనే రెండు నదుల కలయిన వలన ఏర్పడింది. అందుకే ఎగువ భాగంలో ఈనదికి చంద్రభాగ నది అని కూడా పిలుస్తారు. తదనంతరం ఈ నది సట్లెజ్ నదికి ఉపనది అయిన జీలం నదిలో కలుస్తుంది. చీనాబ్ నది యొక్క మొత్తం పొడవు దాదాపు 960 కిలోమీటల్రు. సింధూ నది జలాల ఒప్పందం ప్రకారం ఈ నది నీటివాడకాన్ని పాకిస్తాన్కు కేటాయించారు.[5][6]
భారతదేశం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, లాహౌల్, స్పితి జిల్లాలోని కీలాంగ్కు నైరుతి దిశలో 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాండి వద్ద చంద్రా, భాగా అనే రెండు నదుల సంగమం ద్వారా ఈ నది ఏర్పడింది.భాగా నది హిమాచల్ ప్రదేశ్ లోని బారా-లాచా లా రహదారిలో పశ్చిమాన కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్య తాల్ సరస్సు నుండి ఉద్భవించింది.చంద్రా నది అదే రహదారిలో తూర్పు హిమానీనదుల నుండి (చంద్ర తాల్ దగ్గర) ఉద్భవించింది.[7] ఈ రహదారులు ఈ రెండు నదుల మధ్య నీటి విభజనగా కూడా పనిచేస్తుంది.[8] సంగమం ముందు 115 కిమీ (71 మైళ్ళు) దూరంలో చంద్రా నది దాటుతుంది.తాండి వద్ద సంగమం ముందు 60 కి.మీ (37 మైళ్ళు) దూరం ఇరుకైన కొండప్రాంతాల గుండా భాగా నది వెళుతుంది.[9]
పేరు
చీనాబ్ నది Asikni ( సంస్కృతంలో అస్కిక్ని) లో ఋగ్వేదంలో (VIII.20.25, X.75.5) ప్రకారం ఈ పేరుకు ముదురు రంగు నీరు అర్థాన్ని సూచిస్తుంది. [10] క్రిషనా అనే పదం అధర్వణవేదంలో కూడా ఉంది.[11] అస్కిక్ని తరువాతి రూపం Iskamati (Sanskrit) గ్రీకు రూపం -అకేసెన్స్ లాటిన్ పదం అసిసిన్ ను సూచిస్తుంది. [10]
మహాభారతంలో నది సాధారణ పేరు చంద్రభాగా అని ఉంది (Sanskrit) ఎందుకంటే చంద్ర, భాగ నదుల సంగమం నుండి ఈ నది ఏర్పడింది.[11] ఈ పేరు ప్రాచీన గ్రీకులు వాడారు. వారు దీనిని సాండ్రోఫాగోస్, సాండబాగా, కాంటాబ్రా వంటి వివిధ రూపాల్లో గ్రీకులు వాడారు.[10]పర్షియన్ ప్రభావంతో స్పష్టమైన చంద్రభాగాను 'చెనాబ్'కు సరళీకృతం చేయడం, మధ్యయుగపు ప్రారంభ కాలంలోనే సంభవించింది.దీనిని అల్బెరునిలో చూడవచ్చు.
చరిత్ర
ఈ నది వేద కాలంలో భారతీయులకు సుపరిచితం [12] [13] [14] సా.శ.పూ. 325 లో, అలెగ్జాండర్ సింధూ సంగమం వద్ద (నేటి ఉచ్ షరీఫ్ లేదా మిథన్కోట్ లేదా చాచరన్) లోసింధు, పంజాబ్ నదుల సంయుక్త ప్రవాహం (ప్రస్తుతం దీనిని పంజ్‌నాడ్ నది అని పిలుస్తారు) వద్ద అలెగ్జాండ్రియా పట్టణాన్ని స్థాపించాడు.[15]
ఆనకట్టలు
ఈ నదికి భారతదేశంలో గొప్ప విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది.
- సలాల్ ఆనకట్ట - రియాసి సమీపంలో 690 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు
- దుల్ హస్తి జలవిద్యుత్ ప్లాంట్ - కిష్త్వార్ జిల్లా లో 390 మెగావాట్ల రకం విద్యుత్ ప్రాజెక్టు
- పాకల్ దుల్ డ్యామ్ - కిష్త్వార్ జిల్లా లోని ఉపనది మారుసదర్ నదిపై ప్రతిపాదిత ఆనకట్ట
- రాటిల్ హైడ్రోఎలెక్ట్రిక్ ప్లాంట్ - కిష్త్వార్ జిల్లా లోని ద్రాబ్‌షల్లా సమీపంలో నిర్మాణంలో ఉన్న విద్యుత్ కేంద్రం.
- కిష్త్వార్ జిల్లా లో ఉన్న కిరు జలవిద్యుత్ ప్రాజెక్టు (624 మెగావాట్ల ప్రతిపాదిత)
- కిష్త్వార్ జిల్లా లో ఉన్న క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్టు (540 మెగావాట్ల ప్రతిపాదిత)
ఇవి కూడా చూడండి
మూలాలు
- ↑ ftp://daac.ornl.gov/data/rivdis/STATIONS.HTM[permanent dead link], ORNL, Retrieved 8 Dec 2016
- ↑ "Construction of power projects over Chenab". Business Recorder. 26 August 2013. Retrieved 16 March 2017.
- ↑ "River Chenab" (PDF). Archived from the original (PDF) on 27 September 2007. Retrieved 8 Dec 2016.
- ↑ "Indus Waters Treaty". The World Bank. Archived from the original on 16 డిసెంబరు 2016. Retrieved 8 Dec 2016.
- ↑ "River Chenab" (PDF). Archived from the original (PDF) on 2007-09-27. Retrieved 2007-06-17.
- ↑ "Indus Waters Treaty". The World Bank. Archived from the original on 2016-12-16. Retrieved 2007-06-17.
- ↑ Gosal, G.S. (2004). "Physical Geography of the Punjab" (PDF). Journal of Punjab Studies. 11 (1). Center for Sikh and Punjab Studies, University of California: 31. ISSN 0971-5223. Archived from the original (PDF) on 8 June 2012. Retrieved 2009-08-06.
- ↑ R. K. Pant; N. R. Phadtare; L. S. Chamyal; Navin Juyal (June 2005). "Quaternary deposits in Ladakh and Karakoram Himalaya: A treasure trove of the palaeoclimate records" (PDF). Current Science. 88 (11): 1789–1798. Retrieved 2009-08-06.
- ↑ "Lahaul & Spiti". Archived from the original on 16 April 2019. Retrieved 7 August 2018.
- ↑ 10.0 10.1 10.2 Kaul, Antiquities of the Chenāb Valley in Jammu 2001, p. 1.
- ↑ 11.0 11.1 Kaul, Antiquities of the Chenāb Valley in Jammu 2001, p. 2.
- ↑ Yule, Henry; Burnell, Arthur Coke; Crooke, William (1903). Hobson-Jobson: A glossary of Anglo-Indian colloquial words & phrases and of kindred terms. Murray. p. 741.
chenab ancient name.
- ↑ "River, Chenab River on Encyclopædia Britannica". Retrieved 8 Dec 2016.
- ↑ Encyclopædia Britannica article on the Chenab
- ↑ "Alexandria (Uch)". Archived from the original on 2008-05-10. Retrieved 2021-04-17.