యాంగోన్
యాంగోన్
ရန်ကုန် రంగూన్ | |
---|---|
నగరం | |
దేశము | బర్మా |
ప్రాంతము | యాంగోన్ ప్రాంతము |
Settled | c. 1028–1043 |
Government | |
• నగరాధిపతి (మేయర్) | హ్లా మింట్ |
విస్తీర్ణం | |
• Total | 231.18 చ. మై (598.75 కి.మీ2) |
జనాభా (2010)[1] | |
• Total | 43,48,000 |
• జనసాంద్రత | 19,000/చ. మై. (7,300/కి.మీ2) |
• Ethnicities | బర్మర్ చిన్ రఖినె మోన్ కైయిన్ [[m:en:Burmese Chinese]|బర్మీస్ చైనీస్]] బర్మీస్ ఇండియన్స్ ఆంగ్లో బర్మీస్ |
• మతాలు | బౌద్దం క్రైస్తవం హిందూ ఇస్లాం |
Time zone | UTC+6:30 (MST) |
ప్రాంతపు కోడ్(లు) | 1, 80, 99 |
Website | www.yangoncity.com.mm |
యాంగోన్ లేదా రంగూన్ బర్మా దేశపు రాజధాని.
చరిత్ర
11 వ శతాబ్దం తొలిరోజుల్లో (circa 1028–1043) దిగువ బర్మాను పాలిస్తున్న మాన్ వంశస్థుడు పొంటారికా రాజుచే ఈ నగరం స్థాపించబడింది.[2] ఈ నగరం తొలి నామము డగన్. తొలినాళ్ళలో డగన్ ఒక చిన్న గ్రామం. చేపలు పట్టేవారు ఎక్కువగా నివసించేవారు. ష్వెడగన్ పగోడా కేంద్రంగా ఉండెడిది. 1755లో అలుంగ్ పాయ మహారాజు ఈ నగరాన్ని జయించి యాంగోన్ గా నామకరణం చేసి ఈ నగరం కేంద్రంగా పాలన సాగించాడు. 1824 నుండి 1826 వరకు జరిగిన మొదటి మొదటి ఆంగ్లో బర్మీస్ యుద్ధం లో బ్రిటీషు వాళ్ళు ఈ నగరాన్ని స్వాధీనం చేసుకుని తర్వాత బర్మా పాలనాధికారులకు దీనిని అప్పగించారు.1841 లో సంభవించిన ఒక అగ్ని ప్రమాదం కారణంగా ఈ నగరం చాలావరకు నాశనమైంది[3].
భౌగోళిక స్వరూపము
యాంగోన్ నగరం దిగువ బర్మాలో యగోన్, బగోన్ నదులు కలిసే పరాంతంలో మరతబాన్ సింధుశాఖకు సుమారు 30 కిలోమోటర్ల దూరంలో 16°48' డిగ్రీలు ఉత్తర,, 96°09' తూర్పు (16.8, 96.15) కేంద్రస్థానంలో ఉంది. ఈ నగర ప్రామాణికకాలము UTC/GMT +6:30 గంటలు.
వాతావరణము
నగర నిర్మాణము, విస్తరణ
1990 ల మధ్య వరకు ఈ నగరం బగో, యగోన్ మధ్యనున్న ద్వీపకల్పానికి పరిమితమయు ఉండేది. ప్రజలు ఎక్కువగా వలస రావడంతో నగరం విస్తరించడం ప్రారంభమయ్యింది. నగరం యొక్క 1944 చిత్రపటాలను పరిశీలిస్తే ప్రస్తుతము ఇంక్యా సరస్సు ఉత్తరభాగంలో ఉన్న నివాస ప్రాంతాల స్థానంలో గతంలో సరస్సు మిగులు జలాలు ఉండేవి. 1980 చివర్లో యాంగోన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కావడంతో ఆ ప్రాంతంలో నగరం శరవేగంగా విస్తరించింది. దీనితో నగరం ఒకే వైపు విస్తరించడం ప్రారంభమై పాత ప్రాంతాలతో పోలిస్తే కొత్తగా విస్తరించిన ప్రాంతాలలో సౌకర్యాలు మెరుగుపడ్డాయి.1901 లో 72.52 చదరపు కిలోమీటర్లుగా ఉన్న నగర విస్తీర్ణము 1940 నాటికి 86.2 చదరపు కిలోమీటర్లు, 1974 నాటికి 208.51 చదరపు కిలోమీటర్లు, 1985 నాటికి 346.13 చదరపు కిలోమీటర్లు, 2008 నాటికి 598.75 చదరపు కిలోమీటర్లు మేరకు శరవేగంగా విస్తరించింది.
పరిపాలన
యాంగోన్ నరగ పరిపాల అంతా యాంగోన్ నగర పరిపాలనా సమితి (YCDC) ద్వారా జరుగుతుంది. పరిపాలనతో బాటు నగర ప్రణాళిక బాధ్యతలు కూడా YCDC చూసుకుంటుంది.[4] నగరం మొత్తం నాలుగు జిల్లాలుగా విభజింపబడింది. ఈ జిల్లాల క్రింద 33 టౌన్‌షిప్పులు ఉన్నాయి. ప్రస్తుత నగర మేయర్ హ్లా మైంట్. ప్రతి టౌన్‌షిప్ ఒక పరిపాలన సమితి చే పరిపాలింపబడుతుంది. ఆయా టౌన్‌షిప్ సుందరీకరణపనులు, మౌలికవసతుల ఏర్పాటు ఈ సమితి ఆధ్వర్వంలో జరుగుతాయి
పశ్చిమ జిల్లా (డౌన్‌టౌన్) | తూర్పు జిల్లా | దక్షిణ జిల్లా | ఉత్తర జిల్లా |
---|---|---|---|
యాంగోన్ నగరం 21 ఆసియా పెద్ద నగరాల నెట్వర్క్ లో సభ్యత్వం కలిగి ఉంది.
రవాణా
వాయు
డౌన్ టౌన్ నుండి 12 మైళ్ళ (19 కి.మీ.) దూరంలో ఉన్న యంగో అంతర్జాతీయ విమానాశ్రయం, స్వదేశీ, అంతర్జాతీయ విమాన ప్రయాణానికి దేశం యొక్క ప్రధాన మార్గంగా ఉంది. ఈ నగరానికి ఆసియా ప్రాంతీయ నగరాల నుండి విమానాలు ఉన్నాయి - ప్రధానంగా, హనోయ్, హో చి మిన్ నగరం, బ్యాంకాక్, కౌలాలంపూర్, కన్మింగ్, సింగపూర్. దేశీయ విమానయాన సంస్థలు 20 స్వదేశీ ప్రాంతాలకు సేవలను అందిస్తాయి, చాలా సంస్థలు బగన్, మండలే, హెహో, నగపాలి వంటి పర్యాటక నగరాలకు, రాజధాని నైపీడా నగరానికి విమానాలు నడుపుతున్నాయి.
రైలు
యాంగోన్ సెంట్రల్ రైల్వే స్టేషను కేంద్రంగా మయన్మార్ రైల్వేస్' దాదాపు 5403 కిలోమీటర్ల రైలు మార్గంతో ఎగువ మయన్మార్ (నప్పైడా, మాండలే, ష్వెబు), సముద్ర తీర పైభాగాలైన (మిటిక్యానా), షాన్ హిల్స్ (టౌంగీ, లషియో), తనిథాయ్ తీరమైన (మౌలమ్యైంగ్, డవై) ప్రాంతాలకు రైలు సేవలు అందిస్తున్నది.
ఇది కాకుండా యాంగూన్ చుట్టుపక్కల 39 శాటిలైట్ నగరాలను కలుపుతూ యాంగూన్ సర్కులర్ రైల్వే 45.9 కిలోమీటర్ల మార్గంలో రైళ్ళను నడుపుతున్నది. ప్రతిరోజూ ఈ సంస్థ దాదాపు 1,50,000 టికెట్లను అమ్ముతుంది.[5] 2007 లో మయన్మార్ ప్రభుత్వము చమురు ధరలపై రాయితీ తగ్గించినప్పటినుండి ఈ రైళ్ళను వినియోగించుకునే వారి సంఖ్య మరింత పెరిగింది.[5]
రోడ్డు (బస్సులు, కార్లు)
జల రవాణా
జనాభా
1824 నుండి యాంగోన్ నగర జనాభా వృద్దిరేటును ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1824 | 10 | — |
1856 | 46 | +360.0% |
1872 | 100 | +117.4% |
1881 | 165 | +65.0% |
1891 | 181 | +9.7% |
1901 | 248 | +37.0% |
1911 | 295 | +19.0% |
1921 | 340 | +15.3% |
1931 | 400 | +17.6% |
1941 | 500 | +25.0% |
1950 | 1,302 | +160.4% |
1960 | 1,592 | +22.3% |
1970 | 1,946 | +22.2% |
1980 | 2,378 | +22.2% |
1990 | 2,907 | +22.2% |
2000 | 3,553 | +22.2% |
2010 | 4,348 | +22.4% |
2020 | 5,361 | +23.3% |
2025 | 5,869 | +9.5% |
in thousands; Sources: 1846,[3] 1872–1941,[6] 1950–2025[1] |
సంస్కృతి
ప్రసార వ్యవస్థ
యాంగోన్ నగరం చిత్రం, సంగీతం, ప్రకటన, వార్తాపత్రిక, పుస్తక ప్రచురణ పరిశ్రమలకు దేశం యొక్క కేంద్రంగా ఉంది. అన్ని సమాచారవ్యవస్థలు సైనిక ప్రభుత్వం చే నియంత్రించబడ్డాయి. టెలివిజన్ ప్రసార ప్రైవేట్ రంగానికి అనుమతి లేదు. అన్ని మీడియా కంటెంట్ మొదటి ప్రభుత్వ మీడియా, బోర్డు, ప్రెస్ స్క్రూటినీ, నమోదు విభజన సెన్సార్ చే అంగీకరింపబడాలి .
దేశంలో అత్యంత టెలివిజన్ ఛానెళ్లు యాంగోన్ నుండి ప్రసారము అవుతాయి. TV మయన్మార్, Myawaddy TV వార్తలు, వినోదంలో బర్మీస్ భాషా కార్యక్రమాలు అందించే రెండు ప్రధాన చానెళ్ళు. ఇతర ప్రత్యేక ఆసక్తి చానెల్స్ MWD-1, MWD-2, MRTV-3, ఉపగ్రహ ద్వారా విదేశీ ప్రేక్షకుల గురిపెట్టే ఆంగ్ల భాషా ఛానల్, ఇంటర్నెట్ ద్వారా, MRTV-4, ఛానల్ 7 కాని విద్యను కార్యక్రమాలు, సినిమాలు దృష్టితో ఉన్నాయి, సినిమా 5, విదేశీ సినిమాలు ప్రసారం ప్రత్యేక పే-TV ఛానల్.
యాంగోన్ లో మూడు రేడియో స్టేషన్లు ఉన్నాయి. మయన్మార్ రేడియో నేషనల్ సర్వీస్ జాతీయ రేడియో కేంద్రము. ఇక పాప్ సంస్కృతి ఆధారిత కార్యక్రమాలను యాంగోన్ సిటీ FM, మండలే FM రేడియో స్టేషన్లు బర్మీస్, ఆంగ్ల పాప్ సంగీత, వినోద కార్యక్రమాలు, ప్రత్యక్ష ప్రముఖ ఇంటర్వ్యూలను ప్రసారం చేస్తాయి.ఈ రేడియో ఛానెళ్ళే కాకుండా Shwe FM, Pyinsawaddy FM తదితరాలు కొత్త రేడియో ఛానళ్లు కూడా నగరం ప్రాంతాలలో తమ ప్రసారాలను అందజేస్తున్నాయి.
దాదాపు అన్ని ముద్రణ మాధ్యమం, పరిశ్రమలు యాంగోన్ లో కేంద్రీకృతమై ఉన్నాయి మూడు జాతీయ వార్తాపత్రికలు - రెండు బర్మా వచ్చ్చే మ్యాన్మా అలిన్, క్యిమోన్, ఆంగ్ల భాష మయన్మార్ యొక్క న్యూ లైట్ - ప్రభుత్వమే ముద్రిస్తుంది. బర్మా, ఇంగ్లీష్ లో ప్రచురితమైన సెమీ ప్రభుత్వ మయన్మార్ టైమ్స్ వీక్లీ, ప్రధానంగా యంగో యొక్క వలస ప్రజల కోసం వస్తుంది. సాధారణ పాఠకులు కోసం క్రీడలు, ఫ్యాషన్, ఫైనాన్స్, నేర, సాహిత్యం (రాజకీయాలు కాని) దాదాపు 20 పత్రికలు ప్రచురితమవుతాయి.
విదేశీ సమాచార సాధనాలను పొందడం ఇక్కడ చాలా కష్ట్రం. ఇక ఉపగ్రహ టెలివిజన్ (, Burma లో) ప్రసారాలను పొందడం చాలా ఖరీదైనది. దీనిపై ప్రభుత్వం భారీ పన్నులు విధిస్తుంది.కొన్ని విదేశీ వార్తాపత్రికలు, ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్, స్ట్రైట్స్ టైమ్స్ వంటి పత్రికలకుఎక్కువగా పట్టణ పుస్తక దుకాణాలలో మాత్రమే కొన్ని చూడవచ్చు . దేశంలో ఉత్తమ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్నా అంతర్జల సదుపాయము చాలా నెమ్మదిగా ఉన్నది, ఇది కాకుండాఅ బర్మా ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత నియంత్రణ ఇంటర్నెట్ కంట్రోల్ పద్ధతులని అమలుచేస్తుంది. 2008 ఆగస్టు నుండి అంతర్జాతీయ టెక్స్ట్ సందేశం, వాయిస్ మెసేజింగ్ అనుమతించారు.
సమాచార వ్యవస్థ
ఇతర దేశాలలోని సాధారణ సౌకర్యాలు ఈ నగరంలో విలాసవంతమైన సౌకర్యాలుగా పరిగణింపబడుతున్నాయి. ఉదాహరణకు ఒక GSM మొబైల్ ఫోన్ ధర 2008 ఆగస్టులో ఒక మిలియన్ K1.1 ధర పలికేది. 2007 లో, 55 మిలియన్ జనాభా గల ఈ దేశంలో 775,000 ఫోన్ లైన్లు (275,000 మొబైల్ ఫోన్లు సహా), 400,000 కంప్యూటర్లు ఉన్నాయి. అత్యుత్తమ మౌలిక సదుపాయములు ఉన్న యాంగోన్ లో కూడా 2004 చివరి నాటికి టెలిఫోన్ కనెక్షన్ తీసుకునే వారి వృద్ది 6 శాతం మాత్రమే. ఒక టెలిఫోన్ లైన్ కోసం సమయం వేచి అధికారిక 3.6 సంవత్సరాలుగా ఉంది. చాలా మందికి కంప్యూటర్ కొనే తాహతు లేదు. వీరంతా అంతర్జాలం ఉపయోగించడానికి నగరవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ సెంటర్లను ఆశ్రయించవలసిందే. అంతర్జాలం పై కూడా అనేక ఆంక్షలు విధింపబడ్డాయి అధికారిక గణాంకాల ప్రకారం, 2010 జూలైలో 400,000 పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. వీరంతా కూడా యాంగోన్, మాండలే నగరాలలోనే ఎక్కువగా ఉన్నారు. కలిగి రెండు నగరాల్లో, యంగో, మండలే. దేశవ్యాప్తంగా 42 నగరాల్లో అంతర్జాలం అందుబాటులో ఉన్నప్పటికీ యాంగోన్, మాండలే రెండు ప్రధాన నగరాల వెలుపలి వినియోగదారుల సంఖ్య కేవలం 10,000 మాత్రమే.
ప్రజల జీవనశైలి
దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే యాంగోన్ లో స్థిరాస్థి క్రయవిక్రయాలు చాలా ఖరీదైనవి. చాలా మంది యాంగోన్ నగర శివార్లలో నివాసముంటారు. కేవలం కొందరికి మాత్రమే నగరంలోని అద్దెలను భరించే తాహతు ఉంది. 2008 గణాంకాల ప్రకారం 650 - 750 చదరపు అడుగుల నివాస స్థలాల అద్దెలు మధ్యతరగతి విభాగంలో K70,000 - K150,000 మధ్య, ఎగువశ్రేణిలో K200,000 -K500,000 మధ్య ఉన్నాయి.అన్ని వయసుల వారు (పురుషులు, కొందరు మహిళలు) నగరం యొక్క ఏ మూల లేదా వీధి కనిపించే టీ దుకాణాల్లో తమ సమయాన్ని వెచ్చిస్తారు. ఇంగ్లీష్ ప్రీమియర్ ఫుట్‌బాల్ ఆటల పోటీలను చూస్తూ తేనీరు సేవించడం ఇక్కడ ధనిక, పేద ప్రజల ప్రధాన కాలక్షేపం. సగటు పౌరుల నివాసగృహాలు కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి. వారాంతాల్లో షాపింగ్ మాల్స్ రద్దీగా ఉంటాయి. ఇంతేకాకుండా యాంగోన్ లో అనేక పగోడా మహోత్సవాలకు పేరుపొందింది. ఇవి నవంబరు నుంచి మార్చి వరకు జరుగుతుంటాయి. మార్చిలో జరిగే ష్వెడగాన్ పగోడా ఉత్సవము ప్రపంచవ్యాప్తంగా అనేకమందిని ఆకర్షిస్తుంది. సందర్శకులు, స్థానికులు ఇక్కడి యాంగోన్ మ్యూజియంలు కూడా విరివిగా సందర్శస్తుంటారు. యాత్రికులను ఆకట్టుకునేందుకు యాంగోన్ లోని కొన్ని హోటళ్ళు రాత్రి వేళ పలు వినోద, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తుంటాయి. కొన్ని సంప్రదాయ బర్మా నాట్య కార్యక్రమాలను ఏర్పాటుచేస్తే మరికొన్ని సంప్రదాయ బర్మా వాద్య కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటాయి. ఇతర ఆసియా దేశాల మాదిరిగా పబ్ లలో ఇంచుమించు అన్ని వినోద, విలాస కార్యక్రమాలు జరుగుతుంటాయి.
అత్యధిక ద్రవ్యోల్పణం, ద్రవ్య చలామణి కొరత, ఎక్కువ మందికి చెక్కులు, క్రెడిట్, డెబిట్ కార్డులు భరించే తాహతు లేకపోవడం వలన ఎక్కువ మంది ప్రజలు నగదు చలామణి ద్వారా చెల్లింపులు జరుపుతుంటారు. కేవలం అతి కొద్ది విలాస హోటళ్ళలో మాత్రమే క్రెడిట్ కార్డులు చెల్లుబాటు అవుతాయి.
క్రీడలు
దేశంలోనే అత్యంత ఉత్తమమైన్ క్రీడా సదుపాయాలు ఇక్కడ ఉండటం వలన సాలీనా అనేక క్రీడాపోటీలు జరుగుతుంటాయి. 40000 సీటింగ్ సామర్థ్యం గల ఆంగ్ సాంగ్ స్టేడియం, 32000 సీటింగ్ సామర్థ్యం గల తువునా స్టేడియం లలో అత్యంత ప్రజాదరణా కలిగిన వార్షిక ఫుట్‌బాల్ పోటీలు వీక్షించడానికి ప్రజలు భారీగా తరలి వస్తారు. స్థానికంగా 16 జట్లు పాల్గొనే మయన్మార్ ప్రీమియర్ లీగ్ ప్రజలలో ఫుట్‌బాల్ క్రీడ పట్ల కొంత ఆసక్తిని కలిగిస్తున్నది. ఎక్కువమంది క్రీడా ప్రేమికులు శాటిలైట్ టెలివిజన్ లో యూరోపియన్ ఫుట్‌బాల్ చూడటానికి అమితాసక్తి ప్రదర్శిస్తారు.
మయన్మార్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్, మయన్మార్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లు యాంగోన్ లో ప్రతి ఏటా జరుగుతాయి. అంతేకాకుండా 1961, 1969 లో జరిగిన సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్ కూడా ఈ నగరం ఆతిధ్యం ఇచ్చింది. బర్మాలో నివసించిన బ్రిటీష్ వారు ఒకప్పుడు క్రికెట్ ఆడేవారు. 1927 జవవరిలో మెల్బోర్న్ క్రికెట్ క్లబ్, బర్మాల మధ్య స్థానిక రంగూన్ జింఖానా మైదానంలో క్రికెట్ పోటీ జరిగింది.
ఆర్థిక వ్యవస్థ
విద్యా సదుపాయములు
ఆరోగ్య సదుపాయములు
పర్యాటక ప్రదేశములు
పగోడాలు
- ష్వెడగాన్ పగోడా
- సులే పగోడా
- బొటటంగ్ పగోడా
- చౌక్ హ్తత్ గ్యి పగోడా ( Chauk Htat Gyi Pagoda)
- క్యౌక్దౌగి పగోడా (Kyaukdawgyi Pagoda)
- కబ అయే పగోడా
మనోల్లాస కేంద్రాలు
- తౌక్క్యాన్ వార్ సెమెట్రీ
- బొగ్యోక్ మార్కెట్ (Scott's Market)
- ఇన్యా లేక్ (formerly Lake Victoria)
- కండవ్గ్యి లేక్ (formerly Royal Lake)
- హలౌగ నేషనల్ పార్క్
- మహాబందుల పార్క్
- పీపుల్స్ స్క్వేర్ అండ్ పీపుల్స్ పార్క్
- సెయెంట్ మేరీస్ కెథెడ్రెల్
- యాంగోన్ విశ్వవిద్యాలయము
- యాంగోన్ జంతుప్రదర్శనశాల
మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు
- నేషనల్ మ్యూజియం ఆఫ్ మయన్మార్
- రక్షణశాష మ్యూజియం, యాంగోన్
- మయన్మార్ రత్నాల మ్యూజియం
- బోగ్యోకే ఆంగ్ సాన్ మ్యూజియం
- యాంగోన్ డ్రగ్స్ ఎలిమినేషన్ మ్యూజియం
- బర్మా పార్లమెంటు
సోదర నగరంలు
చిత్రమాలిక
-
One of many houses destroyed during Cyclone Nargis
-
Yangon metropolitan area
-
A colonial-era building
-
An apartment building in the downtown section
బయటి లంకెలు
- గూగుల్ పటములు - ఉపగ్రహ చిత్రము
- యాంగోన్ నగర వెబ్సైటు
- BBC లో యాంగోన్ లో బ్రిటీష్ కలోనియల్ సంస్కృతిపై ఒక వ్యాసము
యాంగోన్
| ||
అంతకు ముందువారు మౌలామ్యైంగ్, సిత్వె, యాంగోన్ |
బ్రిటీష్ బర్మా రాజధాని 31 జనవరి 1862 – 7 మార్చి1942 3 మే1945 – 4 జనవరి 1948 |
తరువాత వారు బ్రిటీష్ పాలన అంతం |
అంతకు ముందువారు ఏదీ లేదు |
జపనీస్ బర్మా రాజధాని 7 మార్చి 1942 – 3 మే1945 |
తరువాత వారు జపనీస్ పాలన అంతం |
అంతకు ముందువారు మాండలే |
బర్మా రాజధాని 4 జనవరి 1948 – 6 నవంబరు 2005 |
తరువాత వారు నైపైడ |
మూలాలు
- ↑ 1.0 1.1 "United Nations World Urbanization Prospects, 2007 revision". United Nations. Archived from the original on 18 జూన్ 2009. Retrieved 27 ఏప్రిల్ 2010.
- ↑ Founded during the reign of King Pontarika, per Charles James Forbes Smith-Forbes (1882). Legendary History of Burma and Arakan. The Government Press. p. 20.; the king's reign was 1028 to 1043 per Harvey, G. E. (1925). History of Burma: From the Earliest Times to 10 March 1824. London: Frank Cass & Co. Ltd. p. 368.
- ↑ 3.0 3.1 Kyaw Kyaw (2006). Frauke Krass, Hartmut Gaese, Mi Mi Kyi (ed.). Megacity yangon: transformation processes and modern developments. Berlin: Lit Verlag. pp. 333–334. ISBN 3-8258-0042-3.
{cite book}
: CS1 maint: multiple names: editors list (link) - ↑ "Yangon". Asian Network of Major Cities 21. Archived from the original on 20 జూన్ 2006. Retrieved 13 ఆగస్టు 2006.
- ↑ 5.0 5.1 Yeni (30 జనవరి 2008). "The Railway Bazaar". The Irrawaddy. Archived from the original on 8 ఫిబ్రవరి 2008. Retrieved 2 జూలై 2013.
- ↑ ఉల్లేఖన హెచ్చరిక:
tmmt
పేరుతో ఉన్న<ref>
ట్యాగును మునుజూపులో చూపలేం. ఎందుకంటే అది ప్రస్తుత విభాగానికి బయటైనా ఉండి ఉండాలి, లేదా అసలు దాన్ని నిర్వచించకపోయి అయినా ఉండాలి.