వొలొదిమిర్ జెలెన్‌స్కీ

వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ
వొలొదిమిర్ జెలెన్‌స్కీ


పదవీ కాలం
20 మే 2019 – ప్రస్తుతం
ప్రధాన మంత్రి
  • వ్లాదిమిర్‌ గ్రోయస్మాన్
    (2016–2019)
  • ఓలెక్సి హాన్చరుక్
    (2019–2020)
  • డెనీస్ షమిహల్
    (2020 – ప్రస్తుతం)
ముందు పెట్రో పోరోషెంకో

వ్యక్తిగత వివరాలు

జననం (1978-01-25) 1978 జనవరి 25 (వయసు 46)
క్రైవీ రిహ్‌, సోవియన్‌ యూనియన్‌ (ప్రస్తుతం క్రైవీ రిహ్‌, ఉక్రెయిన్)
రాజకీయ పార్టీ స్వతంత్ర
ఇతర రాజకీయ పార్టీలు సర్వెంట్‌ ఆఫ్‌ ద పీపుల్‌ పార్టీ (2018–ప్రస్తుతం)
తల్లిదండ్రులు
  • ఓలెక్సాండ్ర్ జెలెన్స్కీ
  • రీమా జెలెన్స్కా
జీవిత భాగస్వామి
ఒలెనా జెలెన్స్కా
(m. 2003)
సంతానం 1 కుమారుడు, 1 కుమార్తె
నివాసం మరియిన్స్కీకి ప్యాలస్
వృత్తి
  • రాజకీయ నాయకుడు
  • నటుడు
  • స్క్రిప్ట్‌ రైటర్‌
  • నిర్మాత
సంతకం వొలొదిమిర్ జెలెన్‌స్కీ's signature

వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ ఉక్రెయిన్ దేశానికి చెందిన నటుడు, స్క్రిప్ట్‌ రైటర్‌, నిర్మాత, రాజకీయ నాయకుడు. ఆయన 2019 ఏప్రిల్‌ 21న ఉక్రెయిన్ దేశ 6వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[1]

జననం, విద్యాభాస్యం

వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ 1978 జనవరి 25న అప్పటి క్రైవీ రిహ్‌, ఉక్రెయిన్ (అప్పుడు సోవియన్‌ యూనియన్‌) లో జన్మించాడు. ఆయన కీవ్‌లో ప్రాథమిక విద్య, కళాశాల విద్య పూర్తి చేసి అనంతరం 2000 సంవత్సరంలో కీవ్‌ నేషనల్‌ ఎకనామిక్‌ యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు.

నటించిన సినిమాలు

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు
2009 లవ్ ఇన్ ది బిగ్ సిటీ ఇగోర్
2011 ఆఫీస్ రొమాన్స్. అవర్ టైం అనటోలీ
2012 లవ్ ఇన్ ది బిగ్ సిటీ 2 ఇగోర్
2012 రజ్హేవ్స్కీ వర్సెస్ నెపోలియన్ నెపోలియన్
2012 8 ఫస్ట్ డేట్స్ నికిత సోకోలోవ్
2014 లవ్ ఇన్ వేగాస్ ఇగోర్ జెలెన్స్కీ
2015 8 న్యూ డేట్స్ నికిత ఆండ్రీవిచ్ సోకోలోవ్
2018 ఐ, యు, హి, షీ మాకియం త్కచెంకో

టివి సిరీస్ & షోస్

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర
2006 డాన్సింగ్ విత్ ది స్టార్స్ (యుక్రెయిన్) కంటెస్టెంట్
2008–2012 వాటీ నిర్మాతగా
2015–2019 "సర్వెంట్ ఆఫ్ ది పీపుల్" వాసిలీ గోలోబోరోడ్కో

రాజకీయ జీవితం

వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ నటించిన "సర్వెంట్ ఆఫ్ ది పీపుల్" 2015 అక్టోబరులో 1+1 నెట్‌వర్క్‌లో ప్రసారమైంది. అందులో జెలెన్‌స్కీ 'వాసిలీ గోలోబోరోడ్కో' అనే ప్రొఫెసర్ పాత్రలో నటించాడు. 2018లో "సర్వెంట్ ఆఫ్ ది పీపుల్" నిర్మించిన 'క్వార్టల్ 95టటీవీ నిర్మాణ సంస్థ అదే పేరుతో పార్టీని ఏర్పాటు చేసింది. 2019లో జరిగిన ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 130 సీట్లకు గాను ‘సర్వెంట్‌ ఆఫ్‌ ద పీపుల్‌’ పార్టీ 124 సీట్లు గెలుచుకుంది. జెలెన్‌స్కీ 2019 ఏప్రిల్‌ 21న ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా ఎన్నికై 2019 మే 20న ఉక్రెయిన్ ఆరోవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[2][3][4]

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు