2003 క్రికెట్ ప్రపంచ కప్

2003 క్రికెట్ ప్రపంచ కప్
Official logo
తేదీలు2003 ఫిబ్రవరి 9 – 2003 మార్చి 23
నిర్వాహకులుఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
క్రికెట్ రకంవన్ డే ఇంటర్నేషనల్
టోర్నమెంటు ఫార్మాట్లురౌండ్ రాబిన్, నాకౌట్
ఆతిథ్యం ఇచ్చేవారు
  • దక్షిణ ఆఫ్రికా
  • జింబాబ్వే
  • కెన్యా
ఛాంపియన్లు ఆస్ట్రేలియా (3rd title)
పాల్గొన్నవారు14
ఆడిన మ్యాచ్‌లు54
ప్రేక్షకుల సంఖ్య6,26,845 (11,608 ఒక్కో మ్యాచ్‌కు)
మ్యాన్ ఆఫ్ ది సీరీస్భారతదేశం సచిన్ టెండూల్కర్
అత్యధిక పరుగులుభారతదేశం సచిన్ టెండూల్కర్ (673)
అత్యధిక వికెట్లుశ్రీలంక చమిందా వాస్ (23)
1999
2007

2003 ICC క్రికెట్ ప్రపంచ కప్ ఎనిమిదవ క్రికెట్ ప్రపంచ కప్, దీనిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహించింది. దీనికి దక్షిణాఫ్రికా, జింబాబ్వేమ్ కెన్యాలు 2003 ఫిబ్రవరి 9 నుండి మార్చి 23 వరకు ఉమ్మడిగా నిర్వహించాయి. ప్రపంచకప్‌ తొలిసారిగా ఆఫ్రికాలో జరిగింది.

ఈ టోర్నమెంట్‌లో 14 జట్లు పాల్గొన్నాయి. అప్పటికి ప్రపంచ కప్ చరిత్రలో అది అతిపెద్ద సంఖ్య. మొత్తం 54 మ్యాచ్‌లు జరిగాయి. 1999 క్రికెట్ ప్రపంచ కప్‌లో ప్రవేశపెట్టిన ఫార్మాట్‌ను అనుసరించింది, జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లోని మొదటి మూడు సూపర్ సిక్స్‌ల దశకు అర్హత సాధించాయి.

టోర్నమెంట్‌లో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్‌లు అనేక పరాజయాలతో, గ్రూప్ దశలోనే నిష్క్రమించాయి. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, డక్‌వర్త్-లూయిస్ పద్ధతిలో సవరించిన లక్ష్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల గెలవాల్సిన మ్యాచ్‌ని టై చేసుకుంది.[1] జింబాబ్వేలో నెలకొన్న రాజకీయ అశాంతి కారణంగా ఆ జట్టుతో జరగాల్సిన మ్యాచ్‌ను ఇంగ్లాండ్ ఆడకుండా వదిలేసింది. దాంతో జింబాబ్వే సూపర్ సిక్స్‌కు చేరుకుంది. అదే విధంగా, కెన్యాలో భద్రతా కారణాల వల్ల న్యూజిలాండ్ కెన్యాతో మ్యాచ్‌ను ఆడకుండా వదిలేసింది. దాంతో కెన్యా సెమీ-ఫైనల్‌కు చేరుకోగలిగింది. టెస్టులు ఆడని దేశం ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. టోర్నమెంట్ ప్రారంభమైన రెండు రోజుల తర్వాత మరో షాక్ వచ్చింది; ఆ సమయంలో ఆటలో ప్రముఖ స్పిన్నర్‌లలో ఒకరైన షేన్ వార్న్, నిషేధిత పదార్థం సేవించినట్లు తేలడంతో ఆస్ట్రేలియా అతన్ని ఇంటికి పంపించేసింది.[2]


జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి, కప్పు గెలుచుకుంది. [3] ఆస్ట్రేలియాకు ఇది మూడో ప్రపంచకప్ విజయం. ఈ ఘనత సాధించిన ఏకైక జట్టు అది. పాకిస్తానీ ఆటగాడు షోయబ్ అక్తర్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అతను ఇంగ్లాండ్‌తో జరిగిన పూల్ మ్యాచ్‌లో 161.3 కిమీ/గం రికార్డు వేగంతో బౌలింగు చేసాడు.[4][5][6]

పూర్తి సభ్యులు
 బంగ్లాదేశ్  ఆస్ట్రేలియా
 ఇంగ్లాండు  భారతదేశం
 న్యూజీలాండ్  పాకిస్తాన్
 దక్షిణాఫ్రికా  శ్రీలంక
 వెస్ట్ ఇండీస్  జింబాబ్వే
అసోసియేట్ సభ్యులు
 కెన్యా  కెనడా
 నమీబియా  నెదర్లాండ్స్

హోస్ట్ నగరాలు, వేదికలు

నగరాలు వేదికలు కెపాసిటీ మ్యాచ్‌లు
దక్షిణాఫ్రికా జోహన్నెస్‌బర్గ్ వాండరర్స్ స్టేడియం 34,000 5
దక్షిణాఫ్రికా డర్బన్ సహారా స్టేడియం కింగ్స్‌మీడ్ 25,000 5
దక్షిణాఫ్రికా కేప్ టౌన్ న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్ 25,000 5
దక్షిణాఫ్రికా సెంచూరియన్ సెంచూరియన్ పార్క్ 23,000 5
దక్షిణాఫ్రికా బ్లామ్ ఫాంటేయిన్ గుడ్‌ఇయర్ పార్క్ 20,000 5
దక్షిణాఫ్రికా పోర్ట్ ఎలిజబెత్ సెయింట్ జార్జ్ ఓవల్ 19,000 5
దక్షిణాఫ్రికా పోచెఫ్స్ట్రూమ్ నార్త్ వెస్ట్ క్రికెట్ స్టేడియం 18,000 3
దక్షిణాఫ్రికా ఈస్ట్ లండన్ బఫెలో పార్క్ 16,000 3
దక్షిణాఫ్రికా కింబర్లీ డి బీర్స్ డైమండ్ ఓవల్ 11,000 3
దక్షిణాఫ్రికా పార్ల్ బోలాండ్ పార్క్ 10,000 3
దక్షిణాఫ్రికా బెనోని విల్లోమూర్ పార్క్ 20,000 2
దక్షిణాఫ్రికా పీటర్మారిట్జ్బుర్గ్ పీటర్‌మారిట్జ్‌బర్గ్ ఓవల్ 12,000 2
జింబాబ్వే హరారే హరారే స్పోర్ట్స్ క్లబ్ 10,000 3
జింబాబ్వే బులవాయో క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ 9,000 3
కెన్యా నైరోబి నైరోబి జింఖానా క్లబ్ 8,000 2

 

 

 

పూల్ దశ

ప్రతి పూల్ నుండి మొదటి మూడు జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తాయి. తోటి క్వాలిఫైయర్‌లపై ఇప్పటికే స్కోర్ చేసిన పాయింట్లకు, క్వాలిఫై కాని జట్లపై అవి సాధించిన పాయింట్లలో నాలుగో వంతును కలుపుకుని తరువాతి దశకు వెళ్తాయి. [7]

పూల్ A

స్థానం జట్టు గె ఫ.తే టై నెట్ రన్ రేట్ పాయింట్లు క్యారీ ఫార్వర్డ్ పాయింట్లు
1  ఆస్ట్రేలియా 6 6 0 0 0 2.05 24 12
2  భారతదేశం 6 5 1 0 0 1.11 20 8
3  జింబాబ్వే 6 3 2 1 0 0.50 14 3.5
4  ఇంగ్లాండు 6 3 3 0 0 0.82 12
5  పాకిస్తాన్ 6 2 3 1 0 0.23 10
6  నెదర్లాండ్స్ 6 1 5 0 0 -1.45 4
7  నమీబియా 6 0 6 0 0 -2.96 0
2003 ఫిబ్రవరి 10
స్కోరు
జింబాబ్వే 
340/2 (50 ఓవర్లు)
v
 నమీబియా
104/5 (25.1 ఓవర్లు)
క్రేగ్ విషార్ట్ 172* (151)
Lennie Louw 1/60 (10 ఓవర్లు)
Danie Keulder 27 (46)
గై విటాల్ 2/20 (5 ఓవర్లు)
జింబాబ్వే 86 పరుగులతో గెలిచింది (డ-లూ పద్ధతి)
హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే
అంపైర్లు: డేవిడ్ ఆర్చర్డ్ (దక్షి), సైమన్ టఫ్నెల్ (ఆస్ట్రే)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: క్రేగ్ విషార్ట్ (జింబా)
  • నమీబియా టాస్ గెలిచి ఫీల్డీంగు ఎంచుకుంది.
  • నమీబియా ఇన్నింగ్సును వర్షం అడ్డుకుంది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో జింబాబ్వే 86 పరుగులతో గెలిచింది.
  • పాయింట్లు: జింబాబ్వే 4, నమీబియా 0

2003 ఫిబ్రవరి 11
స్కోరు
ఆస్ట్రేలియా 
310/8 (50 ఓవర్లు)
v
 పాకిస్తాన్
228 (44.3 ఓవర్లు)
రషీద్ లతీఫ్ 33 (23)
ఇయాన్ హార్వే 4/58 (9.3 ఓవర్లు)
ఆస్ట్రేలియా 82 పరుగులతో గెలిచింది
వాండరర్స్ స్టేడియమ్, జోహన్నెస్‌బర్గ్
అంపైర్లు: అశోక డి సిల్వా (శ్రీ), డేవిడ్ షెపర్డ్ (ఇంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆండ్రూ సైమండ్స్ (ఆస్ట్రే)
  • పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
  • పాయింట్లు: ఆస్ట్రేలియా 4, పాకిస్తాన్ 0

2003 ఫిబ్రవరి 12
స్కోరు
భారతదేశం 
204 (48.5 ఓవర్లు)
v
 నెదర్లాండ్స్
136 (48.1 ఓవర్లు)
సచిన్ టెండుల్కర్ 52 (72)
టిమ్ డి లీడ్ 4/35 (9.5 ఓవర్లు)
Daan van Bunge 62 (116)
అనిల్ కుంబ్లే 4/32 (10 ఓవర్లు)
ఇండియా 68 పరుగులతో గెలిచింది
బోలండ్ పార్క్, పార్ల్
అంపైర్లు: డారిల్ హార్పర్ (ఆస్ట్రే), పీటర్ విల్లీ (ఇంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: టిమ్ డి లీడ్ (నెద)
  • ఇండియా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
  • పాయింట్లు: ఇండియా 4, నెదర్లాండ్స్ 0.

2003 ఫిబ్రవరి 13
స్కోరు
v
జింబాబ్వే won (walkover without a ball bowled)
హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే
అంపైర్లు: డేవిడ్ ఆర్చర్డ్ (దక్షి), స్టీవ్ బక్నర్ (వెస్టిం)
  • టాస్ వెయ్యలేదు
  • పాయింట్లు: జింబాబ్వే 4, ఇంగ్లాండ్ 0
  • భద్రతా కారణాల రీత్యా ఇంగ్లాండ్ మ్యాచ్‌ను వదిలేసుకుంది

2003 ఫిబ్రవరి 15
స్కోరు
భారతదేశం 
125 (41.4 ఓవర్లు)
v
 ఆస్ట్రేలియా
128/1 (22.2 ఓవర్లు)
సచిన్ టెండుల్కర్ 36 (59)
జాసన్ జిల్లెస్పీ 3/13 (10 ఓవర్లు)
ఆస్ట్రేలియా 9 వికెట్లతో గెలిచింది
సెంచూరియన్ పార్క్, సెంచూరియన్
అంపైర్లు: అశోక డి సిల్వా (శ్రీ), డేవిడ్ షెపర్డ్ (ఇంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జాసన్ జిల్లెస్పీ (ఆస్ట్రే)
  • ఇండియా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
  • పాయింట్లు: ఆస్ట్రేలియా 4, ఇండియా 0.

2003 ఫిబ్రవరి 16
స్కోరు
నెదర్లాండ్స్ 
142/9 (50 ఓవర్లు)
v
 ఇంగ్లాండు
144/4 (23.2 ఓవర్లు)
టిమ్ డి లీడ్ 58* (96)
జేమ్స్ ఆండర్సన్ 4/25 (10 ఓవర్లు)
మైకెల్ వాన్ 51 (47)
Daan van Bunge 3/16 (3 ఓవర్లు)
ఇంగ్లాండ్ 6 వికెట్లతో గెలిచింది
బఫెలో పార్క్, ఈస్ట్ లండన్
అంపైర్లు: డారెల్ హెయిర్ (ఆస్ట్రే), రుడీ కోయెర్ట్జెన్ (దక్షి)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లా)
  • ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
  • పాయింట్లు: ఇంగ్లాండ్ 4, నెదర్లాండ్స్ 0
  • నిక్ స్టాథమ్ (నెదర్లాండ్స్) వన్‌డేల్లో రంగ ప్రవేశం చేసాడు

2003 ఫిబ్రవరి 16
స్కోరు
పాకిస్తాన్ 
255/9 (50 ఓవర్లు)
v
 నమీబియా
84 (17.4 ఓవర్లు)
సలీమ్ ఎలాహి 63 (100)
జోర్న్ కోట్జె 2/51 (10 ఓవర్లు)
జోర్న్ కోట్జె 24* (29)
వసీం అక్రమ్ 5/28 (9 ఓవర్లు)
పాకిస్తాన్ 171 పరుగులతో గెలిచింది
డీ బీర్స్ డైమండ్ ఓవల్, కింబర్లీ
అంపైర్లు: డేవిడ్ ఆర్చర్డ్ (దక్షి), నీల్ మాలెండర్ (ఇంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వసీం అక్రమ్ (పాకి)
  • పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
  • పాయింట్లు: పాకిస్తాన్ 4, నమీబియా 0

2003 ఫిబ్రవరి 19
స్కోరు
భారతదేశం 
255/7 (50 ఓవర్లు)
v
 జింబాబ్వే
172 (44.4 ఓవర్లు)
తతెందా తైబు 29* (44)
సౌరవ్ గంగూలీ 3/22 (5 ఓవర్లు)
ఇండియా 83 పరుగులతో గెలిచింది
హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే
అంపైర్లు: అశోక డి సిల్వా (శ్రీ), రుడీ కోయెర్ట్జెన్ (దక్షి)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సచిన్ టెండుల్కర్ (భా)
  • జింబాబ్వే టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: ఇండియా 4, జింబాబ్వే 0.

2003 ఫిబ్రవరి 19
స్కోరు
ఇంగ్లాండు 
272 (50 ఓవర్లు)
v
 నమీబియా
217/9 (50 ఓవర్లు)
అలెక్ స్టీవర్ట్ 60 (77)
Rudi van Vuuren 5/43 (10 ఓవర్లు)
Jan-Berrie Burger 85 (86)
రోనీ ఇరానీ 3/30 (8 ఓవర్లు)
ఇంగ్లాండ్ 55 పరుగులతో గెలిచింది
సెంట్ జార్జ్ పార్క్ క్రికెట్ గ్రౌండ్, పోర్ట్ ఎలిజబెత్
అంపైర్లు: సైమన్ టఫ్నెల్ (ఆస్ట్రే), వెంకట రాఘవన్ (భా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Jan-Berrie Burger (నమీ)
  • నమీబియా టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: ఇంగ్లాండ్ 4, నమీబియా 0

2003 ఫిబ్రవరి 20
స్కోరు
ఆస్ట్రేలియా 
170/2 (36 ఓవర్లు)
v
 నెదర్లాండ్స్
122 (30.2 ఓవర్లు)
డామియెన్ మార్టిన్ 67* (76)
టిమ్ డి లీడ్ 2/34 (7 ఓవర్లు)
టిమ్ డి లీడ్ 24 (38)
ఆండీ బికెల్ 3/13 (3 ఓవర్లు)
ఆస్ట్రేలియా 75 పరుగులతో గెలిచింది (డ-లూ పద్ధతి)
సెన్వెస్ పార్క్, పోచెఫ్‌స్ట్రూమ్
అంపైర్లు: డేవిడ్ ఆర్చర్డ్ (దక్షి), పీటర్ విల్లీ (ఇంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: డామియెన్ మార్టిన్ (ఆస్ట్రే)
  • నెదర్లాండ్స్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
  • వర్షం కారణంగా ఒక్కో జట్టుకు 36 ఓవర్లుండేలా మ్యాచ్‌ను కుదించారు
  • పాయింట్లు: ఆస్ట్రేలియా 4, నెదర్లాండ్స్ 0

2003 ఫిబ్రవరి 22
స్కోరు
ఇంగ్లాండు 
246/8 (50 ఓవర్లు)
v
 పాకిస్తాన్
134 (31 ఓవర్లు)
పాల్ కాలింగ్‌వుడ్ 66* (73)
సక్లైన్ ముస్తాక్ 2/44 (10 ఓవర్లు)
ఇంగ్లాండ్ 112 పరుగులతో గెలిచింది
న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్ టౌన్
అంపైర్లు: Brian Jerling (దక్షి), రుడీ కోయెర్ట్జెన్ (దక్షి)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లా)
  • ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: ఇంగ్లాండ్ 4, పాకిస్తాన్ 0

2003 ఫిబ్రవరి 23
స్కోరు
భారతదేశం 
311/2 (50 ఓవర్లు)
v
 నమీబియా
130 (42.3 ఓవర్లు)
సచిన్ టెండుల్కర్ 152 (151)
Rudi van Vuuren 2/53 (10 ఓవర్లు)
Jan-Berrie Burger 29 (30)
యువరాజ్ సింగ్ 4/6 (4.3 ఓవర్లు)
ఇండియా 181 పరుగులతో గెలిచింది
సితీ ఓవల్, పయటర్‌మారిట్జ్‌బర్గ్
అంపైర్లు: అలీమ్ దార్ (పాకి), డేవిడ్ షెపర్డ్ (ఇంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సచిన్ టెండుల్కర్ (భా)
  • నమీబియా టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: ఇండియా 4, నమీబియా 0

2003 ఫిబ్రవరి 24
స్కోరు
జింబాబ్వే 
246/9 (50 ఓవర్లు)
v
 ఆస్ట్రేలియా
248/3 (47.3 ఓవర్లు)
ఆండీ ఫ్లవర్ 62 (91)
బ్రాడ్ హాగ్ 3/46 (8 ఓవర్లు)
ఆడమ్ గిల్‌క్రిస్ట్ 61 (64)
డౌగీ మరిల్లియర్ 1/32 (10 ఓవర్లు)
ఆస్ట్రేలియా 7 వికెట్లతో గెలిచింది
క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో
అంపైర్లు: బిల్లీ బౌడెన్ (న్యూ), డేవిడ్ ఆర్చర్డ్ (దక్షి)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆండీ బ్లిగ్నాట్ (జింబా)
  • జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: ఆస్ట్రేలియా 4, జింబాబ్వే 0

2003 ఫిబ్రవరి 25
స్కోరు
పాకిస్తాన్ 
253/9 (50 ఓవర్లు)
v
 నెదర్లాండ్స్
156 (39.3 ఓవర్లు)
మొహమ్మద్ యూసుఫ్ 58 (59)
టిమ్ డి లీడ్ 2/53 (10 ఓవర్లు)
Daan van Bunge 31 (60)
వసీం అక్రమ్ 3/24 (8.3 ఓవర్లు)
పాకిస్తాన్ 97 పరుగులతో గెలిచింది
బోలండ్ పార్క్, పార్ల్
అంపైర్లు: వెంకట రాఘవన్ (భా), స్టీవ్ బక్నర్ (వెస్టిం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మొహమ్మద్ యూసుఫ్ (పాకి)
  • నెదర్లాండ్స్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
  • పాయింట్లు: పాకిస్తాన్ 4, నెదర్లాండ్స్ 0

2003 ఫిబ్రవరి 26
స్కోరు
భారతదేశం 
250/9 (50 ఓవర్లు)
v
 ఇంగ్లాండు
168 (45.3 ఓవర్లు)
రాహుల్ ద్రావిడ్ 62 (72)
ఆండ్రూ కాడిక్ 3/69 (10 ఓవర్లు)
ఆండ్రూ ఫ్లింటాఫ్ 64 (73)
ఆశిష్ నెహ్రా 6/23 (10 ఓవర్లు)
ఇండియా 82 పరుగులతో గెలిచింది
కింగ్స్‌మీడ్ క్రికెట్ గ్రౌండ్, డర్బన్
అంపైర్లు: రుడీ కోయెర్ట్జెన్ (దక్షి), సైమన్ టఫ్నెల్ (ఆస్ట్రే)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆశిష్ నెహ్రా (భా)
  • ఇండియా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
  • పాయింట్లు: ఇండియా 4, ఇంగ్లాండ్ 0

2003 ఫిబ్రవరి 27
స్కోరు
ఆస్ట్రేలియా 
301/6 (50 ఓవర్లు)
v
 నమీబియా
45 (14 ఓవర్లు)
మాథ్యూ హేడెన్ 88 (73)
Louis Burger 3/39 (10 ఓవర్లు)
Deon Kotze 10 (14)
గ్లెన్ మెక్‌గ్రాత్ 7/15 (7 ఓవర్లు)
ఆస్ట్రేలియా 256 పరుగులతో గెలిచింది
సెన్వెస్ పార్క్, పోచెఫ్‌స్ట్రూమ్
అంపైర్లు: బిల్లీ బౌడెన్ (న్యూ), రస్సెల్ టిఫిన్ (జింబా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రే)
  • ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
  • పాయింట్లు: ఆస్ట్రేలియా 4, నమీబియా 0

2003 ఫిబ్రవరి 28
స్కోరు
జింబాబ్వే 
301/8 (50 ఓవర్లు)
v
 నెదర్లాండ్స్
202/9 (50 ఓవర్లు)
ఆండీ ఫ్లవర్ 71 (72)
Feiko Kloppenburg 2/40 (10 ఓవర్లు)
Roland Lefebvre 30 (23)
Brian Murphy 3/44 (10 ఓవర్లు)
జింబాబ్వే 99 పరుగులతో గెలిచింది
క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో
అంపైర్లు: స్టీవ్ బక్నర్ (వెస్టిం), టైరాన్ విజెవర్దనే (శ్రీ)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హీత్ స్ట్రీక్ (జింబా)
  • నెదర్లాండ్స్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: జింబాబ్వే 4, నెదర్లాండ్స్ 0

2003 మార్చి 1
స్కోరు
పాకిస్తాన్ 
273/7 (50 ఓవర్లు)
v
 భారతదేశం
276/4 (45.4 ఓవర్లు)
ఇండియా 6 వికెట్లతో గెలిచింది
సెంచూరియన్ పార్క్, సెంచూరియన్
అంపైర్లు: డేవిడ్ షెపర్డ్ (ఇంగ్లా), రుడీ కోయెర్ట్జెన్ (దక్షి)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సచిన్ టెండుల్కర్ (భా)
  • పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: ఇండియా 4, పాకిస్తాన్ 0

2003 మార్చి 2
స్కోరు
ఇంగ్లాండు 
204/8 (50 ఓవర్లు)
v
 ఆస్ట్రేలియా
208/8 (49.4 ఓవర్లు)
అలెక్ స్టీవర్ట్ 46 (92)
ఆండీ బికెల్ 7/20 (10 ఓవర్లు)
Michael Bevan 74* (126)
ఆండ్రూ కాడిక్ 4/35 (9 ఓవర్లు)
ఆస్ట్రేలియా 2 వికెట్లతో గెలిచింది
సెంట్ జార్జ్ పార్క్ క్రికెట్ గ్రౌండ్, పోర్ట్ ఎలిజబెత్
అంపైర్లు: అలీమ్ దార్ (పాకి), రస్సెల్ టిఫిన్ (జింబా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆండీ బికెల్ (ఆస్ట్రే)
  • ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: ఆస్ట్రేలియా 4, ఇంగ్లాండ్ 0

2003 మార్చి 3
స్కోరు
నెదర్లాండ్స్ 
314/4 (50 ఓవర్లు)
v
 నమీబియా
250 (46.5 ఓవర్లు)
Klaas-Jan van Noortwijk 134* (129)
Louis Burger 2/49 (10 ఓవర్లు)
Gavin Murgatroyd 52 (62)
అదీల్ రజా 4/42 (8.5 ఓవర్లు)
నెదర్లాండ్స్ 64 పరుగులతో గెలిచింది
గుడ్‌యియర్ పార్క్, బ్లోమ్‌ఫోంటీన్
అంపైర్లు: డారిల్ హార్పర్ (ఆస్ట్రే), నదీమ్ ఘౌరీ (పాకి)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Feiko Kloppenburg (నెద)
  • నెదర్లాండ్స్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: నెదర్లాండ్స్ 4, నమీబియా 0

2003 మార్చి 4
స్కోరు
పాకిస్తాన్ 
73/3 (14 ఓవర్లు)
v
ఫలితం తేలలేదు
క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో
అంపైర్లు: అశోక డి సిల్వా (శ్రీ), బిల్లీ బౌడెన్ (న్యూ)
  • పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
  • వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. రెండు సార్లు సస్పెండు చేసారు. వర్షం కారణంగానే పాకిస్తాన్ ఇన్నింగ్సు 14 వ ఓవరులో మ్యాచ్‌ను ఆపేసారు.
  • ఒక్కో ఇన్నింగ్సులో 38 ఓవర్లుండేలా మ్యాచ్‌ను కుదించారు
  • పాయింట్లు: పాకిస్తాన్ 2, జింబాబ్వే 2

పూల్ బి

స్థానం జట్టు గె ఫ.తే టై నెట్ రన్ రేట్ పాయింట్లు క్యారీ ఫార్వర్డ్ పాయింట్లు
1  శ్రీలంక 6 4 1 0 1 1.20 18 7.5
2  కెన్యా 6 4 2 0 0 -0.69 16 10
3  న్యూజీలాండ్ 6 4 2 0 0 0.99 16 4
4  దక్షిణాఫ్రికా 6 3 2 0 1 1.73 14
5  వెస్ట్ ఇండీస్ 6 3 2 1 0 1.10 14
6  కెనడా 6 1 5 0 0 -1.99 4
7  బంగ్లాదేశ్ 6 0 5 1 0 −2.05 2
2003 ఫిబ్రవరి 9 (D/N)
స్కోరు
వెస్ట్ ఇండీస్ 
278/5 (50 ఓవర్లు)
v
 దక్షిణాఫ్రికా
275/9 (49 ఓవర్లు)
బ్రియాన్ లారా 116 (134)
మఖియా ఎన్టిని 2/37 (10 ఓవర్లు)
గారీ కర్‌స్టెన్ 69 (92)
మెర్విన్ డిలాన్ 2/47 (10 ఓవర్లు)
వెస్టిండీస్ 3 పరుగులతో గెలిచింది
న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్ టౌన్
అంపైర్లు: డారిల్ హార్పర్ (ఆస్ట్రే), వెంకట రాఘవన్ (భా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: బ్రియాన్ లారా (వెస్టిం)
  • వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: వెస్టిండీస్ 4, దక్షిణాఫ్రికా 0
  • నెమ్మదిగా బౌలింగు చేసినందుకు గాను, దక్షిణాఫ్రికాకు 1 ఓవరు జరిమానా విధించారు

2003 ఫిబ్రవరి 10
స్కోరు
శ్రీలంక 
272/7 (50 ఓవర్లు)
v
 న్యూజీలాండ్
225 (45.3 ఓవర్లు)
శ్రీలంక 47 పరుగులతో గెలిచింది
గుడ్‌యియర్ పార్క్, బ్లోమ్‌ఫోంటీన్
అంపైర్లు: నీల్ మాలెండర్ (ఇంగ్లా), స్టీవ్ బక్నర్ (వెస్టిం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సనత్ జయసూర్య (శ్రీ)
  • న్యూజీలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: శ్రీలంక 4, న్యూజీలాండ్ 0

2003 ఫిబ్రవరి 11
స్కోరు
కెనడా 
180 (49.1 ఓవర్లు)
v
 బంగ్లాదేశ్
120 (28 ఓవర్లు)
Ian Billcliff 42 (63)
Sanwar Hossain 2/26 (10 ఓవర్లు)
Sanwar Hossain 25 (24)
Austin Codrington 5/27 (9 ఓవర్లు)
కెనడా 60 పరుగులతో గెలిచింది
కింగ్స్‌మీడ్ క్రికెట్ గ్రౌండ్, డర్బన్
అంపైర్లు: అలీమ్ దార్ (పాకి), Brian Jerling (దక్షి)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Austin Codrington (కెన్యా)
  • కెనడా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: కెనడా 4, బంగ్లాదేశ్ 0

2003 ఫిబ్రవరి 12
స్కోరు
కెన్యా 
140 (38 ఓవర్లు)
v
 దక్షిణాఫ్రికా
142/0 (21.2 ఓవర్లు)
Ravi Shah 60 (87)
లాన్స్ క్లూసెనర్ 4/16 (8 ఓవర్లు)
హెర్షెల్ గిబ్స్ 87* (66)
దక్షిణాఫ్రికా 10 వికెట్లతో గెలిచింది
North West Cricket Stadium, Potchefstroom
అంపైర్లు: కెవిన్ బార్బోర్ (జింబా), టైరాన్ విజెవర్దనే (శ్రీ)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: లాన్స్ క్లూసెనర్ (దక్షి)
  • కెన్యా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: దక్షిణాఫ్రికా 4, కెన్యా 0

2003 ఫిబ్రవరి 13
స్కోరు
న్యూజీలాండ్ 
241/7 (50 ఓవర్లు)
v
 వెస్ట్ ఇండీస్
221 (49.4 ఓవర్లు)
రామ్‌నరేష్ శర్వాన్ 75 (99)
ఆండ్రె ఆడమ్స్ 4/44 (9.4 ఓవర్లు)
న్యూజీలాండ్ 20 పరుగులతో గెలిచింది
సెంట్ జార్జ్ పార్క్ క్రికెట్ గ్రౌండ్, పోర్ట్ ఎలిజబెత్
అంపైర్లు: డారెల్ హెయిర్ (ఆస్ట్రే), రుడీ కోయెర్ట్జెన్ (దక్షి)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆండ్రె ఆడమ్స్ (న్యూ)
  • వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: న్యూజీలాండ్ 4, వెస్టిండీస్ 0

2003 ఫిబ్రవరి 14
స్కోరు
బంగ్లాదేశ్ 
124 (31.1 ఓవర్లు)
v
 శ్రీలంక
126/0 (21.1 ఓవర్లు)
అలోక్ కపాలి 32 (38)
చమిందా వాస్ 6/25 (9.1 ఓవర్లు)
మర్వాన్ ఆటపట్టు 69* (71)
శ్రీలంక 10 వికెట్లతో గెలిచింది
సితీ ఓవల్, పయటర్‌మారిట్జ్‌బర్గ్
అంపైర్లు: బిల్లీ బౌడెన్ (న్యూ), రస్సెల్ టిఫిన్ (జింబా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: చమిందా వాస్ (శ్రీ)
  • శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: శ్రీలంక 4, బంగ్లాదేశ్ 0
  • చమిందా వాస్ మొదటి మూడు బంతులతో హ్యాట్‌ట్రిక్ సాధించాడు. ప్రపంచ కప్‌లో హ్యాట్‌ట్రిక్ సాధించిన మూడవ బౌలరయ్యాడు.
  • మర్వాన్ ఆటపట్టు వన్‌డేల్లో 6,000 వ పరుగు సాధించాడు.

2003 ఫిబ్రవరి 15
స్కోరు
కెనడా 
197 (49 ఓవర్లు)
v
 కెన్యా
198/6 (48.3 ఓవర్లు)
Ian Billcliff 71 (100)
థామస్ ఒడోయో 4/28 (10 ఓవర్లు)
Ravi Shah 61 (95)
జాన్ డేవిసన్ 3/15 (10 ఓవర్లు)
కెన్యా 4 వికెట్లతో గెలిచింది
న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్ టౌన్
అంపైర్లు: ఆరణి జయప్రకాష్ (భా), నదీమ్ ఘౌరీ (పాకి)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: థామస్ ఒడోయో (కెన్యా)
  • కెనడా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: కెన్యా 4, కెనడా 0

2003 ఫిబ్రవరి 16
స్కోరు
దక్షిణాఫ్రికా 
306/6 (50 ఓవర్లు)
v
 న్యూజీలాండ్
229/1 (36.5 ఓవర్లు)
హెర్షెల్ గిబ్స్ 143 (141)
జాకబ్ ఓరం 2/52 (8 ఓవర్లు)
స్టీఫెన్ ఫ్లెమింగ్ 134* (132)
Allan Donald 1/52 (5.5 ఓవర్లు)
న్యూజీలాండ్ 9 వికెట్లతో గెలిచింది (డ-లూ పద్ధతి)
న్యూ వాండరర్స్ స్టేడియమ్, జోహన్నెస్‌బర్గ్
అంపైర్లు: పీటర్ విల్లీ (ఇంగ్లా), స్టీవ్ బక్నర్ (వెస్టిం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: స్టీఫెన్ ఫ్లెమింగ్ (న్యూ)
  • దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
  • వర్షం కారణంగా మూడుసార్లు ఆగిన న్యూజీలాండ్ ఇన్నింగ్సును 39 ఓవర్లకు కుదించి, లక్ష్యాన్ని 226 గా సవరించారు.
  • పాయింట్లు: న్యూజీలాండ్ 4, దక్షిణాఫ్రికా 0

2003 ఫిబ్రవరి 18
స్కోరు
వెస్ట్ ఇండీస్ 
244/9 (50 ఓవర్లు)
v
 బంగ్లాదేశ్
32/2 (8.1 ఓవర్లు)
రికార్డో పొవెల్ 50 (31)
Manjurul Islam 2/37 (10 ఓవర్లు)
Ehsanul Haque 12 (24)
మెర్విన్ డిలాన్ 1/13 (4.1 ఓవర్లు)
ఫలితం తేలలేదు
న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్ టౌన్
అంపైర్లు: Brian Jerling (దక్షి), రస్సెల్ టిఫిన్ (జింబా)
  • బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
  • వర్షం కారణంగా వెస్టిండీస్ ఇన్నింగ్సును కుదించి, ఆ తరువాత మ్యాచ్‌ను రద్దు చేసారు
  • పాయింట్లు: వెస్టిండీస్ 2, బంగ్లాదేశ్ 2

2003 ఫిబ్రవరి 19
స్కోరు
కెనడా 
36 (18.4 ఓవర్లు)
v
 శ్రీలంక
37/1 (4.4 ఓవర్లు)
Joe Harris 9 (13)
ప్రభాత్ నిస్సంక 4/12 (7 ఓవర్లు)
మర్వాన్ ఆటపట్టు 24* (14)
Sanjayan Thuraisingam 1/22 (2.4 ఓవర్లు)
శ్రీలంక 9 వికెట్లతో గెలిచింది
బోలండ్ పార్క్, పార్ల్
అంపైర్లు: డేవిడ్ షెపర్డ్ (ఇంగ్లా), నీల్ మాలెండర్ (ఇంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ప్రభాత్ నిస్సంక (శ్రీ)
  • శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: శ్రీలంక 4, కెనడా 0
  • ప్రభాత్ నిస్సంక వన్‌డేల్లో తన అత్యుత్తమ బౌలింగు గణాంకాలు సాధించాడు.
  • కెనడా వన్‌డేల్లో కెల్లా అత్యల్ప స్కోరును సాధించింది.

2003 ఫిబ్రవరి 21
స్కోరు
కెన్యా 
v
కెన్యా గెలిచింది (ఆడకుండా మ్యాచ్ అప్పగింత)
నైరోబి జింఖానా క్లబ్, నైరోబి
అంపైర్లు: డారిల్ హార్పర్ (ఆస్ట్రే), రస్సెల్ టిఫిన్ (జింబా)
  • No toss
  • పాయింట్లు: కెన్యా 4, న్యూజీలాండ్ 0
  • భద్రతా కారణాల రీత్యా న్యూజీలాండ్ ఈ మ్యాచ్‌ను వదిలేసుకుంది

2003 ఫిబ్రవరి 22
స్కోరు
బంగ్లాదేశ్ 
108 (35.1 ఓవర్లు)
v
 దక్షిణాఫ్రికా
109/0 (12 ఓవర్లు)
Khaled Mashud 29 (67)
మఖియా ఎన్టిని 4/24 (7.1 ఓవర్లు)
గారీ కర్‌స్టెన్ 52* (32)
దక్షిణాఫ్రికా 10 వికెట్లతో గెలిచింది
గుడ్‌యియర్ పార్క్, బ్లోమ్‌ఫోంటీన్
అంపైర్లు: బిల్లీ బౌడెన్ (న్యూ), వెంకట రాఘవన్ (భా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మఖియా ఎన్టిని (దక్షి)
  • దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: దక్షిణాఫ్రికా 4, బంగ్లాదేశ్ 0

2003 ఫిబ్రవరి 23
స్కోరు
కెనడా 
202 (42.5 ఓవర్లు)
v
 వెస్ట్ ఇండీస్
206/3 (20.3 ఓవర్లు)
జాన్ డేవిసన్ 111 (76)
వాస్బర్ట్ డ్రేక్స్ 4/55(9.5 ఓవర్లు)
బ్రియాన్ లారా 73 (40)
జాన్ డేవిసన్ 1/36 (5 ఓవర్లు)
వెస్టిండీస్ 7 వికెట్లతో గెలిచింది
న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్ టౌన్
అంపైర్లు: డేవిడ్ ఆర్చర్డ్ (దక్షి), వెంకట రాఘవన్ (భా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జాన్ డేవిసన్ (Can)
  • వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: వెస్టిండీస్ 4, కెనడా 0

2003 ఫిబ్రవరి 24
స్కోరు
కెన్యా 
210/9 (50 ఓవర్లు)
v
 శ్రీలంక
157 (45 ఓవర్లు)
Kennedy Otieno 60 (88)
ముత్తయ్య మురళీధరన్ 4/28 (10 ఓవర్లు)
అరవింద డి సిల్వా 41 (53)
కాలిన్స్ ఒబుయా 5/24 (10 ఓవర్లు)
కెన్యా 53 పరుగులతో గెలిచింది
నైరోబి జింఖానా క్లబ్, నైరోబి
అంపైర్లు: డారిల్ హార్పర్ (ఆస్ట్రే), రస్సెల్ టిఫిన్ (జింబా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కాలిన్స్ ఒబుయా (కెన్యా)
  • శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: కెన్యా 4, శ్రీలంక 0
  • శ్రీలంకపై కెన్యా సాధించిన తొలి విజయం ఇది.

2003 ఫిబ్రవరి 26
స్కోరు
బంగ్లాదేశ్ 
198/7 (50 ఓవర్లు)
v
 న్యూజీలాండ్
199/3 (33.3 ఓవర్లు)
మొహమ్మద్ అష్రాఫుల్ 56 (82)
జాకబ్ ఓరం 3/32 (10 ఓవర్లు)
క్రేగ్ మెక్‌మిలన్ 75 (83)
ఖాలెద్ మహమూద్ 3/46 (10 ఓవర్లు)
న్యూజీలాండ్ 7 వికెట్లతో గెలిచింది
డీ బీర్స్ డైమండ్ ఓవల్, కింబర్లీ
అంపైర్లు: డారెల్ హెయిర్ (ఆస్ట్రే), డేవిడ్ షెపర్డ్ (ఇంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: క్రేగ్ మెక్‌మిలన్ (న్యూ)
  • బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: న్యూజీలాండ్ 4, బంగ్లాదేశ్ 0

2003 ఫిబ్రవరి 27
స్కోరు
దక్షిణాఫ్రికా 
254/8 (50 ఓవర్లు)
v
 కెనడా
136/5 (50 ఓవర్లు)
బోయెటా డిప్పెనార్ 80 (118)
ఆషిష్ పటేల్ 3/41 (7 ఓవర్లు)
Ishwar Maraj 53* (155)
మఖియా ఎన్టిని 2/19 (10 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 118 పరుగులతో గెలిచింది
బఫెలో పార్క్, ఈస్ట్ లండన్
అంపైర్లు: డారిల్ హార్పర్ (ఆస్ట్రే), కెవిన్ బార్బోర్ (జింబా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: బోయెటా డిప్పెనార్ (దక్షి)
  • కెనడా టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: దక్షిణాఫ్రికా 4, కెనడా 0

2003 ఫిబ్రవరి 28
స్కోరు
శ్రీలంక 
228/6 (50 ఓవర్లు)
v
 వెస్ట్ ఇండీస్
222/9 (50 ఓవర్లు)
సనత్ జయసూర్య 66 (99)
వాస్బర్ట్ డ్రేక్స్ 1/32 (10 ఓవర్లు)
శివనారాయణ్ చందర్‌పాల్ 65 (90)
చమిందా వాస్ 4/22 (10 ఓవర్లు)
శ్రీలంక 6 పరుగులతో గెలిచింది
న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్ టౌన్
అంపైర్లు: డేవిడ్ ఆర్చర్డ్ (దక్షి), వెంకట రాఘవన్ (భా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: చమిందా వాస్ (శ్రీ)
  • శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: శ్రీలంక 4, వెస్టిండీస్ 0

2003 మార్చి 1
స్కోరు
కెన్యా 
217/7 (50 ఓవర్లు)
v
 బంగ్లాదేశ్
185 (47.2 ఓవర్లు)
మారిస్ ఒడుంబే 52* (46)
Sanwar Hossain 3/49 (10 ఓవర్లు)
Tushar Imran 48 (81)
మారిస్ ఒడుంబే 4/38 (10 ఓవర్లు)
కెన్యా 32 పరుగులతో గెలిచింది
న్యూ వాండరర్స్ స్టేడియమ్, జోహన్నెస్‌బర్గ్
అంపైర్లు: అశోక డి సిల్వా (శ్రీ), నీల్ మాలెండర్ (ఇంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మారిస్ ఒడుంబే (కెన్యా)
  • కెన్యా టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: కెన్యా 4, బంగ్లాదేశ్ 0

2003 మార్చి 3
స్కోరు
కెనడా 
196 (47 ఓవర్లు)
v
 న్యూజీలాండ్
197/5 (23 ఓవర్లు)
జాన్ డేవిసన్ 75 (62)
జాకబ్ ఓరం 4/52 (10 ఓవర్లు)
స్కాట్ స్టైరిస్ 54* (38)
జాన్ డేవిసన్ 3/61 (10 ఓవర్లు)
న్యూజీలాండ్ 5 వికెట్లతో గెలిచింది
విల్లోమోర్ పార్క్, బెనోనీ
అంపైర్లు: ఆరణి జయప్రకాష్ (భా), Brian Jerling (దక్షి)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జాన్ డేవిసన్ (Can)
  • న్యూజీలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: న్యూజీలాండ్ 4, కెనడా 0

2003 మార్చి 3
స్కోరు
శ్రీలంక 
268/9 (50 ఓవర్లు)
v
 దక్షిణాఫ్రికా
229/6 (45 ఓవర్లు)
మర్వాన్ ఆటపట్టు 124 (129)
జాక్ కాలిస్ 3/41 (10 ఓవర్లు)
హెర్షెల్ గిబ్స్ 73 (88)
అరవింద డి సిల్వా 2/36 (8 ఓవర్లు)
Match tied (డ-లూ పద్ధతి)
కింగ్స్‌మీడ్ క్రికెట్ గ్రౌండ్, డర్బన్
అంపైర్లు: వెంకట రాఘవన్ (భా), స్టీవ్ బక్నర్ (వెస్టిం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మర్వాన్ ఆటపట్టు (శ్రీ)
  • శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
  • మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, డక్‌వర్త్-లూయిస్ పద్ధతిలో సవరించిన లక్ష్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల గెలవాల్సిన మ్యాచ్‌ని టై చేసుకుంది.
  • పాయింట్లు: శ్రీలంక 2, దక్షిణాఫ్రికా 2

2003 మార్చి 4
స్కోరు
వెస్ట్ ఇండీస్ 
246/7 (50 ఓవర్లు)
v
 కెన్యా
104 (35.5 ఓవర్లు)
క్రిస్ గేల్ 119 (151)
మారిస్ ఒడుంబే 2/62 (10 ఓవర్లు)
Peter Ongondo 24 (43)
వాస్బర్ట్ డ్రేక్స్ 5/33 (10 ఓవర్లు)
వెస్టిండీస్ 142 పరుగులతో గెలిచింది
డీ బీర్స్ డైమండ్ ఓవల్, కింబర్లీ
అంపైర్లు: డేవిడ్ షెపర్డ్ (ఇంగ్లా), సైమన్ టఫ్నెల్ (ఆస్ట్రే)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వాస్బర్ట్ డ్రేక్స్ (వెస్టిం)
  • వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: వెస్టిండీస్ 4, కెన్యా 0

సూపర్ సిక్స్‌లు

సూపర్ సిక్స్ దశకు అర్హత సాధించిన జట్లు ఇతర గ్రూపులోని జట్లతో మాత్రమే ఆడతాయి; తమ గ్రూప్‌లోని ఇతర జట్లపై సాధించిన పాయింట్లను కలుపుకునే ఈ దశకు చేరాయి.

పాయింట్లు ఫార్వార్డ్ (PCF)
ఫలితాలు అర్హత సాధించిన జట్లకు వ్యతిరేకంగా అర్హత లేని జట్లకు వ్యతిరేకంగా
గెలుపు 4 పాయింట్లు 1 పాయింట్
ఫలితం / టై లేదు 2 పాయింట్లు 0.5 పాయింట్
నష్టం 0 పాయింట్ 0 పాయింట్

సెమీ-ఫైనల్‌కు చేరుకున్న జట్లు ఆకుపచ్చ రంగులో హైలైట్ చేయబడ్డాయి.

పోస్ జట్టు Pld W ఎల్ NR టి NRR Pts PCF
1  ఆస్ట్రేలియా 5 5 0 0 0 1.85 24 12
2  భారతదేశం 5 4 1 0 0 0.89 20 8
3  కెన్యా 5 3 2 0 0 0.35 14 10
4  శ్రీలంక 5 2 3 0 0 -0.84 11.5 7.5
5  న్యూజీలాండ్ 5 1 4 0 0 -0.90 8 4
6  జింబాబ్వే 5 0 5 0 0 -1.25 3.5 3.5
2003 మార్చి 7
Scorecard
ఆస్ట్రేలియా 
319/5 (50 ఓవర్లు)
v
 శ్రీలంక
223 (47.4 ఓవర్లు)
రికీ పాంటింగ్ 114 (109)
దిలార ఫెర్నాండో 3/47 (9 ఓవర్లు)
అరవింద డి సిల్వా 92 (94)
బ్రెట్ లీ 3/52 (10 ఓవర్లు)
ఆస్ట్రేలియా 96 పరుగులతో గెలిచింది
సెంచూరియన్ పార్క్, సెంచూరియన్
అంపైర్లు: బిల్లీ బౌడెన్ (న్యూ), డేవిడ్ షెపర్డ్ (ఇంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రికీ పాంటింగ్ (ఆస్ట్రే)
  • ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: ఆస్ట్రేలియా 4, శ్రీలంక 0

2003 మార్చి 7
Scorecard
కెన్యా 
225/6 (50 ఓవర్లు)
v
 భారతదేశం
226/4 (47.5 ఓవర్లు)
Kennedy Otieno 79 (134)
Harbhajan Singh 2/41 (10 ఓవర్లు)
సౌరవ్ గంగూలీ 107* (120)
థామస్ ఒడోయో 2/27 (7 ఓవర్లు)
భారత్ 6 వికెట్లతో గెలిచింది
న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్ టౌన్
అంపైర్లు: డారిల్ హార్పర్ (ఆస్ట్రే), పీటర్ విల్లీ (ఇంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సౌరవ్ గంగూలీ (భా)
  • కెన్యా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: భారత్ 4, కెన్యా 0

2003 మార్చి 8
Scorecard
జింబాబ్వే 
252/7 (50 ఓవర్లు)
v
 న్యూజీలాండ్
253/4 (47.2 ఓవర్లు)
నాథన్ ఆస్టిల్ 102* (122)
ఆండీ బ్లిగ్నాట్ 2/41 (10 ఓవర్లు)
న్యూజీలాండ్ 6 వికెట్లతో గెలిచింది
గుడ్‌యియర్ పార్క్, బ్లోమ్‌ఫోంటీన్
అంపైర్లు: డారెల్ హెయిర్ (ఆస్ట్రే), రుడీ కోయెర్ట్జెన్ (దక్షి)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నాథన్ ఆస్టిల్ (న్యూ)
  • జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: న్యూజీలాండ్ 4, జింబాబ్వే 0

2003 మార్చి 10
Scorecard
భారతదేశం 
292/6 (50 ఓవర్లు)
v
 శ్రీలంక
109 (23 ఓవర్లు)
భారత్ 183 పరుగులతో గెలిచింది
వాండరర్స్ స్టేడియమ్, జోహన్నెస్‌బర్గ్
అంపైర్లు: డేవిడ్ షెపర్డ్ (ఇంగ్లా), సైమన్ టఫ్నెల్ (ఆస్ట్రే)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జవగళ్ శ్రీనాథ్ (భా)
  • శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: భారత్ 4, శ్రీలంక 0

2003 మార్చి 11
Scorecard
ఆస్ట్రేలియా 
208/9 (50 ఓవర్లు)
v
 న్యూజీలాండ్
112 (30.1 ఓవర్లు)
ఆండీ బికెల్ 64 (83)
షేన్ బాండ్ 6/23 (10 ఓవర్లు)
స్టీఫెన్ ఫ్లెమింగ్ 48 (70)
బ్రెట్ లీ 5/42 (9.1 ఓవర్లు)
ఆస్ట్రేలియా 96 పరుగులతో గెలిచింది
సెంట్ జార్జ్ పార్క్ క్రికెట్ గ్రౌండ్, పోర్ట్ ఎలిజబెత్
అంపైర్లు: అశోక డి సిల్వా (శ్రీ), స్టీవ్ బక్నర్ (వెస్టిం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షేన్ బాండ్ (న్యూ)
  • న్యూజీలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: ఆస్ట్రేలియా 4, న్యూజీలాండ్ 0

2003 మార్చి 12
Scorecard
జింబాబ్వే 
133 (44.1 ఓవర్లు)
v
 కెన్యా
135/3 (26 ఓవర్లు)
ఆండీ ఫ్లవర్ 63 (101)
మార్టిన్ సూజి 3/19 (8 ఓవర్లు)
థామస్ ఒడోయో 43* (60)
ఆండీ బ్లిగ్నాట్ 1/36 (9 ఓవర్లు)
కెన్యా 7 వికెట్లతో గెలిచింది
గుడ్‌యియర్ పార్క్, బ్లోమ్‌ఫోంటీన్
అంపైర్లు: వెంకట రాఘవన్ (భా), అలీమ్ దార్ (పాకి)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మార్టిన్ సూజి (కెన్యా)
  • జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: కెన్యా 4, జింబాబ్వే 0

2003 మార్చి 14
Scorecard
న్యూజీలాండ్ 
146 (45.1 ఓవర్లు)
v
 భారతదేశం
150/3 (40.4 ఓవర్లు)
భారత్ 7 వికెట్లతో గెలిచింది
సెంచూరియన్ పార్క్, సెంచూరియన్
అంపైర్లు: డారిల్ హార్పర్ (ఆస్ట్రే), పీటర్ విల్లీ (ఇంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జహీర్ ఖాన్ (భా)
  • భారత్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: భారత్ 4, న్యూజీలాండ్ 0

2003 మార్చి 15
Scorecard
శ్రీలంక 
256/5 (50 ఓవర్లు)
v
 జింబాబ్వే
182 (41.5 ఓవర్లు)
మర్వాన్ ఆటపట్టు 103 (127)
హీత్ స్ట్రీక్ 2/40 (10 ఓవర్లు)
క్రేగ్ విషార్ట్ 43 (71)
సనత్ జయసూర్య 3/30 (6 ఓవర్లు)
శ్రీలంక 74 పరుగులతో గెలిచింది
గుడ్‌యియర్ పార్క్, బ్లోమ్‌ఫోంటీన్
అంపైర్లు: Brian Jerling (దక్షి), రుడీ కోయెర్ట్జెన్ (దక్షి)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మర్వాన్ ఆటపట్టు (శ్రీ)
  • శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: శ్రీలంక 4, జింబాబ్వే 0

2003 మార్చి 15
Scorecard
కెన్యా 
174/8 (50 ఓవర్లు)
v
 ఆస్ట్రేలియా
178/5 (31.2 ఓవర్లు)
స్టీవ్ టికోలో 51 (100)
బ్రెట్ లీ 3/14 (8 ఓవర్లు)
ఆడమ్ గిల్‌క్రిస్ట్ 67 (43)
ఆసిఫ్ కరీమ్ 3/7 (8.2 ఓవర్లు)
ఆస్ట్రేలియా 5 వికెట్లతో గెలిచింది
కింగ్స్‌మీడ్ క్రికెట్ గ్రౌండ్, డర్బన్
అంపైర్లు: బిల్లీ బౌడెన్ (న్యూ), స్టీవ్ బక్నర్ (వెస్టిం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆసిఫ్ కరీమ్ (కెన్యా)
  • ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
  • పాయింట్లు: ఆస్ట్రేలియా 4, కెన్యా 0

సెమీ ఫైనల్స్

బ్రాకెట్

Semi-finals Final
               
1   ఆస్ట్రేలియా 212/7 (50 ఓవర్లు)  
4   శ్రీలంక 123/7 (38.1 ఓవర్లు)  
    1   ఆస్ట్రేలియా 359/2 (50 ఓవర్లు)
  2   భారతదేశం 234 (39.1 ఓవర్లు)
2   భారతదేశం 270/4 (50 ఓవర్లు)
3   కెన్యా 179 (46.2 ఓవర్లు)  
Semi-finals Final
               
1   ఆస్ట్రేలియా 212/7 (50 ఓవర్లు)  
4   శ్రీలంక 123/7 (38.1 ఓవర్లు)  
    1   ఆస్ట్రేలియా 359/2 (50 ఓవర్లు)
  2   భారతదేశం 234 (39.1 ఓవర్లు)
2   భారతదేశం 270/4 (50 ఓవర్లు)
3   కెన్యా 179 (46.2 ఓవర్లు)  

సెమీ-ఫైనల్ 1: ఆస్ట్రేలియా vs శ్రీలంక

పోర్ట్ ఎలిజబెత్‌లోని కష్టతరమైన, నెమ్మదైన పిచ్‌పై, శ్రీలంక బౌలింగ్‌ను ఆడుతూ ఆస్ట్రేలియా కష్టపడి 212 పరుగులు (7 వికెట్లు, 50 ఓవర్లు) చేసింది. ప్రధానంగా ఆండ్రూ సైమండ్స్ (91 * 118 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆ స్థాయికి చేరింది. టోర్నీలో మంచి ఫార్మ్‌లో ఉన్న చమిందా వాస్ ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. బ్రెట్ లీ (8 ఓవర్లలో 3/35) మూడు వికెట్లు, గ్లెన్ మెక్‌గ్రాత్ (7 ఓవర్లలో 1/20) ఒక వికెట్ పడగొట్టడంతో ఆస్ట్రేలియా పేస్ దాడి శ్రీలంక టాప్ ఆర్డర్‌ను కూల్చింది. 39 వ ఓవర్‌లో వర్షం వచ్చే సమయానికి, డక్‌వర్త్-లూయిస్ పద్ధతి ప్రకారం, శ్రీలంక లక్ష్యాన్ని 123 (7 వికెట్లు, 38.1 ఓవర్లు) కు కుదించారు. ఈ మ్యాచ్‌లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ నాటౌట్ అయినప్పటికీ ఔటైనట్లు ప్రకటించుకుని వెళ్ళిపోయాడు. [8]

2003 మార్చి 18
Scorecard
ఆస్ట్రేలియా 
212/7 (50 ఓవర్లు)
v
 శ్రీలంక
123/7 (38.1 ఓవర్లు)
కుమార సంగక్కర 39* (70)
బ్రెట్ లీ 3/35 (8 ఓవర్లు)
ఆస్ట్రేలియా 48 పరుగులతో గెలిచింది (డ-లూ పద్ధతి)
సెంట్ జార్జ్ పార్క్ క్రికెట్ గ్రౌండ్, పోర్ట్ ఎలిజబెత్
అంపైర్లు: డేవిడ్ షెపర్డ్ (ఇంగ్లా), రుడీ కోయెర్ట్జెన్ (దక్షి)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆండ్రూ సైమండ్స్ (ఆస్ట్రే)
  • ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
  • వర్షం కారణంగా శ్రీలంక ఇన్నింగ్సు 38.1 ఓవర్ల తరువాత ఆగిపోయింది
  • తెరిపి లేని వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది, ఆస్ట్రేలియా గెలిచింది

సెమీ-ఫైనల్ 2: భారత్ vs కెన్యా

ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌కు చేరిన ఏకైక నాన్-టెస్ట్ దేశం కెన్యా. ఆ జట్టు అద్భుత ప్రయాణం ముగిసింది. సచిన్ టెండూల్కర్ (101 బంతుల్లో 83, 5 ఫోర్లు, 1 సిక్స్), సౌరవ్ గంగూలీ (114 బంతుల్లో 111, 5 ఫోర్లు, 5 సిక్సర్లు) బ్యాటింగుతో భారత్ మొత్తం 270 (4 వికెట్లు, 50 ఓవర్లు) పరుగులు సాధించింది. డర్బన్ లైట్ల కింద, జహీర్ ఖాన్ (9.2 ఓవర్లలో 3/14), జవగల్ శ్రీనాథ్ (7 ఓవర్లలో 1/11), ఆశిష్ నెహ్రా (5 ఓవర్లలో 2/11)ల శక్తివంతమైన భారత సీమ్ దాడి కెన్యా బ్యాటర్లకు కష్టాలు చూపింది. స్టీవ్ టికోలో (83 బంతుల్లో 56, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మాత్రమే చెప్పుకోదగ్గ ప్రతిఘటనను ప్రదర్శించడంతో కెన్యా 179 పరుగులకు ఆలౌటైంది (ఆల్ అవుట్, 46.2 ఓవర్లు).

2003 మార్చి 20
Scorecard
భారతదేశం 
270/4 (50 ఓవర్లు)
v
 కెన్యా
179 (46.2 ఓవర్లు)
సౌరవ్ గంగూలీ 111* (114)
థామస్ ఒడోయో 2/27 (7 ఓవర్లు)
స్టీవ్ టికోలో 56 (83)
జహీర్ ఖాన్ 3/14 (9.2 ఓవర్లు)
భారత్ 91 పరుగులతో గెలిచింది
కింగ్స్‌మీడ్ క్రికెట్ గ్రౌండ్, డర్బన్
అంపైర్లు: డారిల్ హార్పర్ (ఆస్ట్రే), స్టీవ్ బక్నర్ (వెస్టిం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సౌరవ్ గంగూలీ (భా)
  • భారత్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.

ఫైనల్

2003 మార్చి 23
Scorecard
ఆస్ట్రేలియా 
359/2 (50 ఓవర్లు)
v
 భారతదేశం
234 (39.2 ఓవర్లు)
రికీ పాంటింగ్ 140* (121)
Harbhajan Singh 2/49 (8 ఓవర్లు)
Virender Sehwag 82 (81)
గ్లెన్ మెక్‌గ్రాత్ 3/52 (8.2 ఓవర్లు)
ఆస్ట్రేలియా 125 పరుగులతో గెలిచింది
వాండరర్స్ స్టేడియమ్, జోహన్నెస్‌బర్గ్
అంపైర్లు: డేవిడ్ షెపర్డ్ (ఇంగ్లా), స్టీవ్ బక్నర్ (వెస్టిం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రికీ పాంటింగ్ (ఆస్ట్రే)
  • భారత్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
ప్రపంచ కప్‌కు గుర్తుగా పౌర కేంద్రం వెలిసింది

టాస్ గెలిచిన గంగూలీ, మంచు, వర్షం కారణంగా తడిగా ఉన్న పిచ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆశించి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఉల్లాసమైన వాండరర్స్ స్టేడియం పిచ్‌పై, ఆస్ట్రేలియా ఓపెనర్లు, భారత ఓపెనింగ్ బౌలర్లను చెండాడి మంచి ఆరంభాన్ని సాధించారు. ఆడమ్ గిల్‌క్రిస్ట్ (48 బంతుల్లో 57, 8 ఫోర్లు, 1 సిక్స్), మాథ్యూ హేడెన్ (54 బంతుల్లో 37, 5 ఫోర్లు) 14 ఓవర్లలో 105 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. గంగూలీ అసాధారణంగా ప్రారంభంలోనే స్పిన్నర్లను తీసుకురావాల్సి వచ్చింది. హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో స్వీప్ షాట్‌ కొడుతూ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ ఔటయ్యాడు. మాథ్యూ హేడెన్, 37 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆస్ట్రేలియా 2/125 వద్ద కెప్టెన్ రికీ పాంటింగ్ (121 బంతుల్లో 140, 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), డామియన్ మార్టిన్ (84 బంతుల్లో 88, 7 ఫోర్లు, 1 సిక్స్) లు 30.1 ఓవర్లలో 234 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసి, వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియా రికార్డు సాధించారు. చివరి పది ఓవర్లలో 109 పరుగులు సాధించారు. ఆస్ట్రేలియా ఓవర్‌కు 7.18 పరుగుల రన్ రేట్‌తో మొత్తం 359 (2 వికెట్లు, 50 ఓవర్లు) పరుగులు చేసింది.[9]

సచిన్ టెండూల్కర్ మొదటి ఓవర్‌లో పుల్ షాట్‌తో ఔట్ అవడంతో, భారత్ పరుగుల వేట కష్టాలతో మొదలైంది. అయితే, వీరేంద్ర సెహ్వాగ్ (81 బంతుల్లో 82, 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకం చేయడంతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోరింగ్ రేటు లభించింది. 17 ఓవర్ల తర్వాత 3/103 వద్ద వర్షం కారణంగా ఆట అంతరాయం కలిగించడంతో ఆట ఆగిపోయే అవకాశం కనిపించింది. అయితే, ఈ వర్షం ఆగిపోయింది. సెహ్వాగ్ డారెన్ లీమాన్ చేతిలో రనౌట్ కావడం, మళ్లీ రాహుల్ ద్రవిడ్ (57 బంతుల్లో 2 ఫోర్లు) ఆండీ బిచెల్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో భారత్ ఆశలకు తెరపడింది. రన్ రేట్ ఓవర్‌కు 7 దాటడంతో ఛేజింగ్‌లో భారత బ్యాట్స్‌మెన్ వికెట్లు పడిపోవడం కొనసాగింది. చివరికి వారు 39.2 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌట్ అయ్యారు. 125 పరుగుల రికార్డు విజయం (ఇప్పటి వరకు ప్రపంచ కప్ ఫైనల్స్‌లో) టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని నొక్కిచెప్పింది. పాంటింగ్ "మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్"గా, సచిన్ టెండూల్కర్ "ప్లేయర్ ఆఫ్ ది సిరీస్"గా నిలిచారు. [10]

గణాంకాలు

అగ్రశ్రేణి బ్యాటర్లు [11]

ఆటగాడు జట్టు మ్యా ఇన్నిం పరుగులు సగటు SR HS 100 50 4s 6s
సచిన్ టెండూల్కర్  భారతదేశం 10 10 673 61.18 89.25 152 1 6 75 4
సౌరవ్ గంగూలీ  భారతదేశం 11 11 465 58.12 82.30 112* 3 0 30 15
రికీ పాంటింగ్  ఆస్ట్రేలియా 11 10 415 51.87గా ఉంది 87.92 140* 2 1 29 13
ఆడమ్ గిల్‌క్రిస్ట్  ఆస్ట్రేలియా 10 10 408 40.79గా ఉంది 105.42 99 0 4 56 7
హెర్షెల్ గిబ్స్  దక్షిణాఫ్రికా 6 6 384 96.00 100.78 143 1 2 52 10

అగ్ర బౌలర్లు [12]

ఆటగాడు జట్టు మ్యా ఇన్నిం వికెట్లు సగటు Econ BBI SR
చమిందా వాస్  శ్రీలంక 10 10 23 14.39 3.76 6/25 22.95
బ్రెట్ లీ  ఆస్ట్రేలియా 10 10 22 17.89 4.73 5/42 22.68
గ్లెన్ మెక్‌గ్రాత్  ఆస్ట్రేలియా 11 11 21 14.76 3.56 7/15 24.85
జహీర్ ఖాన్  భారతదేశం 11 11 18 20.77 4.23 4/42 29.44
షేన్ బాండ్  న్యూజీలాండ్ 8 8 17 17.94 3.91 6/23 27.52

వివాదాలు

జింబాబ్వే, కెన్యాలలో భద్రతా సమస్యలు

జింబాబ్వేలో భద్రత, రాజకీయ పరిస్థితులు, రాబర్ట్ ముగాబే దుష్పరిపాలన కారణంగా అక్కడ ఆడటం పట్ల టోర్నమెంట్‌కు ముందు ఆందోళన కలిగించింది. ఇద్దరు జింబాబ్వే ఆటగాళ్ళు, ఆండీ ఫ్లవర్, హెన్రీ ఒలోంగా జింబాబ్వేలో అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా తమ ప్రారంభ గేమ్‌లో నల్లటి బ్యాండ్‌లు ధరించారు. [13] ఆ ఇద్దరు జింబాబ్వే క్రికెట్ నుండి రిటైరై, విదేశాలలో ఆడటం ప్రారంభించారు. [14] జింబాబ్వేలో తమ మ్యాచ్‌ను రాజకీయ కారణాలతో బహిష్కరించాలని ఇంగ్లండ్ దేశీయంగా చాలా ఒత్తిడిని ఎదుర్కొంది. ఆటగాళ్ల భద్రతకు భయపడి వాళ్ళు ఆడలేదు. [15] వాకోవర్ ద్వారా లభించిన 4 పాయింట్లతో ఇంగ్లాండ్ కంటే 2 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నందున,జింబాబ్వే సూపర్ సిక్స్‌కు చేరుకుంది. ఇంగ్లాండు బహిష్కరణ ఖరీదైనదిగా నిరూపించబడింది. అదేవిధంగా, భద్రతాపరమైన భయాల కారణంగా న్యూజిలాండ్‌, కెన్యాలో ఆడకూడదని నిర్ణయించుకుంది. ఇది చివరికి న్యూజిలాండ్‌కు సెమీఫైనల్ స్థానాన్ని కోల్పోడానికి కారణమైంది.

షేన్ వార్న్ డ్రగ్ టెస్ట్

ఆస్ట్రేలియన్ స్టార్ ఆటగాడు షేన్ వార్న్‌ను ఇబ్బందికర పరిస్థితుల్లో కప్ నుండి ఇంటికి పంపించేసారు. పోటీల్లోకి వచ్చేముందు ఆస్ట్రేలియాలో జరిగిన డ్రగ్ పరీక్షలో అతను నిషేధిత మత్తు పదార్థం తీసుకున్నట్లు వెల్లడైంది. తన తల్లి సలహా మేరకే తాను 'ఫ్లూయిడ్ పిల్' తీసుకున్నట్లు లెగ్ స్పిన్నర్ పేర్కొన్నాడు.

మూలాలు

  1. "దక్షిణాఫ్రికా v శ్రీలంక". Cricinfo. Retrieved 1 October 2022.
  2. "Shane Warne's World Cup shame". ESPNcricinfo.
  3. "ఆస్ట్రేలియా rout భారత్ to win third World Cup". ESPNcricinfo. Retrieved 1 October 2022.
  4. "Fastest delivery of a cricket ball (male)". guinnessworldrecords.com.
  5. "షోయబ్ అక్తర్ – the legend, the sensation, the enigma". Archived from the original on 26 July 2019. Retrieved 17 June 2019.
  6. "10 Most feared fast bowlers in Cricket history – Purbat.com". 1 October 2016.
  7. "Cricinfo". static.espncricinfo.com. Retrieved 1 October 2022.
  8. "The Aussie who walked". ESPNcricinfo. Retrieved 1 October 2022.
  9. "Ruthless Aussies lift World Cup". London: BBC. 2003-03-23. Retrieved 2019-07-13.
  10. "ICC World Cup, 2002/03, Final". ESPNcricinfo. Archived from the original on 2 June 2007. Retrieved 29 April 2007.
  11. "ICC World Cup, 2002/03 batting most runs career Records". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-07-21.
  12. "ICC World Cup, 2002/03 bowling most wickets career Records". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-07-21.
  13. "Standing up for their principles". ESPN Cricinfo. Retrieved 10 February 2022.
  14. "The black band of courage". ESPN Cricinfo. 2 May 2007. Retrieved 10 February 2022.
  15. Engel, Matthew, ed. (13 February 2003). "Pool A – 2003 World Cup – England v జింబాబ్వే". Wisden Cricketers' Almanack 2004. Wisden Cricketers' Almanack. London: John Wisden & Co. ISBN 978-0-947766-83-2. Retrieved 22 January 2011.