1952 మద్రాసు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు

1952 మద్రాసు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు

← 1946 27 మార్చి 1952 (1952-03-27) 1957 (మద్రాసు)
1955 (ఆంధ్ర)
1957 (కేరళ) →

మొత్తం 375 సీట్లన్నింటికీ
188 seats needed for a majority
  First party Second party
 
Leader చక్రవర్తి రాజగోపాలాచారి ఎం. కళ్యాణసుందరం
Party భారత జాతీయ కాంగ్రెస్ భారతీయ కమ్యూనిస్టు పార్టీ
Leader's seat ఎమ్‌ఎల్‌సి తిరుచ్చిరాపల్లి ఉత్తర
Seats won 152 62
Popular vote 6,988,701 2,640,337
Percentage 34.88 13.18

ముఖ్యమంత్రి before election

కుమారస్వామి రాజా
భారత జాతీయ కాంగ్రెస్

ముఖ్యమంత్రి

సి.రాజగోపాలాచారి
భారత జాతీయ కాంగ్రెస్

1951 నాటికి భారతీయ పరిపాలనా విభాగాలు

సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఆధారంగా మద్రాసు రాష్ట్రానికి మొదటి శాసనసభ ఎన్నికలు 1952 మార్చి 27 న జరిగాయి. భారత స్వాతంత్ర్యం తర్వాత మద్రాసు రాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికలను అధికారికంగా 1951 మద్రాసు రాష్ట్ర ఎన్నికలు అని పిలుస్తారు. అయితే అనేక ఆలస్యాల కారణంగా, ఓటింగు 1952 లో గానీ జరగలేదు.

స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ ఒక్క పార్టీకి సాధారణ మెజారిటీ రాలేదు. వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్రులకూ మధ్య మళ్ళీ మళ్ళీ జరిగిన చర్చల తర్వాత, భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన సి.రాజగోపాలాచారి (రాజాజీ) ముఖ్యమంత్రి అయ్యాడు. 1953లో మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డాయి. ఇది కె. కామరాజ్ నాయకత్వంలో బ్రాహ్మణేతర కాంగ్రెస్ వర్గం ఏకీకరణకు దారితీసింది. అంతర్గత అసమ్మతి, అతని వారసత్వ విద్యా విధానంపై తీవ్ర వ్యతిరేకతల కారణంగా రాజాజీ 1954 లో రాజీనామా చేశాడు. తదనంతర నాయకత్వ పోరాటంలో కామరాజ్, రాజాజీ ఎంపిక చేసిన అభ్యర్థి సి. సుబ్రమణ్యంను ఓడించి 1954 మార్చి 31 న ముఖ్యమంత్రి అయ్యాడు.

నేపథ్యం

కాంగ్రెస్‌లో వర్గపోరు

1946 ఎన్నికల తర్వాత మద్రాసు కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు సర్వసాధారణమైంది. 1946-51 సమయంలో, ముగ్గురు వేర్వేరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మద్రాసు ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. 1946 ఎన్నికల తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా పనిచేసాడు. తెలుగు మాట్క్లాడే ప్రకాశం, అతను మద్రాసు ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె. కామరాజ్‌తో తరచూ విభేదించేవాడు. ఒక సంవత్సరం లోపే కామరాజ్ కారణంగా ప్రకాశం రాజీనామా చేయవలసి వచ్చింది. 1947లో కామరాజు నామినీ అయిన ఓమండూరు రామస్వామి రెడ్డియార్ ముఖ్యమంత్రి అయ్యాడు. రెడ్డియార్ స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి వచ్చినపుడు కామరాజ్, 1949 మార్చి 31 న కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో అవిశ్వాస తీర్మానం ద్వారా అతనిని తొలగించాడు. 1949 ఏప్రిల్ 6న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తదుపరి ముఖ్యమంత్రి పిఎస్ కుమారస్వామి రాజా కామరాజుకు తొత్తు అని భావించారు. 1952 ఎన్నికలలో శ్రీవిల్లిపుత్తూరు నియోజకవర్గంలో ఆయన ఓడిపోయేవరకు అతను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాడు.[1] ఈ కాలంలో మద్రాసు కాంగ్రెస్ పార్టీలోని ప్రధాన వర్గాలు: 1) ఆంధ్ర (ప్రకాశం) వర్గం,2) రాజాజీ వర్గం 3) కామరాజ్ వర్గం (తమిళ బ్రాహ్మణేతరులు) 4) బెజవాడ గోపాల రెడ్డి, కళా వెంకటరావుల వర్గం. ఈ చివరి వర్గానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పట్టాభి సీతారామయ్య మద్దతు ఉండేది.[2]

తరువాతి కాలంలో ప్రకాశం వర్గం కాంగ్రెస్ నుండి విడిపోయి హైదరాబాద్ స్టేట్ ప్రజా పార్టీని స్థాపించింది. ఆ పార్టీ 1951 జూన్‌లో కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీలో విలీనమైంది.

ఎన్నికల ప్రక్రియలో కమ్యూనిస్టులు

1948-51 కాలంలో సాయుధ పోరాటం చేసిన భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) బలవంతంగా అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాన్ని 1951లో విరమించుకుని రాజకీయ ప్రధాన స్రవంతిలో చేరింది. పార్టీ 1951 సమావేశంలో, పార్టీ ప్రధాన నినాదంగా ఉన్న "పీపుల్స్ డెమోక్రసీ" స్థానంలో "నేషనల్ డెమోక్రసీ"ని తీసుకొచ్చారు. ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సీపీఐ మద్దతు ఇచ్చిన సాయుధ ఉద్యమాలలో ఒకటి హైదరాబాద్ సంస్థానంలో జరిగిన తెలంగాణ విమోచనోద్యమం. 1951 నాటికి తిరుగుబాటును అణిచివేసినప్పటికీ, పొరుగున ఉన్న ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టులకు విస్తృతంగా మద్దతు ఉండేది. దీనికి కారణం వారి భాషా జాతీయవాద విధానం (తెలుగు మాట్లాడే ప్రజల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్), రెడ్డి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న కమ్మ కులంలో వారి మద్దతుగా ఉన్న పునాది. అప్పటి వరకు, ఆస్తి యాజమాన్య అర్హతల ఆధారంగా వోటుహక్కు పరిమితంగా ఉండేది. 1951 ఎన్నికల నుండి సార్వత్రికంగా వయోజనులందరికీ వోటుహక్కు లభించింది. చాలా మంది తొలిసారి వోటు వేస్తున్న భూమిలేని రైతులు, వ్యవసాయ కూలీలలో కమ్యూనిస్టులకు మద్దతు ఉండేది.[3][4][5][6][7] తమిళనాడులోని వ్యవసాయ జిల్లా తంజావూరులో కూడా వారికి బలమైన ఉనికి ఉంది, అక్కడ వారికి ద్రావిడర్ కజగం మద్దతు ఇచ్చింది.[8]

ద్రావిడ ఉద్యమంలో చీలిక

రాష్ట్రంలోని తమిళం మాట్లాడే ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్షమైన ద్రావిడర్ కజగం (డికె) 1949లో విడిపోయింది. ఒకప్పుడు డికె నాయకుడు పెరియార్ EV రామసామికి శిష్యుడైన CN అన్నాదురై, డికె నుండి వైదొలిగి, ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎమ్‌కె) అనే కొత్త పార్టీని స్థాపించాడు. డికె, డిఎమ్‌కెలు రెండూ ద్రావిడుల ప్రత్యేక రాష్ట్రం కోసం వేర్పాటువాదాన్ని సమర్ధించిన వారే.[9][10] 1944లో ద్రావిడర్ కజగం అని పేరు మార్చబడిన జస్టిస్ పార్టీ పాత నేతలలో కొందరు పెరియార్ నాయకత్వాన్ని అంగీకరించడానికి నిరాకరించారు. PT రాజన్ నేతృత్వంలో వారు, తమదే నిజమైన జస్టిస్ పార్టీ అని పట్టుబట్టారు. 1952 ఎన్నికలలో "త్రాసు" గుర్తుతో పోటీ చేశారు.

నియోజకవర్గాలు

ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 6, 9 ల ప్రకారం రాష్ట్రపతి చేసిన పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల (మద్రాస్) డిలిమిటేషన్ ఆర్డర్, 1951 ప్రకారం, మద్రాసు శాసనసభలో ఎన్నికల ద్వారా భర్తీ చేయబడే 375 స్థానాలున్నాయి. వీటిలో 309 ఏకసభ్య నియోజకవర్గాలు 66 ద్విసభ్య నియోజకవర్గాలు ఉండేవి. ద్విసభ్య నియోజకవర్గాలలో 62 నియోజకవర్గాలలో ఒక్కొక్క స్థానం షెడ్యూల్డ్ కులాలకు, 4 నియోజకవర్గాలలో ఒక్కొక్కటి షెడ్యూల్డ్ తెగలకూ రిజర్వ్ చేసారు.[11] ఈ ఎన్నికల్లో మూడు స్థానాల్లో పోటీ జరగలేదు. మిగిలిన 372 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.[12]

ద్విసభ్య నియోజకవర్గాలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 332 ప్రకారం ఏర్పాటు చేసారు. ఓటింగ్ పద్ధతినీ, బహుత్వ ఎన్నికల సూత్రాన్నీ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, 1950లో నిర్వచించారు.[13] ద్విసభ్య నియోజకవర్గాలు పరిమాణంలో పెద్దవి. సాధారణ నియోజకవర్గాలతో పోల్చినప్పుడు ఎక్కువ సంఖ్యలో ఓటర్లు (1,00,000 కంటే ఎక్కువ) [14] ఉన్నారు. ఆ నియోజకవర్గాల్లో రెండు వేర్వేరు అభ్యర్థుల జాబితా, సాధారణ జాబితా, రిజర్వ్‌డ్ జాబితా పోటీకి దిగింది. ప్రతి ఓటరు రెండు ఓట్లు వేయాలి - ఒక్కో జాబితాకు ఒకటి.

ఇద్దరు విజేతలను ఈ క్రింది విధంగా ఎంపిక చేసేవారు:

  • రిజర్వ్‌డ్ సభ్యుడు - రిజర్వ్‌డ్ (SC/ST) జాబితా అభ్యర్థులలో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థి
  • సాధారణ సభ్యుడు – రిజర్వ్‌డ్ సభ్యుడిని (రిజర్వ్ చేయబడిన, సాధారణ జాబితాలతో సహా) మినహాయించి మిగిలిన అభ్యర్థులలో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థి.

ఈ వ్యవస్థ అసమానతలకు దారితీసింది. ఉదాహరణకు, 1957 ఎన్నికలలో కోయంబత్తూరు - II నియోజకవర్గంలో, ఎన్నికైన సభ్యులు ఇద్దరూ రిజర్వ్‌డ్ జాబితాకే చెందినవారు - రిజర్వ్‌డ్ జాబితాలో రెండవ అత్యధిక ఓట్లను పొందిన అభ్యర్థి సాధారణ జాబితాలో అత్యధిక ఓట్లను పొందిన వారి కంటే ఎక్కువ ఓట్లను సాధించాడు. 1961లో ఇద్దరు సభ్యుల నియోజకవర్గాల రద్దు చట్టం (1961) ద్వారా డబుల్ సభ్యుల ప్రాతినిధ్యాన్ని రద్దు చేసినందున 1952, 1957 ఎన్నికలలో మాత్రమే బహుళ సభ్యులు ఎన్నికయ్యారు.[15]

రాజకీయ పార్టీలు

మద్రాస్‌లో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థులు సిపిఐ, ప్రకాశం నేతగా ఉన్న కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ (కెఎమ్‌పిపి), NG రంగా నేతృత్వంలోని కృషికార్ లోక్ పార్టీ (హైదరాబాద్ స్టేట్ ప్రజా పార్టీ నుండి విడిపోయిన సమూహం). ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎమ్‌కె) 1952 ఎన్నికలలో పోటీ చేయలేదు. బదులుగా అది వన్నియార్ కుల ఆధారిత పార్టీలైన కామన్‌వీల్ పార్టీ, తమిళనాడు టాయిలర్స్ పార్టీ అభ్యర్థులకూ, చెంగెల్‌పేట్, సేలం, ఉత్తర, దక్షిణ ఆర్కాట్ జిల్లాలలో ఐదుగురు స్వతంత్రులకూ మద్దతు ఇచ్చింది. వారు బలపరిచిన అభ్యర్థుల చేత శాసనసభలో డిఎంకె ఎజెండాకు మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞపై సంతకం చేయించుకుంది.[9][16] ద్రావిడర్ కజగం కూడా నేరుగా ఎన్నికల్లో పాల్గొనలేదు. అయితే, అది బ్రాహ్మణ ఆధిపత్య పార్టీ అని చెప్పుకునే భారత జాతీయ కాంగ్రెస్‌ను ఓడించే ప్రయత్నంలో కమ్యూనిస్టులకు మద్దతు ఇచ్చింది. ఎన్నికల్లో అనేక ఇతర పార్టీలు, స్వతంత్రులకు కూడా అది మద్దతు ఇచ్చింది.[8][17] పీటీ రాజన్ నేతృత్వంలోని జస్టిస్ పార్టీ తొమ్మిది స్థానాల్లో పోటీ చేసింది.

ఎన్నికలు

1952 మార్చి 27 న పోలింగ్ జరిగింది మొత్తం 2,507 మంది తమ నామినేషన్లను దాఖలు చేశారు. వీరిలో 2,472 మంది పురుషులు, 35 మంది మహిళలు. వీరిలో 78 మంది పురుషులు, ఒక మహిళ వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 741 మంది పురుషులు, 10 మంది మహిళలు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.[12]

ప్రభుత్వ ఏర్పాటు

సి. రాజగోపాలాచారి ఎన్నిక

ఉమ్మడి మద్రాసు రాష్ట్రం అప్పుడు మొత్తం 375 మంది అసెంబ్లీ సభ్యులతో ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకలోని కొన్ని భాగాలను కలిగి ఉంది. 375 మంది ఉన్న అసెంబ్లీలో 152 మంది సభ్యులతో భారత జాతీయ కాంగ్రెస్మెజారిటీ సాధించలేదు. ఇది మలబార్‌లోని 29 నుండి 4 సీట్లు, ఆంధ్రా ప్రాంతాల్లోని 143లో 43, 190 తమిళ నియోజకవర్గాలలో 96, కన్నడ మాట్లాడే ప్రాంతాలలో ఉన్న 11 సీట్లలో 9 సీట్లు గెలుచుకుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారస్వామి రాజా తన మంత్రివర్గంలోని ఐదుగురు ఇతర సభ్యులు - బెజవాడ గోపాల రెడ్డి, కళా వెంకటరావు, కె. చంద్రమౌళి, కె. మాధవ మీనన్, ఎం. భక్తవత్సలంలతో సహా ఈ ఎన్నికలలో ఓడిపోయాడు.[18][19]

కొన్ని సంవత్సరాలుగా తెలుగు మాట్లాడే ప్రాంతాలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్న మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో సిపిఐ సభ్యులు ఎన్నికయ్యారు. 1952 ఫిబ్రవరిలో, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ఏర్పాటుకు మద్రాసులో కెఎమ్‌పిపి నాయకుడు ప్రకాశం ఆధ్వర్యంలో కాంగ్రెసేతర సభ్యులు సమావేశమై "కామన్ మినిమమ్ ప్రోగ్రామ్"ను విడుదల చేశారు. వారు 166 స్థానాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారని (సిపిఐ, సిపిఐ మద్దతు ఉన్న స్వతంత్రులు - 70, కెఎమ్‌పిపి - 36, తమిళనాడు టాయిలర్స్ పార్టీ - 19, కామన్వెల్ పార్టీ - 6, FBL (MG) - 3, SCF - 1, JUస్వ.పా −1, స్వతంత్రులు - 30) . అతిపెద్ద ఏకైక నాయకుడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రకాశం గవర్నర్ శ్రీప్రకాశకు లేఖ రాశాడు. కమ్యూనిస్టులు అధికారం చేపట్టడం గానీ, రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించడం గానీ కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. ఏకాభిప్రాయ అభ్యర్థిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గాను, రాజాజీని పదవీ విరమణ నుండి బయటకు తీసుకువచ్చారు.[18][20][21] మద్రాస్ ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కామరాజ్, బలహీనమైన కూటమి చివరికి కూలిపోవచ్చని అంచనా వేసినందున UDF ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించాలని అభిప్రాయపడ్డాడు. అయితే TT కృష్ణమాచారి, రామ్‌నాథ్ గోయెంకా వంటి ఇతర నాయకులు రాజాజీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నామినేట్ చేయాలని కోరారు.[22]

1952 ఏప్రిల్ 1న గవర్నర్ శ్రీప్రకాశ ప్రభుత్వ ఏర్పాటు చేయమని రాజాజీని ఆహ్వానించాడు. 1952 ఏప్రిల్ 10న రాజాజీ ప్రమాణ స్వీకారం చేశాడు. అతను ఉప ఎన్నికలకు పోటీ చేయడానికి నిరాకరించాడు. గవర్నర్ అతన్ని ఎగువ సభకు (లెజిస్లేటివ్ కౌన్సిల్) నామినేట్ చేశాడు. కౌన్సిల్‌కు సభ్యుని నామినేట్ చేయడం అనేది క్యాబినెట్ సిఫారసు మేరకు మాత్రమే జరుగుతుంది కాబట్టి, గవర్నరు చేసిన ఈ చర్యను "రాజ్యాంగ విరుద్ధం"గా పరిగణించారు. అయితే ఈ విషయంలో ఇంకా మంత్రివర్గం ఏర్పాటు కాకపోవడంతో గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరించారు.[1][19][23] మే 6న, అసెంబ్లీ ప్రస్తుత స్పీకర్, కాంగ్రెస్‌కు చెందిన జె. శివషణ్ముగం పిళ్లై 206 - 162 ఓట్ల తేడాతో స్వతంత్ర ఎమ్మెల్యే స్వయంప్రకాశాన్ని ఓడించి తిరిగి స్పీకర్‌గా ఎన్నికయ్యాడు.[24] జూలై 3న, 151 మంది వ్యతిరేకతతో (ఒకరు తటస్థ) 200 మంది సభ్యుల మద్దతుతో రాజాజీ విశ్వాస తీర్మానాన్ని గెలవగలిగారు.[25][26][27][28] భారతదేశంలోని ఏ శాసనసభలోనైనా ఇటువంటి "విశ్వాస తీర్మానం" ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి.[29] అతను UDF నుండి ఫిరాయింపులను రాబట్టి, ఇతర పార్టీల సహాయంతో మెజారిటీని పొందగలిగాడు:

  • కామన్వెల్ పార్టీకి చెందిన 6 మంది సభ్యుల మద్దతు, ( వన్నియార్ల కారణానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు పార్టీలలో ఒకటి) దాని నాయకుడు - MA మాణిక్కవేలు నాయకర్‌కు క్యాబినెట్ స్థానం ఇవ్వడం ద్వారా పొందబడింది. 19 మంది ఇతర వన్నియార్ పార్టీ – తమిళనాడు టాయిలర్స్ పార్టీ SS రామసామి పడయాచి నేతృత్వంలోని సభ్యులు కూడా విశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చారు కానీ మంత్రివర్గంలో చేరలేదు. (వారు తరువాత 1954లో కామరాజ్ మంత్రివర్గంలో చేరారు).[9][30][31]
  • చాలా మంది స్వతంత్రులు కాంగ్రెస్‌లో చేరి కాంగ్రెస్ శాసనసభ్యులు అయ్యారు. 1952 ఏప్రిల్ 1న 152గా ఉన్న కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) బలం మే 3 నాటికి 165కి, సెప్టెంబరు 30 నాటికి 167కి పెరిగింది.[32]
  • రాజాజీ కృషికార్ లోక్ పార్టీని చీల్చారు, కెఎల్‌పి శాసనసభ్యులు P. తిమ్మారెడ్డి, నీలాద్రి రావు రెడ్డి, కుమిశెట్టి వెంకటనారాయణ దొర కాంగ్రెస్‌లో చేరారు.[33][34]
  • మద్రాసు రాష్ట్ర ముస్లిం లీగ్‌కు చెందిన 5 మంది సభ్యులు కమ్యూనిస్టులు అధికారం పొందకుండా కాంగ్రెస్‌కు తమ మద్దతును అందించారు.[35]

కె. కామరాజ్ ఎన్నిక

1953లో విస్తృతమైన ఆందోళన తర్వాత మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాల నుండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు శాసనసభను 375 నుండి 230కి కుదించారు. 140 మంది సభ్యులు ఆంధ్రాకు, 5 గురు మైసూరుకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి 118 స్థానాలతో పూర్తి మెజారిటీతో ఉంది.[25] దీంతో కె. కామరాజ్ నాయకత్వంలో ఉన్న బ్రాహ్మణేతర కాంగ్రెస్ శక్తులు బలోపేత మయ్యాయి. అతను 1954 మార్చి 31న రాజాజీని తొలగించి, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యాడు. తమిళనాడు టాయిలర్స్ పార్టీ, కామన్‌వీల్ పార్టీ నాయకులకు మంత్రి పదవులు ఇచ్చి కామరాజ్, తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడు కాంగ్రెస్‌లో బ్రాహ్మణ ఆధిపత్యానికి ముగింపు పలికింది.[36]

ప్రభావం

ఎన్నికల పరాజయానికి బాధ్యత వహిస్తూ కామరాజ్ తన ప్రావిన్స్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసాడు. త్వరలో అతని స్థానంలో పి. సుబ్బరాయన్‌ను నియమించారు.[22] రాజాజీని శాసనమండలికి నామినేట్ చేయడాన్ని మదురై ఉత్తర నియోజకవర్గం నుండి సిపిఐ ఎమ్మెల్యే పి. రామమూర్తి మద్రాసు హైకోర్టులో సవాలు చేశారు. ప్రజా ప్రయోజన రిట్ పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజమన్నార్, జస్టిస్ వెంకటరామ అయ్యర్, "కోర్టు రాజకీయ హక్కులను నిర్ణయించదు లేదా ప్రజా ప్రయోజనాలను లేదా రాజ్యాంగ సంప్రదాయాలను అమలు చేయదు" అని అభిప్రాయపడుతూ, జోక్యం చేసుకోవడానికి నిరాకరించారు.[37] కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీకి తోడ్పాటుగా గవర్నర్లు చేసిన రాజ్యాంగపరమైన అక్రమాల సుదీర్ఘ జాబితాలో గవర్నర్ శ్రీప్రకాశ నెలకొల్పిన ఈ ఉదాహరణ మొదటిది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య అధికార సమతుల్యతను పరిశీలించడానికి 1983లో ఏర్పాటైన సర్కారియా కమిషన్ "గవర్నర్ పని, ప్రభుత్వం ఏర్పడేలా చూడటమే తప్ప తాను ఆమోదించిన విధానాలను అనుసరించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడం కాదు" అని వ్యాఖ్యానించింది.[23]

మంత్రివర్గం

రాజగోపాలాచారి మంత్రివర్గం

మంత్రి పోర్ట్‌ఫోలియో [38]
సి.రాజగోపాలాచారి ముఖ్యమంత్రి, ప్రజా, పోలీసులు
ఎబి శెట్టి ఆరోగ్యం
సి. సుబ్రమణ్యం ఆర్థిక, ఆహారం, ఎన్నికలు
కె. వెంకటస్వామి నాయుడు మతపరమైన ఎండోమెంట్స్, రిజిస్ట్రేషన్
ఎన్. రంగారెడ్డి పబ్లిక్ వర్క్స్
ఎంవీ కృష్ణారావు విద్య, హరిజన ఉద్ధరణ, సమాచారం
వీసీ పళనిసామి గౌండర్ నిషేధం
యు.కృష్ణారావు పరిశ్రమలు, కార్మికులు, మోటారు రవాణా, రైల్వేలు, పోస్టులు, టెలిగ్రాఫ్‌లు, పౌర విమానయానం
ఆర్.నాగన గౌడ వ్యవసాయం, అడవులు, పశువైద్యం, పశుసంవర్ధక, మత్స్య, సింకోనా
ఎన్. శంకర రెడ్డి స్థానిక పరిపాలన
ఎం.ఎ. మాణిక్కవేలు నాయకర్ భూమి రెవెన్యూ
కె.పి. కుట్టికృష్ణన్ నాయర్ కోర్టులు, జైళ్లు, న్యాయ శాఖ
రాజా శ్రీ షణ్ముగ రాజేశ్వర సేతుపతి ఇంటి అద్దె నియంత్రణ
యస్.బి.పి. పట్టాభిరామారావు గ్రామీణ సంక్షేమం, వాణిజ్య పన్నులు, షెడ్యూల్డ్ ప్రాంతాలు
డి. సంజీవయ్య సహకారం, హౌసింగ్
మార్పులు
  • బళ్లారి, ఆంధ్రా నియోజకవర్గాలకు చెందిన మంత్రులు (నాగన్న గౌడ, శంకరరెడ్డి, పట్టాభిరామరావు, సంజీవయ్య, రంగా రెడ్డి) ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఒక రోజు ముందు, 1953 సెప్టెంబరు 30న రాజీనామా చేశారు.[39] వ్యవసాయం, అటవీ, మత్స్య, సింకోనా, గ్రామీణ సంక్షేమం, కమ్యూనిటీ ప్రాజెక్టులు, జాతీయ విస్తరణ పథకాల శాఖలను 1953 అక్టోబరు 9న ఎం. భక్తవత్సలంకు అప్పగించారు. జోతి వెంకటాచలం ప్రొహిబిషన్, మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు. కె. రాజారాం నాయుడు స్థానిక పరిపాలన శాఖ మంత్రి అయ్యారు. సి.సుబ్రమణ్యానికి విద్య, సమాచారం, ప్రచార శాఖల అదనపు శాఖలు ఇచ్చారు. వీసీ పళనిస్వామి గౌండర్‌కు పశువైద్యం, పశుసంవర్ధక శాఖ, హరిజన సంక్షేమం బాధ్యతలు అప్పగించారు.[40]

కామరాజ్ మంత్రివర్గం

కామరాజ్ ముఖ్యమంత్రిగా 1954 ఏప్రిల్ 13 - 1957 ఏప్రిల్ 13 మధ్య పనిచేసిన మంత్రివర్గం సభ్యులు

మంత్రి పోర్ట్ఫోలియో
కె. కామరాజ్ ముఖ్యమంత్రి-హోం శాఖలో ప్రజా, పోలీసు శాఖల మంత్రి
ఎ. బి. శెట్టి వైద్య, ప్రజారోగ్యం, సహకారం, గృహనిర్మాణం, మాజీ సైనికుల శాఖల మంత్రి
ఎం. భక్తవత్సలం వ్యవసాయం, అటవీ, మత్స్య, సింకోనా, గ్రామీణాభివృద్ధి, కమ్యూనిటీ ప్రాజెక్టులు, జాతీయ విస్తరణ పథకం, మహిళా సంక్షేమం, పరిశ్రమలు, కార్మిక, పశుసంవర్ధక, పశువైద్య శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
సి. సుబ్రమణ్యం ఆర్థిక, ఆహార, విద్య, ఎన్నికలు, సమాచార, ప్రచారం, చట్టం (కోర్టులు, జైళ్లు)
ఎం. ఎ. మాణికవేలు నాయక్కర్ భూ రెవెన్యూ, వాణిజ్య పన్నులు, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
రాజా శ్రీ షణ్ముగ రాజేశ్వర సేతుపతి స్టేషనరీ విభాగం, ప్రభుత్వ ప్రెస్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ప్రశ్నలతో సహా ప్రజా పనులు, వసతి నియంత్రణ, ఇంజనీరింగ్ కళాశాలలు, స్టేషనరీ, ప్రింటింగ్ ఇన్ఛార్జ్ మంత్రి
బి. పరమేశ్వరన్ రవాణా, హరిజన ఉన్నతి, హిందూ మతపరమైన ఎండోమెంట్స్, రిజిస్ట్రేషన్, నిషేధం ఇన్ఛార్జ్ మంత్రి
ఎస్. ఎస్. రామస్వామి పదయాచి స్థానిక పరిపాలనకు బాధ్యత వహిస్తున్న మంత్రి

ఎన్నికైన సభ్యుల జాబితా

తమిళనాడు

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, మైసూర్ రాష్ట్రంలో భాగమయ్యే నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు ఇక్కడ జాబితా చేయబడ్డాయి.

నియోజకవర్గం విజేత పార్టీ రెండవ స్థానం పార్టీ
నామినేటు చేయబడినవారు రాజగోపాలాచారి కాంగ్రెస్
అదిరంపట్టినం 1) S. Venkatarama Iyer

2) V. Vairavathevar

కాంగ్రెస్

కాంగ్రెస్

K. Muthiah

Uncontested

సిపిఐ

Uncontested

అడుతురై నారాయణస్వామి నాయుడు కాంగ్రెస్ Samiappa Mudaliar JUస్వ.పా
అలంగుళం చిన్నతంబి కాంగ్రెస్ Thangarathnasamy Nadar స్వతంత్ర
అంబసముద్రం పి. చొక్కలింగం స్వతంత్ర Lakshmisankara Iyer కాంగ్రెస్
అరక్కోణం భక్తవత్సలు నాయుడు స్వతంత్ర Vedachalam కాంగ్రెస్
అరంతంగి మహమద్ సలీహు మరైకైర్ కాంగ్రెస్ Ramaswamy Thevar స్వతంత్ర
ఆర్కాట్ S. పంచాక్షరం చెట్టియార్ కాంగ్రెస్ Nagarathinam కావీపా
అరవకురిచ్చి ఎన్. రత్న గౌండర్ స్వతంత్ర T. M. Nallaswamy కాంగ్రెస్
అరియలూర్ పళనిఅండి స్వతంత్ర Razar కాంగ్రెస్
అర్ని V. K. కన్నన్ కావీపా W. S. Srinivasa Rao కాంగ్రెస్
అరుప్పుకోట్టై జయరామ రెడ్డియార్ కాంగ్రెస్ M. D. Ramaswami స్వతంత్ర
రచయిత సౌందరం రామచంద్రన్ కాంగ్రెస్ V. S. S. Mani Chettiar స్వతంత్ర
అత్తూరు పి. సుబ్రమణ్యం స్వతంత్ర P. Sellamuthu Padayachi కాంగ్రెస్
చెంగల్పట్టు కె. వినాయకం KMPP V. L. Raja కాంగ్రెస్
భవానీ బి. కె. నల్లస్వామి కాంగ్రెస్ N. Palaniswamy Gounder TTP
భువనగిరి వి.కృష్ణస్వామి పడయాచి కాంగ్రెస్ S. Tiruvenkata Nainar TTP
చెంగం రామస్వామి గౌండర్ కావీపా Muthukrishna Chettiar కాంగ్రెస్
చేరన్మహాదేవి S. చెల్లపాండి కాంగ్రెస్ S. Dasaratharam స్వ.పా
చెయ్యార్ ధర్మలింగ నాయకర్ కావీపా P. Ramachandran కాంగ్రెస్
చిదంబరం 1) స్వామి సహజానంద

2) వాఘీసన్ పిళ్లై

కాంగ్రెస్

కాంగ్రెస్

3) Swamikannu

4) Sivasubramanian

TTP

TTP

చూలై సెబాస్టియన్ సిరిల్

కాన్స్టాంటైన్ ఆంథోనీ పిళ్లై

స్వ.పా D. K. Kannappar కాంగ్రెస్
కోయంబత్తూరు సి. సుబ్రమణ్యం కాంగ్రెస్ C. P. Kandaswamy సిపిఐ
కడలూరు 1) రత్నం

2) శివచిదంబర రామస్వామి పాదయాచి

TTP

TTP

3) Srinivasa Padayachi

4) Ganesan

కాంగ్రెస్

కాంగ్రెస్

కంబమ్ P. T. రాజన్ JUస్వ.పా S. K. Ahmed Meeran కాంగ్రెస్
ధరాపురం సేనాపతి గౌండర్ స్వతంత్ర Nataraja Gounder కాంగ్రెస్
ధర్మపురి పి.ఆర్. రాజగోపాల గౌండర్ స్వతంత్ర R. S. Veerappa Chettiar స్వతంత్ర
దిండిగల్ మునిసామి పిళ్లై కాంగ్రెస్ A. Balasubramaniam సిపిఐ
ఎడప్పాడి ఎస్. అర్థనారీశ్వర గౌండర్ కాంగ్రెస్ S. Marimuthu Gounder TTP
ఎదిర్కోట్టై ఆర్.కృష్ణసామి నాయుడు కాంగ్రెస్ Muthuramanujam స్వతంత్ర
ఈరోడ్ రాజు సిపిఐ Deivasigamani Gounder కాంగ్రెస్
జింజీ అరంగనాథన్ TTP K. Ramakrishnaswamy Pillai కాంగ్రెస్
గోపిచెట్టిపాళయం P. S. నల్ల గౌండర్ కాంగ్రెస్ P. K. Nalla Gounder స్వతంత్ర
గుడియాట్టం 1) ఎ.జె. అరుణాచల ముదలియార్

3) రత్నస్వామి

కాంగ్రెస్ 2) P. S. Rajagopala Naidu

4) Kannabiran

స్వతంత్ర

సిపిఐ

హార్బర్ కృష్ణారావు కాంగ్రెస్ Ibrahim Sahib స్వతంత్ర
హరూర్ 1) ఎ. దురైస్వామి గౌండర్

2) నంజప్పన్

స్వతంత్ర

కాంగ్రెస్

3) Sambasiva Reddy

4) Mariappan

కాంగ్రెస్

SCF

హోసూరు ఎం. ముని రెడ్డి స్వతంత్ర K. Appavu Pillai కాంగ్రెస్
జయకొండన్ 1) అయ్యావు

2) కె. ఆర్. విశ్వనాథన్

TTP

TTP

3) Muthukumaraswamy Mudaliar

4) Raghupathi

కాంగ్రెస్

కాంగ్రెస్

కదంబూర్ వేణుగోపాల కృష్ణస్వామి కాంగ్రెస్ Subbiah Naicker స్వతంత్ర
కలసపాక్కం నటరాజ ముదలియార్ స్వతంత్ర Periasami Gounder కాంగ్రెస్
కళ్లకురిచ్చి 1) ఎల్య పిళ్లై

2) ఆనందన్

స్వతంత్ర

కాంగ్రెస్

3) Govindan

4) Parthasarathy

TTP

కాంగ్రెస్

కాంచీపురం దైవసిగమణి KMPP P. S. Srinivasan కాంగ్రెస్
కంగాయం ఎ. కె. సుబ్బరాయ గౌండర్ కాంగ్రెస్ Not contested Not contested
కారైకుడి చొక్కలింగం చెట్టియార్ కాంగ్రెస్ Mahalingam Chettiar స్వతంత్ర
కరూర్ 1) ఎం. మాణిక్కసుందరం

3) T. V. సన్నాసి

స్వతంత్ర

కాంగ్రెస్

2) S. Muthusamy Gounder

4) Vadivel Moopan

కాంగ్రెస్

స్వతంత్ర

కొడుముడి నల్లశివన్ స్వ.పా Makutapathy Gounder కాంగ్రెస్
కోయిల్పాలాయ V. K. పళనిస్వామి గౌండర్ కాంగ్రెస్ Ramaswamy Naidu స్వ.పా
కోవిల్‌పట్టి రామసామి కాంగ్రెస్ Shanmugham స్వతంత్ర
కృష్ణగిరి డి.కృష్ణమూర్తి గౌండర్ స్వతంత్ర S. Nagaraia Maniar కాంగ్రెస్
కుంభకోణం వరదన్ కాంగ్రెస్ Somu Rao సిపిఐ
లాల్గుడి రాజా చిదంబరం స్వతంత్ర Varadarajan కాంగ్రెస్
మనమదురై కృష్ణస్వామి అయ్యంగార్ కాంగ్రెస్ Abdul Gafoor సిపిఐ
మదుక్కరై ఆర్.కుప్పుస్వామి కాంగ్రెస్ Chinnadurai స్వ.పా
మదురై ఉత్తర పి. రామమూర్తి సిపిఐ T. Chidambara Bharathi కాంగ్రెస్
మదురై సౌత్ టి కె రామ కాంగ్రెస్ A. Dharmaraj Santhosam స్వతంత్ర
మదురాంతకం 1) బి. పరమేశ్వరన్

2) వి.వెంకటసుబ్బారెడ్డి

కాంగ్రెస్

కాంగ్రెస్

3) K. Muthulinga Reddiar

4) Kothandarama Reddiar

REP

స్వ.పా

మనచనల్లూరు రాజగోపాల్ కాంగ్రెస్ Arunachalam స్వతంత్ర
మనప్పారై ఆంటోనీ పీటర్ కాంగ్రెస్ Kulandaivel స్వతంత్ర
మన్నార్గుడి 1) ఎం. కందస్వామి

3) సుబ్బయ్య

సిపిఐ

సిపిఐ

2) Ramachandra Naidu

4) Thiagu Voikarar

కాంగ్రెస్

కాంగ్రెస్

మయూరం 1) కె. ఆర్. సంబందన్

2) ఎ. వెలూ

స్వతంత్ర

స్వతంత్ర

K. Pitchai

N. Rangaswami Reddiar

కాంగ్రెస్

కాంగ్రెస్

మేచేరి ఎస్. సుబ్రమణ్య గౌండర్ కాంగ్రెస్ M. Kandasamy Kandan స్వతంత్ర
మేల్మలయూర్ వి.గోపాల గౌండర్ TTP K. Gopala Gounder కాంగ్రెస్
మేలూరు 1) S. చిన్నకరుప్ప తేవర్

2) పి. శివప్రకాశం

కాంగ్రెస్

కాంగ్రెస్

3) B. Ponnuchami Ambalam

4) K. Veerana Veduvan

FBL(MG)

సిపిఐ

మెట్టుపాళయం కెంపి గౌండర్ స్వతంత్ర Azad Abdul Salam కాంగ్రెస్
ముదుకులత్తూరు 1) మొట్టయ్య కుదుంబన్

2) యు.ముత్తురామలింగం తేవర్

FBL(MG)

FBL(MG)

3) Sankaran

4) Shanmuga Sundaram

కాంగ్రెస్
ముసిరి తంగవేలు స్వతంత్ర M. P. Krishnaswami కాంగ్రెస్
మైలాపూర్ సి.ఆర్. రామస్వామి కాంగ్రెస్ Krishnamurthi స్వతంత్ర
నాగపట్టణం 1) శివరాజ్

2) వడివేలు

సిపిఐ

సిపిఐ

3) Duraisamy

4) Shanmugasundaram Pillai

కాంగ్రెస్

కాంగ్రెస్

నమక్కల్ 1) కె. వి. రామస్వామి

2) M. P. పెరియస్వామి

సిపిఐ

కాంగ్రెస్

3) T. Sivagnanam Pillai

4) S. Chinnayan

కాంగ్రెస్

స్వతంత్ర

నంబియూర్ 1) పి.జి. కరుతిరుమన్

2) పి.జి. మాణికం

కాంగ్రెస్

కాంగ్రెస్

3) C. K. Subramaniam Gounder

4) K. A. Palaniappan

స్వతంత్ర

SCF

నంగునేరి M. G. శంకర్ రెడ్డియార్ కాంగ్రెస్ Madaswamy స్వతంత్ర
నన్నిలం 1) ముత్తుకుమారస్వామి

2) త్యాగరాజ పిళ్లై

కాంగ్రెస్

కాంగ్రెస్

3) Anthony Muthu

4) Kalyanasundaram Pillai

సిపిఐ

సిపిఐ

నిడమంగళం వెంకటేశ షోలగర్ సిపిఐ Sambasiva Ayyar కాంగ్రెస్
నీలకోట్టై 1) అయ్యనార్

2) ముత్తు తేవర్

కాంగ్రెస్

కాంగ్రెస్

3) Ponniah Konar

4) Govindan

స్వతంత్ర

స్వ.పా

నీలగిరి 1) ఆరి గౌడ్

2) కె. హెచ్. బొమ్మన్

స్వతంత్ర

కాంగ్రెస్

3) R. Raman Nair

4) C. P. Krishnaiah

కాంగ్రెస్

స్వతంత్ర

ఒద్దంచత్రం సుబ్రమణ్య లక్ష్మీపతి నాయకర్ స్వతంత్ర K. Karuthappa Gounder కాంగ్రెస్
ఓమలూరు పి. రథీనస్వామి పిళ్లై స్వతంత్ర K. Nanjappa Chettiar కాంగ్రెస్
పన్రుతి ఎస్. రాధాకృష్ణన్ TTP P. A. Ranganatha Padayachi కాంగ్రెస్
పళని M. P. మంగళ గౌండర్ స్వతంత్ర P. S. K. Lakshmipathi Raju కాంగ్రెస్
పాలవూరు టి.గణపతి కాంగ్రెస్ N. Duraipandi KMPP
పాపనాశం స్వయంప్రకాశం స్వతంత్ర Abdul Majid Sahib కాంగ్రెస్
పరమకుడి గోవిందన్ కాంగ్రెస్ Natarajan సిపిఐ
పరమతి R. రంగస్వామి గౌండర్ స్వతంత్ర P. V. Kuppayandi Pillai కాంగ్రెస్
పట్టుకోట్టై నడిముత్తు పిళ్లై కాంగ్రెస్ Marimuthu స్వ.పా
పెన్నాగారం S. కందస్వామి గౌండర్ TTP M. N. Raja Chettiar స్వతంత్ర
పెరంబలూరు 1) పరమశివం

3) పళనిముత్తు

స్వతంత్ర

TTP

2) Thangavelu

4) Pariannan

TTP

స్వతంత్ర

పెరంబూర్ S. పక్కిరిసామి పిళ్లై స్వ.పా M. Santhosam కాంగ్రెస్
పెరియకులం 1) వి. ముత్తు

2) మూకయ్య తేవర్

కాంగ్రెస్

FBL(MG)

3) N. R. Thyagarajan

4) Ponnuchami

కాంగ్రెస్

స్వ.పా

పొల్లాచి 1) ఎన్.మహాలింగం

2) P. K. తిరుమూర్తి

కాంగ్రెస్

కాంగ్రెస్

3) Marudachalam

4) Palanisami

సిపిఐ

సిపిఐ

పోలూరు మాణిక్కవేలు నాయకర్ కావీపా Annamalai Chetty కాంగ్రెస్
పొన్నేరి 1) ఓ. చెంగం పిళ్లై

2) గజపతి రెడ్డియార్

KMPP

KMPP

3) M. Bhaktavatsalam

4) C. Lakshmana Pillai

కాంగ్రెస్

కాంగ్రెస్

పుదుక్కోట్టై బాలకృష్ణన్ TTP Natesan Ambalakkarar కాంగ్రెస్
రామనాథపురం షణ్ముగ రాజేశ్వర సేతుపతి కాంగ్రెస్ Rajamanickam సిపిఐ
రాణిపేట కదిర్ షెరీఫ్ కాంగ్రెస్ Munuswami Gounder కావీపా
రాశిపురం T. M. కలియన్నన్ కాంగ్రెస్ K. Ramaswamy స్వతంత్ర
సైదాపేట 1) T. P. ఏలుమలై

2) ఎన్. రామకృష్ణ అయ్యర్

కాంగ్రెస్

కాంగ్రెస్

3) R. Kannan

4) M. S. Gnanaprakasam

REP

KMPP

సేలం రూరల్ సి. లక్ష్మ కందన్ కాంగ్రెస్ A. Subramaniam TTP
సేలం టౌన్ వరదరాజులు నాయుడు కాంగ్రెస్ Mohan Kumaramangalam సిపిఐ
సాలియమంగళం సామియా కూరాయర్ స్వతంత్ర Krishnaswami Vanayar కాంగ్రెస్
శంకరనారాయణర్ కోవిల్ 1) రామసుందర కరుణాలయ పాండ్యన్

3) ఉర్కవలన్

స్వతంత్ర

కాంగ్రెస్

2) K. Sattanatha Karayalar

4) O. Sappani

కాంగ్రెస్

స్వతంత్ర

సాతంకులం కోసల్రామ్ స్వతంత్ర Meganathan స్వతంత్ర
సత్తూరు ఎస్. రామస్వామి నాయుడు కాంగ్రెస్ Rajarathnam స్వతంత్ర
సేదపట్టి తినకరస్వామి తేవర్ కాంగ్రెస్ Kamana Thevar స్వ.పా
షోలింగూర్ ఎం. సుబ్రమణ్య నాయకర్ కావీపా V. M. Ramaswamy Mudaliar కాంగ్రెస్
సిర్కాళి సి. ముత్యా పిళ్లై కాంగ్రెస్ K. Swamithurai Annagar సిపిఐ
శివగంగ R. V. స్వామినాథన్ కాంగ్రెస్ Velayutham Chettiar KMPP
శ్రీపెరంబుదూర్ T. షణ్ముగం స్వతంత్ర Seshachari కాంగ్రెస్
శ్రీరంగం చిత్రబలం సిపిఐ Srinivasan కాంగ్రెస్
శ్రీవిల్లిపుత్తూరు 1) డి.కె.రాజా

3) ఎ. వైకుంటం

స్వతంత్ర

కాంగ్రెస్

2) P. S. Kumaraswami Raja

4) K. Arumugha Perumal

కాంగ్రెస్

స్వతంత్ర

తలవసల్ ఎ. సాంబశివం కాంగ్రెస్ M. Gopala Chetty స్వతంత్ర
తెన్కాసి సుబ్రమణ్యం పిళ్లై కాంగ్రెస్ Sevagupandia Thevar స్వతంత్ర
తంజావూరు 1) ఎం. మరిముత్తు

2) ఎస్. రామలింగం

కాంగ్రెస్

సిపిఐ

3) R. Swaminatha Mercondar

4) R. Shanmugan

కాంగ్రెస్

స్వతంత్ర

తిరుమంగళం కె. రాజారాం కాంగ్రెస్ T. Manickavasakam KMPP
తొండముత్తూరు పళనిస్వామి గౌండర్ కాంగ్రెస్ Perumal స్వ.పా
వేయి దీపాలు 1) వెంకటస్వామి నాయుడు

2) శివషణ్ముగం పిళ్లై

కాంగ్రెస్

స్వతంత్ర

3) Indirani Balasubramaniam

4) Marthandam Pillai

JUస్వ.పా

స్వ.పా

తురైయూర్ పి. రంగస్వామి రెడ్డియార్ స్వతంత్ర A. V. Rangaswami కాంగ్రెస్
తిండివనం 1) ఎం. జగన్నాథన్

2) వేణుగోపాల గౌండర్

TTP

TTP

3) Balasundaram

4) Venkatakrishna Reddiar

కాంగ్రెస్

కాంగ్రెస్

తిరుచెందూర్ 1) ఆదిత్య

2) వి. ఆరుముగం

KMPP

కాంగ్రెస్

3) Subramanya Adithan

4) Pitchu

కాంగ్రెస్

స్వ.పా

తిరుచెంగోడ్ 1) ఎస్. ఆరుముగం

) T. S. అర్థనారి

స్వతంత్ర

సిపిఐ

3) Radhabai Subbarayan

4) V. K. Ramaswamy

కాంగ్రెస్

కాంగ్రెస్

తిరుచిరాపల్లి (ఉత్తరం) ఎం. కల్యాణసుందరం సిపిఐ G. Ramaswami కాంగ్రెస్
తిరుచిరాపల్లి (దక్షిణం) రామసామి కాంగ్రెస్ Vaiyapuri Sholayar స్వతంత్ర
తిరుక్కోయిలూర్ 1)టి.డి.ముత్తుకుమారస్వామి నాయుడు

2) ఎ. ముత్తుస్వామి

TTP

TTP

3) Kulasekara Dass

4) M. Rajagopal

కాంగ్రెస్

కాంగ్రెస్

తిరుమయం 1) పళనియప్పన్

3) చిన్నయ్య

కాంగ్రెస్

TTP

2) Avudayappan Ambalakkarar

4) Sambasiva Moopan

KMPP

కాంగ్రెస్

తిరునెల్వేలి 1) అరుముగన్

2) ఎస్.ఎన్. సోమయాజులు

కాంగ్రెస్

కాంగ్రెస్

3) P. S. Subramania Pillai

4) Shanmugam

స్వతంత్ర

సిపిఐ

తిరుప్పూర్ ఆరుముగం

రంగస్వామి నాయుడు

కాంగ్రెస్ Mathivanam

Ramaswami

సిపిఐ
తిరుపత్తూరు (41) ఇ.ఎల్.రాఘవ ముదలి స్వతంత్ర R. C. Samanna Gounder కాంగ్రెస్
తిరుప్పత్తూరు 194 ముత్తయ్య చెట్టియార్ స్వతంత్ర Veerabhadran సిపిఐ
తిరుప్పురూర్ M. R. రామచంద్రన్ కాంగ్రెస్ S. Murugesa Mudaliar REP
తిరువాడనై చెల్లదురై స్వతంత్ర Arumugam Servai కాంగ్రెస్
తిరువళ్లూరు 1) ఎం. ధర్మలింగం

2) వి.గోవిందస్వామి నాయుడు

KMPP

KMPP

3) N. Eagambara Mudaliar

4) V. S. Arunachalam

కాంగ్రెస్

కాంగ్రెస్

తిరువణ్ణామలై 1) రామచంద్రారెడ్డి

2) తంగవేలు

కాంగ్రెస్

కాంగ్రెస్

3) Vadivelu Gounder

4) T. V. Devaraja Mudaliar

కావీపా

స్వతంత్ర

ట్రిప్లికేన్ ఎ. ఎం. సంబందం కాంగ్రెస్ M. S. Abdul Majeed స్వతంత్ర
ట్యూటికోరిన్ J. L. P. రోచె విక్టోరియా కాంగ్రెస్ K. V. P. Swamy స్వతంత్ర
ఉద్దనపల్లి P. N. మునుస్వామి కాంగ్రెస్ A. N. Nallappa Reddy KMPP
ఉడుమల్‌పేట మౌనగురుస్వామి నాయుడు కాంగ్రెస్ Thangavelu సిపిఐ
ఉలుందూరుపేట ఎం. కందస్వామి పడయాచి కాంగ్రెస్ Natesa Gounder TTP
ఉత్తమపాలయం A. S. సుబ్బరాజ్ కాంగ్రెస్ Muthaiah స్వ.పా
ఉతిరమేరూరు V. K. రామస్వామి ముదలియార్ కాంగ్రెస్ Duraisami Naicker KMPP
ఉత్తుకుళి పళనిస్వామి స్వతంత్ర Kandasami Gounder కాంగ్రెస్
వడమదురై చిన్నస్వామి నాయుడు కాంగ్రెస్ Srinivasan స్వ.పా
వలప్పడి పి. కందసామి గౌండర్ స్వతంత్ర B. A. Rajarathnam కాంగ్రెస్
వందవాసి 1) సోమసుందర గౌండర్

2) దశరత్నం

కావీపా

SCF

3) Ramanuja Reddiar

4) Velayuthapani

కాంగ్రెస్

కాంగ్రెస్

వాణియంబాడి ఎ. కె. హనుమంతరాయ గౌండర్ స్వతంత్ర M. Erusan కావీపా
వేదసందూర్ వి.మదనగోపాల్ సిపిఐ M. R. Krishnaswamy Reddiar కాంగ్రెస్
వెల్లూరు 1) ఎ. కె. మాసిలామణి చెట్టియార్

3) హెచ్.ఎం.జగ్నానాథన్

కాంగ్రెస్

కాంగ్రెస్

2) R. Radhakrishnan

4) K. R. Sundaram

కావీపా

సిపిఐ

విక్రవాండి గోవిందస్వామి నాయకర్ TTP Bashyam Reddiar కాంగ్రెస్
విలాతికులం పి. సెల్వరాజ్ కాంగ్రెస్ Sankaralingam స్వతంత్ర
విల్లుపురం నాగరాజన్ TTP S. D. Chinnas కాంగ్రెస్
విరుదునగర్ V. V. రామస్వామి స్వతంత్ర Sankarapandia Nadar కాంగ్రెస్
వృదాచలం 1) పరమశివం

3) కతిముత్తు

TTP

TTP

2) Narayanaswamy Pillai

4) Vedamanickam

కాంగ్రెస్

కాంగ్రెస్

వాషర్‌మాన్‌పేట జీవానందం సిపిఐ Radhakrishnan Pillai కాంగ్రెస్

ఆంధ్ర

నియోజకవర్గం విజేత పార్టీ రెండవ స్థానం పార్టీ
సాలూరు కూనిశెట్టి వెంకటనారాయణ దొర కెఎల్‌పి ఆలూరు యెరుకునాయుడు కాంగ్రెస్
చీపురుపల్లి తాడి చిన్న అచ్చనాయుడు స్వతంత్ర మోడండీ సత్యనారాయణ రాజు స్వతంత్ర
బొబ్బిలి కొల్లి వెంకట కూర్మినాయుడు స్వ.పా కొత్తగిరి సీతారామస్వామి కాంగ్రెస్
పార్వతీపురం వైరిచెర్ల దుర్గాప్రసాద్ వీరభద్ర దేవ్ బహదూర్ కాంగ్రెస్ చీకటి పరశురాం నాయుడు కెఎల్‌పి
శ్రీకాకుళం కిల్లి అప్పలనాయుడు కెఎల్‌పి కె.నర్సయ్య కాంగ్రెస్
కావలి నారాయణ కెఎల్‌పి టి.పాపారావు కాంగ్రెస్
హొంజరం పీసపాటి పుండరీకాక్షాచార్యులు కెఎల్‌పి చెలికాని శ్రీరంగనాయకులు స్వతంత్ర
పాలకొండ పాలవాస సంగం నాయుడు కాంగ్రెస్ మూసల రాజరత్నం నాయుడు కెఎల్‌పి
నరసన్నపేట హెచ్.సత్యనారాయణ దొర కాంగ్రెస్ కసిర బసవ రాజు కెఎమ్‌పిపి
పాతపట్నం లుకలాపు లక్ష్మణదాసు కాంగ్రెస్ దారపు గోవిందరాజులు సిపిఐ
టెక్కలి రొక్కం లక్ష్మీ నరసింహం దొర స్వతంత్ర బండి కూర్మన్న కాంగ్రెస్
సోంపేట గౌతు లచ్చన్న కెఎల్‌పి పొత్తూరు స్వామి బాబు కాంగ్రెస్
ఇచ్చాపురం నీలాద్రి రావు రెడ్డి కెఎల్‌పి హరిహర పట్నాయక్ స్వతంత్ర
విజయనగరం పూసపాటి విజయరామ గజపతి రాజు స్వ.పా గంట్లన సూర్యనారాయణ స్వ.పా
భీమునిపట్నం కలిగొట్ల సూర్యనారాయణ స్వతంత్ర J. V. K. వల్లభ రావు సిపిఐ
ఆలమండ కె.వి.పద్మనాభ రాజు స్వ.పా జి బి అప్పారావు కాంగ్రెస్
శృంగవరపుకోట చాగంటి వెంకట సోమయాజులు స్వ.పా టి.వెంకటరమణయ్య కాంగ్రెస్
చోడవరం కందర్ప వెంకటరమేశం కెఎల్‌పి భూపతిరాజు సత్యనారాయణ రాజు కాంగ్రెస్
మాడుగుల భోజింకి గంగయ్య నాయుడు కెఎల్‌పి ఇలపకుర్తి సత్యనారాయణ కాంగ్రెస్
విశాఖపట్నం తెన్నేటి విశ్వనాథం కెఎమ్‌పిపి ఎస్ అప్పల నాయుడు స్వతంత్ర
పరవాడ ముళ్లపూడి వీరభద్రం సిపిఐ గొట్టిముక్కల జగన్నాథ రాజు స్వతంత్ర
అనకాపల్లి కొడుగంటి గోవిందరావు సిపిఐ విల్లూరి వెంకటరమణ కెఎల్‌పి
యలమంచిలి పప్పల బాపునాయుడు కెఎల్‌పి మిస్సుల సూర్యనారాయణ మూర్తి కాంగ్రెస్
పాయకరావుపేట రాజా సాగి సూర్యనారాయణ రాజు స్వతంత్ర సుంకరి అప్పల నాయుడు కాంగ్రెస్
గొలుగొండ 1) కిల్లాడ రామమూర్తి

2) కంకిపట్టి వీరన పడాల్

కెఎల్‌పి

కెఎల్‌పి
పూతల లతధ పాత్రుడు కాంగ్రెస్
భద్రాచలం 1) కారం బాపన్న దొర

2) వై.వెంకట కృష్ణారావు

కెఎమ్‌పిపి

కెఎమ్‌పిపి
1) వార్సవి వెంకట తిరుపతి రాజు

2) శివసం బొజ్జి దొర

తుని రాజా వత్సవాయి వెంకట కృష్ణంరాజు బహదూర్ కాంగ్రెస్ యెనుముల వెంకన్న దొర కెఎమ్‌పిపి
పిఠాపురం ఆర్.వి.జగ్గారావు సిపిఐ ఆర్. అచ్చయ్య రావు కాంగ్రెస్
పెద్దాపురం తోట రామస్వామి కాంగ్రెస్ దూర్వాసుల వెంకట సుబ్బారావు స్వతంత్ర
బూరుగుపూడి ఎన్.వెంకటరామారావు కెఎల్‌పి మరీనా నరసన్న కాంగ్రెస్
రాజమండ్రి చిట్టూరి ప్రభాకర చౌదరి సిపిఐ కె.ఎల్.నరసింహారావు కాంగ్రెస్
కాకినాడ చిత్తజల్లు వెంకట కృష్ణారావు సిపిఐ కంతేటి మోహనరావు సిపిఐ
రామచంద్రపురం కాకర్లపూడి రాజగోపాలనరసరాజు కెఎమ్‌పిపి మల్లిపూడి పల్లంరాజు కాంగ్రెస్
అనపర్తి పడాల సత్యనారాయణ రెడ్డి కాంగ్రెస్ పి.వెంకటరావు సిపిఐ
పామర్రు యస్.బి.పి. పట్టాభిరామారావు కాంగ్రెస్ పి.పనశరామన్న సిపిఐ
అమలాపురం నడింపల్లి రామభద్రరాజు కెఎమ్‌పిపి బొజ్జా అప్పలస్వామి SCF
రాజోలు అల్లూరి వెంకటరామరాజు, గంజి నాగేశ్వరరావు సిపిఐ ఆకుల బులిస్వామి కెఎమ్‌పిపి
చింతలపూడి మోటపర్తి కూనేరావు సిపిఐ కమదన వెంకటరామ సూర్య ప్రకాశరావు కాంగ్రెస్
ఏలూరు గారపాటి సత్యనారాయణ సిపిఐ ముల్పూరి రంగయ్య కాంగ్రెస్
తాడేపల్లిగూడెం సి.ఎస్.వరపరసదమూర్తిరాజు కాంగ్రెస్ కిళంబి వేంకట కృష్ణావతారం కెఎమ్‌పిపి
అలంపురం పసల సూర్యచంద్రరావు కెఎమ్‌పిపి తుమ్మలపల్లి సత్యనారాయణమూర్తి కాంగ్రెస్
ఉండి దంతులూరి నారాయణరాజు కాంగ్రెస్ గొట్టుముక్కల వెంకట రాజు సిపిఐ
భీమవరం భూపతిరాజు సుబ్బరాజు కెఎమ్‌పిపి నిమ్మల సంగయ్య నాయుడు కాంగ్రెస్
నర్సాపూర్ పడేలా శ్యామసుందరరావు సిపిఐ భూపతిరాజు లక్ష్మీనరసరాజు సిపిఐ
తణుకు చిత్తూరు ఇంద్రయ్య కెఎమ్‌పిపి చిట్టూరి సుబ్బారావు కాంగ్రెస్
పెనుగొండ ద్వారంపూడి బసివిరెడ్డి కెఎమ్‌పిపి నడిమిపిల్లి తిరుపతిరాజు కాంగ్రెస్
కొవ్వూరు 1) పిన్నమనేని శ్రీరామచంద్రరావు సిపిఐ 2) అల్లూరి బాపినీడు కాంగ్రెస్
జగ్గయ్యపేట పిల్లలమర్రి వెంకటేశ్వర్లు సిపిఐ బండి తిమ్పతాయ కాంగ్రెస్
విజయవాడ తమ్మిన పోతరాజు సిపిఐ మారు పిల్ల చెట్టి కాంగ్రెస్
కంచికచెర్ల వాసిరెడ్డి రామారావు సిపిఐ కాకాని వెంకటరత్నం కాంగ్రెస్
తిరువూరు పేట రామారావు సిపిఐ పేట బాపయ్య కాంగ్రెస్
కంకిపాడు మైనేని లక్ష్మణస్వామి సిపిఐ ఏడుపుగంటి బాల వీరరాఘవయ్య కెఎల్‌పి
నూజివీడు రాజా మేక రంగయ్య అప్పారావు బహదూర్ కాంగ్రెస్ పి.వి.రాఘవయ్య స్వతంత్ర
గుడివాడ 1) గుంగి రామారావు

2) కాట్రగడ్డ రాజగోపాలరావు

సిపిఐ

సిపిఐ
3) ఎ. గోపాలకృష్ణయ్య

4) మంగళగిరి రామదాసు

స్వతంత్ర

కాంగ్రెస్
కైకలూరు అడుస్నమొల్లి వెంకటసుబ్రహ్మణ్యం కాంగ్రెస్ అట్లూరి పూర్ణాచలపతి రావు సిపిఐ
దివి 1) చండ్ర రామలింగయ్య

2) గుంటూరు బాపనయ్య

సిపిఐ

సిపిఐ
3) శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరాం ప్రసాద్ బహదూర్

4) గొట్టిపాటి బ్రహ్మయ్య

స్వతంత్ర

కాంగ్రెస్
బందరు జి. ఆంజనేయులు సిపిఐ ఆర్. అచ్యౌనమయ్య కాంగ్రెస్
వినుకొండ పులుపుల వెంకటశివయ్య సిపిఐ పాలడుగు నాగయ్య చౌదరి స్వతంత్ర
పల్నాడు కోలా సుబ్బారెడ్డి సిపిఐ కాసు బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్
బెల్లంకొండ మండవ బాపయ్య చౌదరి స్వతంత్ర బొజ్జా ఆదినారాయణరావు కాంగ్రెస్
నరసరావుపేట ఎన్.నల్లపాటి వెంకటరామయ్య కెఎమ్‌పిపి కాసు వెంగళ్ రెడ్డి కాంగ్రెస్
చిలకలూరిపేట కర్ణం రంగారావు సిపిఐ బాలినేని నాగయ్య కాంగ్రెస్
సత్తెనపల్లె వి.గోపాలకృష్ణయ్య స్వతంత్ర జెట్టి అంకమ్మ స్వతంత్ర
మంగళగిరి దర్శి లక్ష్మి సిపిఐ ఇమ్మిలపాటి గోవిందరావు కెఎల్‌పి
గుంటూరు నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు కెఎమ్‌పిపి యంగలసెట్రి తిరుపత్తయ్య సిపిఐ
ప్రత్తిపాడు తమ్మ కోటమ్మ రెడ్డి కాంగ్రెస్ మనగ్వ శేషయ్య సిపిఐ
దుగ్గిరాల ఎ. రామిరెడ్డి కాంగ్రెస్ కె. కోటయ్య సిపిఐ
తెనాలి ఆలపాటి వెంకటరామయ్య కాంగ్రెస్ రావి సత్యనారాయణ కెఎల్‌పి
అమృతలూరు గరికపూడి జోసెఫ్ సిపిఐ వెలువోలు సీతారామయ్య కాంగ్రెస్
రేపల్లె ఎం. హనుమంత రావు సిపిఐ కల్లూరి చంద్రమౌళి కాంగ్రెస్
బాపట్ల వేములపల్లి శ్రీకృష్ణ సిపిఐ మంతెన వెంకటరాజు కాంగ్రెస్
పొన్నూరు కొల్లా వెంకయ్య సిపిఐ కోగినం లక్ష్మీనారాయణ కెఎల్‌పి
చీరాల ప్రగడ కోటయ్య కెఎమ్‌పిపి ఉత్తుకూరి ఉపేంద్ర గుప్తా స్వతంత్ర
ఒంగోలు కసుకుర్తి మాలకొండయ్య సిపిఐ మాదాల నారాయణస్వామి సిపిఐ
గూడూరు పెల్లేటి గోపాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ కాటంరెడ్డి రాజారామిరెడ్డి స్వతంత్ర
వెంకటగిరి పడిలేటి వెంకటస్వామి రెడ్డి కాంగ్రెస్ కటికాని కళ్యాణ్ రావు కెఎల్‌పి
రాపూర్ దండమూడి దశరథరామయ్య నాయుడు కాంగ్రెస్ గంగా రమణయ్య సిపిఐ
నెల్లూరు 1) ఖండవల్లి కృష్ణారావు

2) స్వర్ణ వేమయ్య

స్వతంత్ర

స్వతంత్ర
3) ఆనం చెంచు సుబ్బారెడ్డి

4) పొన్నలూరు వీర రాఘవ రెడ్డి

కాంగ్రెస్

స్వతంత్ర
కోవూరు బసవరెడ్డి శంకరయ్య సిపిఐ బి. శేషు రెడ్డి కాంగ్రెస్
ఆత్మకూర్ గంగ చిన కొండయ్య స్వతంత్ర గంగవరపు తిరుపతి నాయుడు కాంగ్రెస్
కావలి బత్తెన రామకృష్ణారెడ్డి కెఎమ్‌పిపి రేబాల దశరథరామిరెడ్డి కాంగ్రెస్
ఉదయగిరి కోవి రామయ్య చౌదరి కెఎమ్‌పిపి బెజవాడ గోపాలరెడ్డి కాంగ్రెస్
కనిగిరి గుజ్జుల యెల్లమందారెడ్డి సిపిఐ దేవిరెడ్డి లక్ష్మీరెడ్డి కాంగ్రెస్
కందుకూరు నల్లమోతు చెంచు రామానాయుడు
కమతం షణ్ముగం
కాంగ్రెస్
కాంగ్రెస్
చుక్క కోటిలింగం
గుంటపల్లి వెంకటసుబ్బయ్య
స్వతంత్ర
స్వతంత్ర
దర్శి సానికొమ్ము కాశిరెడ్డి సిపిఐ రావిపాటి మహానంద కెఎల్‌పి
మార్కాపురం నక్కా వెంకటయ్య కెఎల్‌పి యెక్కలి రామయ్య స్వతంత్ర
కంభం పిడతల రంగారెడ్డి కాంగ్రెస్ అడపాల రామస్వామి స్వతంత్ర
నంద్యాల మల్లు సుబ్బారెడ్డి స్వతంత్ర జి. రామిరెడ్డి కాంగ్రెస్
కోయిలకుంట్ల ఎన్. వెంకటసుబ్బా రెడ్డి స్వ.పా బివి సుబ్బారెడ్డి కాంగ్రెస్
ధోన్ వెంకటశెట్టి కోట్రికే స్వతంత్ర వెంకటసుబ్బయ్య నివర్తి కాంగ్రెస్
నందికోట్కూరు సి పుల్లా రెడ్డి సిపిఐ సుబ్బా రెడ్డి కాంగ్రెస్
కర్నూలు దామోదరం సంజీవయ్య కాంగ్రెస్ ఎన్. శంకర రెడ్డి కాంగ్రెస్
రాజంపేట పంజం నరసింహా రెడ్డి సిపిఐ బండారు రత్నసభాపతి స్వ.పా
రాయచోటి వై.ఆదినారాయణరెడ్డి కెఎమ్‌పిపి గురజాల రెడ్డయ్య నాయుడు స్వ.పా
కడప కడప కోటిరెడ్డి కాంగ్రెస్ పి. శేషయ్య చెట్టి స్వతంత్ర
బద్వేలు వడ్డెమాను చిదానందం స్వతంత్ర బొమ్ము రామారెడ్డి కాంగ్రెస్
ప్రొద్దుటూరు కందుల బాలనారాయణరెడ్డి కాంగ్రెస్ పాణ్యం ఎర్రమునిరెడ్డి కెఎమ్‌పిపి
కమలాపురం నర్రెడ్డి శివరామిరెడ్డి సిపిఐ రామలింగ రెడ్డి కాంగ్రెస్
జమ్మలమడుగు కుందా రామయ్య కెఎమ్‌పిపి తాతిరెడ్డి పుల్లారెడ్డి కాంగ్రెస్
పెనుకొండ లక్ష్మీనారాయణ రెడ్డి స్వతంత్ర చిదంబర రెడ్డి కాంగ్రెస్
హిందూపురం శివశంకర రెడ్డి కాంగ్రెస్ శ్రీనివాస రెడ్డి కెఎమ్‌పిపి
మడకశిర సిద్దన్న గౌడ్ స్వతంత్ర వెంకటశివమ్మ కాంగ్రెస్
కదిరి కె.వి.వేమారెడ్డి కాంగ్రెస్ ఎనుముల పాపిరెడ్డి స్వతంత్ర
ధర్మవరం కాసెట్టి శ్రీనివాసులు కెఎమ్‌పిపి గోనుగుంట్ల వెంకటరెడ్డి కాంగ్రెస్
కళ్యాణదుర్గం నారాయణప్ప సంద కాంగ్రెస్ బి. యెనిస్వామి సిపిఐ
తాడిపత్రి చల్లా సుబ్బారాయుడు కెఎమ్‌పిపి జె.సి.నాగిరెడ్డి కాంగ్రెస్
అనంతపురం తరిమెల నాగిరెడ్డి సిపిఐ నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్
ఆదోని హెచ్ రామలింగా రెడ్డి స్వతంత్ర టి. మల్లయ్య కాంగ్రెస్
రాయదుర్గం జి. నాగభూషణం కాంగ్రెస్ ముల్లంగి చిన్న బసప్ప చౌదరి స్వతంత్ర
చట్టు టి.ఎన్.వెంకటసుబ్బారెడ్డి కాంగ్రెస్ అల్లూరు నర్సింగరావు స్వతంత్ర
మదనపల్లె దొడ్డా సీతారామయ్య సిపిఐ గుడ్రెడ్డిగారి శ్రీనివాసరెడ్డి స్వతంత్ర
పుంగనూరు బి. కృష్ణమూర్తి రావు కాంగ్రెస్ వారణాసి రఘునాథ రెడ్డి స్వతంత్ర
పీలేరు పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి కె.ఎల్‌.పి ఎన్. భాస్కర రెడ్డి కాంగ్రెస్
పలమనేరు రామబ్రహ్మం కాంగ్రెస్ సోమ రాం రెడ్డి కెఎల్‌పి
చిత్తూరు పి.చిన్నమరెడ్డి స్వతంత్ర ఎన్.పి.చెంగల్రాయ నాయుడు కాంగ్రెస్
తిరుత్తణి కిదాంబి వరదాచారి కాంగ్రెస్
ఎం. దొరై కన్ను కాంగ్రెస్
పుత్తూరు కుమారస్వామి రాజా బహదూర్ కెఎమ్‌పిపి ఆర్.బి.రామకృష్ణ రాజు కాంగ్రెస్
శ్రీకాళహస్తి అద్దూరు బలరామిరెడ్డి కాంగ్రెస్ టి.వెంకటసుబ్బారావు కృషికార్ లోక్ పార్టీ
చంద్రగిరి ఎ. ఆదికేశవులు నాయుడు కాంగ్రెస్ వి. రాజా రెడ్డి స్వతంత్ర

మైసూరు

నియోజకవర్గం విజేత పార్టీ రెండవ స్థానం పార్టీ
కూండాపూర్ మంజయ్య శెట్టి కాంగ్రెస్ శ్రీనివాస శెట్టి స్వ.పా
బ్రహ్మావర్ SS కోల్కాబైల్ కెఎమ్‌పిపి జగ్జీవన్‌దాస్ శెట్టి కాంగ్రెస్
ఉడిపి టి.అనంత పై కాంగ్రెస్ కె. రామారావు కెఎమ్‌పిపి
కర్కాల్ ఎబి శెట్టి కాంగ్రెస్ ఎం. ధర్మసమారాజయ్య కెఎమ్‌పిపి
పుత్తూరు 1) కె. వెంకటరామన్న గౌడ్
2) కె. ఈశ్వర
కాంగ్రెస్
కాంగ్రెస్
3) కె. కారంత్
4) ఎం. నాయకర్ రామన్న
కెఎమ్‌పి కెఎమ్‌పిపి
ముల్కీ ఎన్ఎన్ సువర్ణ కాంగ్రెస్ సంజీవనాథ్ స్వ.పా
మంగళూరు LC పైస్ కాంగ్రెస్ ఎ. శాంత రామ్ పాయ్ సిపిఐ
పనమంగుళూరు బివి బలిగా కాంగ్రెస్ డికెH అల్వా స్వతంత్ర
సిరుగుప్ప ఎస్. పరమేశ్వరప్ప కాంగ్రెస్ S. రంగన్న గౌడ్ స్వతంత్ర
కొల్లేగల్ ఎస్సీ విరూపాక్షయ్య కాంగ్రెస్ సిఆర్ సుబ్రమణి అయ్యర్ స్వతంత్ర
బళ్లారి ఎం. గంగప్ప స్వతంత్ర ఎ. సుమంగళమ్మ కాంగ్రెస్
హోస్పేట్ ఆర్.నాగన గౌడ కాంగ్రెస్ మహాబలేశ్వరప్ప స్వతంత్ర
కుడ్లిగి కొట్రబసవన గౌడ్ స్వతంత్ర TM పంచాక్షరయ్య కాంగ్రెస్
హర్పనహళ్లి సిరసప్ప. ఇజారి కాంగ్రెస్ KBR కొట్ర గౌడ్ స్వతంత్ర

కేరళ

1951 జనాభా లెక్కల సమయంలో మలబార్ జిల్లా ( దక్షిణ కెనరా జిల్లాలోని కాసర్‌గోడ్ ప్రాంతంతో పాటు మలబార్ జిల్లా 1956లో ట్రావెన్‌కోర్-కొచ్చిన్ రాష్ట్రంతో కలిసి కేరళను ఏర్పాటు చేసింది)
నియోజకవర్గం విజేత పార్టీ ప్రత్యర్థి పార్టీ
కాసరగోడ్ ఎం. ఎస్. మొగ్రాల్ ఐఎన్సి బి. కె. శ్రీధరన్ కెఎమ్‌పిపి
హోస్దుర్గ్ (కాన్హాంగడ్) నారాయణన్ నంబియార్ కెఎమ్‌పిపి కున్నికన్నన్ నంబియార్ ఐఎన్సి
నాటికా గోపాలకృష్ణన్ సీపీఐ రామన్ ఐఎన్సి
పొన్నాని ఎన్. గోపాల మీనన్ ఐఎన్సి కె. సి. శంకరన్ ఐఎన్సి
ఇ. టి. కున్హాన్ సీపీఐ ఎ. సి. రామన్ కెఎమ్‌పిపి
తిరూర్ కె. ఉప్పి సాహెబ్ ఐయుఎంఎల్ కె. అహ్మద్ కుట్టి ఐఎన్సి
త్రితల కె. బి. మీనన్ ఎస్పీ పి. కె. మొయిదీన్ కుట్టి ఐఎన్సి
పెరింతల్మన్న కున్హీమహమద్ షఫీ కల్లింగల్ ఐయుఎంఎల్ పి. అహ్మద్ కుట్టి సాధు సీపీఐ
మన్నార్కడ్ కె. సి. గోపాలనున్ని ఐఎన్డీ కురికల్ అహ్మద్ ఐఎన్డీ
పట్టంబి వి. శంకర నారాయణ మీనన్ కెఎమ్‌పిపి ఎ. రామచంద్ర నెడుంగాడి ఐఎన్సి
ఒట్టపాలం ఎం. నారాయణ కురుప్ కెఎమ్‌పిపి సి. పి. మాధవన్ నాయర్ ఐఎన్సి
పాలక్కాడ్ కె. రామకృష్ణన్ ఐఎన్డీ పి. వాసు మీనన్ ఐఎన్సి
అలత్తూర్ కె. కృష్ణన్ సీపీఐ వై. ఆర్. రామనాథ అయ్యర్ ఐఎన్డీ
ఓ. ఖురాన్ కెఎమ్‌పిపి ఇ. ఈచరన్ ఐఎన్సి
మలప్పురం మినియాదం చడయాన్ ఐయుఎంఎల్ కరుపాదతా ఇబ్రహీం ఐఎన్సి
మహ్మద్ హజే సీతీ ఐయుఎంఎల్ కల్లయన్ కున్హంబు ఐఎన్సి
కొట్టక్కల్ చక్కీరీ అహ్మద్ కుట్టి ఐయుఎంఎల్ కుంజున్ని నెడుంగడి, ఎజుతాసన్ కళతిల్ ఐఎన్సి
కోజికోడ్ కె. పి. కుట్టి కృష్ణన్ నాయర్ ఐఎన్సి ఇ. ఎమ్. ఎస్. నంబూదిరి పాడ్ సీపీఐ
చెవాయూర్ ఎ. అప్పు ఐఎన్సి అయ్యధన్ బాలగోపాలన్ కెఎమ్‌పిపి
వయనాడ్ మన్యంగోడ్ పద్మనాభ గౌండర్ ఎస్పీ కొళీపురత్ మాధవ మీనన్ ఐఎన్సి
చోమాడి వేలుకన్ ఎస్పీ వేలియన్ నోచారామూయల్ ఐఎన్సి
కొయిలాండీ చెమ్మరథా కున్హ్రిరామకురుప్ కెఎమ్‌పిపి అనంతపురం పటిన్హారే మేడమ్ వాసుదేవన్ నాయర్ ఐఎన్సి
పెరంబ్రా కున్హీరం కిడవ పొలోయిల్ కెఎమ్‌పిపి కలందన్కుట్టి, పుథియోట్టిల్ ఐఎన్సి
వడకర మోయిడు కెలోత్ ఎస్పీ అయాతతిల్ చట్టు ఐఎన్సి
నాదాపురం ఇ. కె. శంకర వర్మ రాజా ఐఎన్సి కె. తచరకండి సీపీఐ
తలసేరి సి. హెచ్. ఎమ్. కనారన్ సీపీఐ కె. పి. ఎమ్. రాఘవన్ నాయర్ ఐఎన్సి
కుత్తుప్పరంబ కృష్ణ అయ్యర్ ఐఎన్డీ హరింద్రనాభం, కల్లియత్ తలాతువీతిల్ ఎస్పీ
మట్టనూర్ మాధవన్ నంబియార్, కల్లోరత్ సీపీఐ సుబ్బారావు ఐఎన్సి
కన్నూర్ కరియత్ శ్రీధరన్ కెఎమ్‌పిపి పంబన్ మాధవన్ ఐఎన్సి
తళిపరంబ టి. సి. నారాయణన్ నంబియార్ సీపీఐ వి. వి. దామోదర్న్ నాయనార్ ఐఎన్సి
పయ్యన్నూరు కె. పి. గోపాలన్ సీపీఐ వివేకానంద దేవప్ప సెర్నోయ్ ఐఎన్సి

డీలిమిటేషన్, పునర్వ్యవస్థీకరణ

1953 అక్టోబరు 1న, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలతో కూడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. బళ్లారి జిల్లాలోని కన్నడ మాట్లాడే ప్రాంతాన్ని అప్పటి మైసూర్ రాష్ట్రంలో విలీనం చేసారు. దీంతో శాసనసభ బలం 231కి తగ్గింది.

1956 నవంబరు 1న, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956 ప్రకారం మద్రాసు రాష్టాన్ని పునర్వ్యవస్థీకరించారు. రాష్ట్రంలోని మలబార్ జిల్లాను కొత్త కేరళ రాష్ట్రానికి బదిలీ చేసారు. కొత్త కేంద్రపాలిత ప్రాంతం, లక్కడివ్, మినీకాయ్, అమిండివి దీవులను ఏర్పాటు చేసారు. ట్రావెన్‌కోర్-కొచ్చిన్ (ప్రస్తుత కన్యాకుమారి జిల్లా ) దక్షిణ భాగం (తమిళం మాట్లాడే ప్రాంతం), షెంకోట్టా తాలూకాలను మద్రాసు రాష్ట్రంలో విలీనం చేసారు. తరువాత 1968లో రాష్ట్రానికి తమిళనాడుగా పేరు మార్చారు. ఇది రాష్ట్రంలో 1957 అసెంబ్లీ ఎన్నికల సమయంలో శాసనసభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు దారితీసింది.[41]

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956లోని నిబంధనల ప్రకారం డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన పార్లమెంటరీ, శాసనసభ నియోజకవర్గాల కొత్త డీలిమిటేషన్ ఆర్డర్ 1956 ప్రకారం మద్రాసు శాసనసభ బలం 205కి పెరిగింది [11] 1957లో ఈ 205 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

ఇవి కూడా చూడండి

  • తమిళనాడులో ఎన్నికలు
  • ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు
  • కేరళలో ఎన్నికలు
  • తమిళనాడు శాసనసభ
  • తమిళనాడు ప్రభుత్వం

మూలాలు

  1. 1.0 1.1 I. N. Tewary (1999). Political system: a micro perspective. New Delhi: Anmol Publications PVT. LTD. p. 13.
  2. Kumar, Prasanna A. (1978). Dr. B. Pattabhi Sitaramayya: a political study. Andhra University Press. p. 96. ISBN 81-7099-619-8.
  3. Namboodiripad, E.M.S. (1994). The Communist Party in Kerala: six decades of struggle and advance. National Book Centre. p. 273.
  4. Welch, Claude Emerson (1980). Anatomy of rebellion. SUNY Press. p. 253. ISBN 0873954416.
  5. Kude, Uttam Laxmanrao (1986). Impact of Communism on the working class and peasantry: a case study of Maharashtra. Daya Books. pp. 173–177. ISBN 8170350271.
  6. Sundarayya, P (2006). Telangana People's Struggle and Its Lessons. Foundation Books. pp. 102–143. ISBN 8175963166.
  7. Foreign News: Shocking Truth, Time Magazine 10 February 1947
  8. 8.0 8.1 Gough, Kathleen (2008). Rural Society in Southeast India. Cambridge University Press. pp. 141–146. ISBN 978-0-521-04019-8.
  9. 9.0 9.1 9.2 "The Decline and Fall of Tamil Seccessionism in India Part 3 by DBS Jeyaraj, The Daily Mirror 10 October 2009". Archived from the original on 13 October 2009. Retrieved 22 November 2009.
  10. "Celebrating a half century, The Hindu 26 September 1998". Archived from the original on 29 March 2005. Retrieved 15 December 2009.{cite web}: CS1 maint: unfit URL (link)
  11. 11.0 11.1 The State Legislature – Origin and Evolution Archived 13 ఏప్రిల్ 2010 at the Wayback Machine
  12. 12.0 12.1 "A Review of the Madras Legislative Assembly (1952-1957)" (PDF). Archived from the original (PDF) on 4 September 2011.
  13. "The Representation of People Act, 1950" (PDF). Archived from the original (PDF) on 24 August 2015. Retrieved 10 November 2009.
  14. "Constituent Assembly of India Debates Vol IV, Friday 18 July 1947" (PDF). Archived from the original (PDF) on 3 July 2011. Retrieved 10 November 2009.
  15. Hasan, Zoya; Sridharan, Eswaran; Sudharshan, R (2005). India's living constitution: ideas, practices, controversies. Anthem Press. pp. 360–63. ISBN 1-84331-136-4.
  16. Robert L. Hardgrave. "The DMK and the Politics of Tamil Nationalism".
  17. Lloyd I. Rudolph. "Urban Life and Populist Radicalism: Dravidian Politics in Madras".
  18. 18.0 18.1 Baliga, B.S (2000). Madras District Gazetteers: Coimbatore. Superintendent, Govt. Press. pp. 155–6.
  19. 19.0 19.1 T. V. R. Shenoy (22 August 2001). "From Rajaji to Jayalalithaa". Rediff.
  20. Deva, Narendra (1999). Selected Works of Acharya Narendra Deva: 1948-1952. Radiant Publishers. p. 409. ISBN 81-7027-176-2.
  21. Walch, James (1976). Faction and front: party systems in South India. Young Asia Publications. p. 160.
  22. 22.0 22.1 P. Kandaswamy (2001). The political career of K. Kamraj. New Delhi: Concept publishing company. p. 50. OL 6874248M.
  23. 23.0 23.1 C. V. Gopalakrishnan (2001-05-31). "Of Governors and Chief Ministers". The Hindu. The Hindu Group. Archived from the original on 3 January 2013. Retrieved 2009-12-17.{cite web}: CS1 maint: unfit URL (link)
  24. Kaliyaperumal, M (1992). The office of the speaker in Tamilnadu : A study (PDF). Madras University. p. 91. Archived from the original (PDF) on 21 July 2011.
  25. 25.0 25.1 "A Review of the Madras Legislative Assembly (1952-1957)" (PDF). Madras-2 Legislative Assembly Department. March 1957. Archived from the original (PDF) on 3 November 2021.
  26. "A review of the Madras Legislative Assembly 1952–1957" (PDF). Archived from the original (PDF) on 4 September 2011.
  27. Economist, Eastern (1965). Eastern Economist, Annual Number. p. 1172. {cite book}: |work= ignored (help)
  28. Subramaniam, Chidambaram (1993). Hand of destiny: memoirs, Volume 1. Bharatiya Vidya Bhavan. p. 166. ISBN 9788172760496.
  29. "A Review of the Madras Legislative Assembly (1952–1957) : Section I, Chapter IV" (PDF). Tamil Nadu Legislative Assembly. Archived from the original (PDF) on 4 September 2011. Retrieved 11 February 2010.
  30. Susanne Hoeber Rudolph (15 July 1984). The Modernity of Tradition: Political Development in India. The University of Chicago Press. pp. 58. ISBN 978-0-226-73137-7.
  31. Rao, Ramesh N. (2001). Coalition conundrum: the BJP's trials, tribulations, and triumphs. Har Anand Publications. pp. 32–33. ISBN 9788124108093.
  32. "A review of the Madras Legislative Assembly (1952–1957) Section II" (PDF). Archived from the original (PDF) on 4 September 2011.
  33. Sharma, Sadhna (1995). States politics in India. Mittal Publications. p. 61. ISBN 81-7099-619-8.
  34. Rao, Vadakattu Hanumantha (1983). Party politics in Andhra Pradesh, 1956-1983. ABA Publications. p. 128.
  35. Aziz, Abdul M. (1992). Rise of Muslims in Kerala politics. CBH Publications. pp. 41, 44. ISBN 9788185381251.
  36. James Walch. Faction and front: Party systems in South India. Young Asia Publications. pp. 162–163.
  37. Vaigai Ramamurthi (2008-09-20). "A daughter remembers P. Ramamurti". The Hindu. The Hindu Group. Archived from the original on 2008-09-22. Retrieved 2009-12-17.
  38. "Council of Ministers and their Portfolios (1952–1954)" (PDF). A Review of the Madras Legislative Assembly (1952–1957). Government of Tamil Nadu. Archived from the original (PDF) on 17 October 2013.
  39. "A Review of the Madras Legislative Assembly (1952–1957) : Section I" (PDF). Tamil Nadu Legislative Assembly. Retrieved 11 February 2010.
  40. Justice Party golden jubilee souvenir, 1968. Justice Party. 1968. p. 58.
  41. "Reorganisation of States, 1955" (PDF). The Economic Weekly. 15 October 1955. Retrieved 25 July 2015.