టెన్నెస్సిన్

టెన్నెస్సిన్, 00Ts
టెన్నెస్సిన్
Pronunciation/ˈtɛnəsiːn/[1] (TEN-ə-seen)
Appearancesemimetallic (predicted)[2]
Mass number[294]
టెన్నెస్సిన్ in the periodic table
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium
At

Ts

(Usu)
లివర్‌మోరియంటెన్నెస్సిన్ఒగానెస్సాన్
Groupమూస:Infobox element/symbol-to-group/format
Periodperiod 7
Block  p-block
Electron configuration[Rn] 5f14 6d10 7s2 7p5 (predicted)[3]
Electrons per shell2, 8, 18, 32, 32, 18, 7 (predicted)
Physical properties
Phase at STPsolid (predicted)[3][4]
Melting point623–823 K ​(350–550 °C, ​662–1022 °F) (predicted)[3]
Boiling point883 K ​(610 °C, ​1130 °F) (predicted)[3]
Density (near r.t.)7.1–7.3 g/cm3 (extrapolated)[4]
Atomic properties
Oxidation states(−1), (+1), (+3), (+5) (predicted)[2][3]
Ionization energies
  • 1st: 742.9 kJ/mol (predicted)[5]
  • 2nd: 1435.4 kJ/mol (predicted)[5]
  • 3rd: 2161.9 kJ/mol (predicted)[5]
  • (more)
Atomic radiusempirical: 138 pm (predicted)[4]
Covalent radius156–157 pm (extrapolated)[4]
Other properties
Natural occurrencesynthetic
CAS Number54101-14-3
History
Namingafter Tennessee region
DiscoveryJoint Institute for Nuclear Research, Lawrence Livermore National Laboratory, Vanderbilt University and Oak Ridge National Laboratory (2009)
Isotopes of టెన్నెస్సిన్
Template:infobox టెన్నెస్సిన్ isotopes does not exist
 Category: టెన్నెస్సిన్
| references

టెన్నెసీన్ (Ts) పరమాణు సంఖ్య 117 కలిగిన సింథటిక్ రసాయన మూలకం. ఇది రెండవ అత్యంత భారీ మూలకం, ఆవర్తన పట్టికలో 7వ పీరియడ్ లోని చివరి మూలకం .

2010 ఏప్రిల్‌లో రష్యన్-అమెరికన్ సహకారంతో రష్యాలోని డబ్నాలో టెన్నెస్సిన్ ఆవిష్కరణను అధికారికంగా ప్రకటించారు. ఇది 2022 నాటికి అత్యంత తాజాగా కనుగొన్న మూలకం. దాని ఉత్పన్న ఐసోటోప్‌లలో ఒకదాన్ని నేరుగా 2011లో సృష్టించారు. ఇది ప్రయోగం యొక్క ఫలితాలను పాక్షికంగా నిర్ధారిస్తుంది. ఈ ప్రయోగం అదే బృందంతో 2012 లోను, ఉమ్మడి జర్మన్-అమెరికన్ బృందం 2014 మేలోనూ మళ్ళీ చేసి విజయం సాధించారు. 2015 డిసెంబరులో, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ (IUPAC), ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ (IUPAP) యొక్క జాయింట్ వర్కింగ్ పార్టీలు ఈ కొత్త మూలకాన్ని గుర్తించి దీని ఆవిష్కరణలో రష్యా అమెరికా బృందానికి ప్రాధాన్యతనిచ్చింది. ఆవిష్కర్తలు అమెరికా లోని టెన్నెస్సీ, పేరిట దీనికి టెన్నెసీన్ అనే పేరును సూచించారు. IUPAC 2016 జూన్‌లో చేసిన ఒక ప్రకటనలో ఇది తెలియజేస్తూ ఈ పేరును అధికారికంగా 2016 నవంబరులో స్వీకరించింది. [a]

నామకరణం

కొత్తగా కనుక్కునే మూలకాలకు మెండలీవ్ నామకరణ పద్ధతి ప్రకారం పేరు పెడితే ఈ మూలకం 117 కు పేరు ఏకా-ఆస్టాటిన్ అని పెట్టాలి. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ (IUPAC) 1979 సిఫార్సులను ఉపయోగించి, ఈ మూలకానికి శాశ్వత పేరును ఎంచుకునే వరకుతాత్కాలికంగా ఉనున్‌సెప్టియం (సింబల్ Uus ) అని పేరు పెట్టారు. ఈ తాత్కాలిక పేరు లాటిన్ మూలాలు "ఒకటి", "ఒకటి" "ఏడు" నుండి వచ్చింది - ఇది మూలకం యొక్క పరమాణు సంఖ్య 117 కు సూచన. [8] ఈ రంగంలోని చాలా మంది శాస్త్రవేత్తలు దీనిని "మూలకం 117" అని, చిహ్నం E117, (117), లేదా 117 అని పిలిచారు. ఆవిష్కరణ ఆమోదం సమయంలో చెల్లుబాటు అయ్యే IUPAC మార్గదర్శకాల ప్రకారం, కొత్త మూలకాల శాశ్వత పేర్లు "-ium"తో ముగిసి ఉండాలి; ఈ మూలకం హాలోజన్ అయినప్పటికీ అలాగే ఉండి ఉండాలి. సాంప్రదాయకంగా హేలోజెన్ల పేర్లకు చివర "-ine" ఉంటుంది; [9] అయితే, 2016లో ప్రచురించబడిన కొత్త సిఫార్సులలో గ్రూపు 17 లోని అన్ని కొత్త మూలకాలకూ చివర "-ine" అనే ఉండాలని నిశ్చయించారు. [10]

2010లో తొలి సంశ్లేషణ తర్వాత, LLNL కు చెందిన డాన్ షాగ్నెస్సీ, ఒగానెస్సియన్‌లు పేరు పెట్టడం ఒక సున్నితమైన వ్యవహారం అని ప్రకటిస్తూ వీలైనంత వరకు దాన్ని నివారించాం అని చెప్పారు. [11] అయితే, ఆ సంవత్సరం హామిల్టన్ ఇలా ప్రకటించాడు, "ఈ బృందాన్ని ఒకచోట చేర్చడంలోను, ఆవిష్కరణకు అవసరమైన 249Bk లక్ష్యాన్ని సాధించడం లోనూ నేను కీలకమైన వ్యక్తిని. అంచేత నేనే ఈ మూలకానికి పేరు పెట్టబోతున్నాను. నేను ఇప్పుడు పేరు చెప్పలేను గానీ, అది ఈ ప్రాంతానికి ప్రత్యేకతను తెస్తుంది." [12] (హామిల్టన్, అమెరికా లోని టెన్నెస్సీ రాష్ట్రం నాష్‌విల్లే లోని వాండర్‌బిల్ట్ విశ్వవిద్యాలయంలో ఆచార్య్డుడు). 2015 ఇంటర్వ్యూలో, ఒగానెస్సియన్, ప్రయోగం యొక్క కథను చెప్పిన తర్వాత, "అమెరికన్లు దీనిని టూర్ డి ఫోర్స్‌గా పేర్కొన్నారు, తాము దీన్ని లోపాలేంఈ లేకుండా చేయగలమని వారు ప్రదర్శించారు. సరే, త్వరలో వారు 117వ మూలకానికి పేరూ పెట్టనున్నారు."

2016 మార్చిలో డిస్కవరీ బృందం, వివిధ పార్టీల ప్రతినిధులతో కూడిన కాన్ఫరెన్స్ కాల్‌లో ఈ మూలకానికి "టెన్నెస్సిన్" అనే పేరు పెట్టడానికి అంగీకరించింది. [13] జూన్ 2016లో, IUPAC 115, 117, 118 అనే కొత్త మూలకాలకు పేర్లు పెట్టడం కోసం కనుగొన్న వారి సూచనలు తమకు అందినట్లు ప్రకటించింది. అందులో 117 కు "టేనస్సీ ప్రాంతం" పేరిట Ts చిహ్నంతో టెన్నెస్సిన్ అని వచ్చింది. [14] నవంబర్ 2016లో, టెన్నెస్సిన్‌తో సహా ఆ పేర్లను అధికారికంగా ఆమోదించారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉపయోగించిన టోసిల్ సమూహానికి సంబంధించిన సంజ్ఞామానంతో ప్రతిపాదిత చిహ్నం Ts ఘర్షణ పడుతుందనే వాదనలను తిరస్కరించారు. ఇప్పటికే అలాంటి ద్వంద్వ అర్థాలున్న చిహ్నాలున్నాయని చెప్పారు: Ac (యాక్టినియం, ఎసిటైల్ ), Pr ( ప్రాసెయోడైమియం, ప్రొపైల్ ). [15] మాస్కోవియం, టెన్నెస్సిన్, ఒగానెసన్‌లకు నామకరణ కార్యక్రమం 2017 మార్చి 2 న మాస్కోలోని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో జరిగింది; టెన్నెస్సిన్ కోసం విడిగా 2017 జనవరి లో ORNLలో మరొక ప్రత్యేక వేడుక జరిగింది. [16]

ఊహించిన లక్షణాలు

అణు లక్షణాలు కాకుండా, టెన్నెస్సిన్ లేదా దాని సమ్మేళనాల లక్షణాలు వేటినీ ఇంకా కొలవలేదు; ఇది చాలా పరిమితమైన, ఖరీదైన ఉత్పత్తి కావడం, ఇది చాలా త్వరగా క్షయం చెందుతుంది కాబటి. టెన్నెస్సిన్ లక్షణాల అంచనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

పరమాణు, భౌతిక లక్షణాలు

టెన్నెస్సిన్ ఆవర్తన పట్టికలో సమూహం 17లో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్ అనే ఐదు హాలోజన్‌ల క్రింద ఉంటుందని భావిస్తున్నారు; వీటిలో ప్రతి ఒక్కటి ns2np5 ఆకృతీకరణతో ఏడు వేలెన్స్ ఎలక్ట్రాన్‌లను కలిగి ఉంటాయి. [b] టెన్నెస్సిన్, ఆవర్తన పట్టికలో ఏడవ పీరియడ్‌లో ఉండటం వలన, ఆ ట్రెండ్‌ కొనసాగితే 7s27p5, యొక్క వాలెన్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్‌ను ఉంటుందని అంచనా వేయవచ్చు. ఈ ఎలక్ట్రానిక్ స్థితికి సంబంధించిన అనేక అంశాలలో హాలోజన్‌ల మాదిరిగానే ప్రవర్తిస్తుందని కూడా అంచనా వేయవచ్చు. అయితే, గ్రూప్ 17 లో కిందికి వెళ్ళేకొద్దీ, మూలకాల లోహత్వం పెరుగుతుంది; ఉదాహరణకు, అయోడిన్ ఇప్పటికే ఘన స్థితిలో లోహ మెరుపును ప్రదర్శిస్తుంది, అస్టాటైన్ లక్షణాలు పైనున్న నాలుగు హాలోజన్‌ల కంటే చాలా భిన్నంగా ఉండటం వల్ల దాన్ని అర్ధలోహంగా (మెటాలాయిడ్‌) [గమనికలు 1] వర్గీకరిస్తారు. అలాగే, ఆవర్తన ధోరణులపై ఆధారపడిన ఎక్స్‌ట్రాపోలేషన్‌ను బట్టి టెన్నెస్సైన్‌ను అస్థిరమైన పోస్ట్-ట్రాన్సిషన్ లోహంగా అంచనా వేయవచ్చు. [17]

రసాయన ధర్మాలు

 293Ts, 294Ts అనే టెన్నెస్సిన్ ఐసోటోప్‌లు రసాయన ప్రయోగాలు చెయ్యలేనంత స్వల్పకాలికమైనవి. అయినప్పటికీ, టెన్నెస్సిన్ యొక్క అనేక రసాయన లక్షణాలను లెక్కించారు. గ్రూపు 17 లోని తేలికైన మూలకాల వలె కాకుండా, టెన్నెస్సిన్ హాలోజన్‌లకు సాధారణమైన రసాయన ప్రవర్తనను ప్రదర్శించకపోవచ్చు. [18] ఉదాహరణకు, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ లు నోబుల్ గ్యాస్ యొక్క మరింత స్థిరమైన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్‌ను సాధించడానికి ఒక ఎలక్ట్రాన్‌ను సాధారణంగా స్వీకరించి, వాటి వాలెన్స్ షెల్‌లలో ఏడుకి బదులుగా ఎనిమిది ఎలక్ట్రాన్‌లను ( ఆక్టెట్ ) పొందుతాయి. [19] గ్రూపులో మూలకాల అణు బరువు పెరిగే కొద్దీ ఈ సామర్థ్యం బలహీనపడుతుంది; ఎలక్ట్రాన్‌ను తీసుకోడానికి టెన్నెస్సిన్, గ్రూపు 17 లో అత్యంత విముఖంగా ఉంటుంది. అంచనా వేసిన ఆక్సీకరణ స్థితులలో, −1 అతి తక్కువ సాధారణమైనదిగా అంచనా వేసారు.

గమనికలు

  1. లోహాలు, అలోహాల లక్షణాలకు మధ్య ఉండే, లేదా ఆ రెండింటి లక్షణాలను కలిగి ఉండే మూలకం. దీనికి ప్రామాణికమైన నిర్వచనం అంటూ లేదు. ఏ మూలకాలు అర్ధ లోహాలు అనే విషయమై పూర్తి సమ్మతి, స్పష్టత కూడా లేదు. స్పష్టత లేనప్పటికీ, ఈ పదం రసాయన శాస్త్రంలో వాడుకలో ఉంది.

మూలాలు

  1. Ritter, Malcolm (June 9, 2016). "Periodic table elements named for Moscow, Japan, Tennessee". Associated Press. Retrieved December 19, 2017.
  2. 2.0 2.1 Fricke, Burkhard (1975). "Superheavy elements: a prediction of their chemical and physical properties". Recent Impact of Physics on Inorganic Chemistry. Structure and Bonding. 21: 89–144. doi:10.1007/BFb0116498. ISBN 978-3-540-07109-9. Retrieved 4 October 2013.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 Hoffman, Darleane C.; Lee, Diana M.; Pershina, Valeria (2006). "Transactinides and the future elements". In Morss; Edelstein, Norman M.; Fuger, Jean (eds.). The Chemistry of the Actinide and Transactinide Elements (3rd ed.). Dordrecht, The Netherlands: Springer Science+Business Media. ISBN 978-1-4020-3555-5.
  4. 4.0 4.1 4.2 4.3 Bonchev, D.; Kamenska, V. (1981). "Predicting the Properties of the 113–120 Transactinide Elements". Journal of Physical Chemistry. 85 (9): 1177–1186. doi:10.1021/j150609a021.
  5. 5.0 5.1 5.2 Chang, Zhiwei; Li, Jiguang; Dong, Chenzhong (2010). "Ionization Potentials, Electron Affinities, Resonance Excitation Energies, Oscillator Strengths, And Ionic Radii of Element Uus (Z = 117) and Astatine". J. Phys. Chem. A. 2010 (114): 13388–94. Bibcode:2010JPCA..11413388C. doi:10.1021/jp107411s.
  6. Khuyagbaatar, J.; Yakushev, A.; Düllmann, Ch. E.; et al. (2014). "48Ca+249Bk Fusion Reaction Leading to Element Z=117: Long-Lived α-Decaying 270Db and Discovery of 266Lr". Physical Review Letters. 112 (17): 172501. Bibcode:2014PhRvL.112q2501K. doi:10.1103/PhysRevLett.112.172501. PMID 24836239.
  7. Oganessian, Yu. Ts.; et al. (2013). "Experimental studies of the 249Bk + 48Ca reaction including decay properties and excitation function for isotopes of element 117, and discovery of the new isotope 277Mt". Physical Review C. 87 (5): 054621. Bibcode:2013PhRvC..87e4621O. doi:10.1103/PhysRevC.87.054621.
  8. Chatt, J. (1979). "Recommendations for the naming of elements of atomic numbers greater than 100".
  9. Koppenol, W.H.. "Naming of new elements".
  10. Koppenol, Willem H.. "How to name new chemical elements".
  11. Glanz, J. "Scientists discover heavy new element" (Press release). Oregon State University. Archived from the original on 2017-04-18. Retrieved 2016-01-05.
  12. "Heaviest in the world". Arts and Science Magazine. Vanderbilt University. November 2011. Archived from the original on 2016-05-03. Retrieved 2016-06-12.
  13. "What it takes to make a new element". Chemistry World. Retrieved 2016-12-03.
  14. "IUPAC Is Naming The Four New Elements Nihonium, Moscovium, Tennessine, and Oganesson" (Press release). IUPAC. 2016-06-08. Retrieved 2016-06-08.
  15. "IUPAC Announces the Names of the Elements 113, 115, 117, and 118 - IUPAC | International Union of Pure and Applied Chemistry". IUPAC | International Union of Pure and Applied Chemistry (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-11-30. Retrieved 2016-11-30.
  16. Fedorova, Vera (3 March 2017). "At the inauguration ceremony of the new elements of the periodic table of D.I. Mendeleev". jinr.ru. Joint Institute for Nuclear Research. Retrieved 4 February 2018.
  17. GSI (14 December 2015). "Research Program – Highlights". superheavies.de. GSI. Archived from the original on 13 మే 2020. Retrieved 9 November 2016. If this trend were followed, element 117 would likely be a rather volatile metal. Fully relativistic calculations agree with this expectation, however, they are in need of experimental confirmation.
  18. "Superheavy Element 117 Confirmed - On the Way to the "Island of Stability"". GSI Helmholtz Centre for Heavy Ion Research. Archived from the original on 2018-08-03. Retrieved 2015-07-26.
  19. Bader, R. F. W. "An introduction to the electronic structure of atoms and molecules". McMaster University. Archived from the original on 2007-10-12. Retrieved 2008-01-18.

మూలాల మునుజూపు

  1. The declaration by the IUPAC mentioned "the contribution of the Tennessee region (emphasis added), including Oak Ridge National Laboratory, Vanderbilt University, and the University of Tennessee at Knoxville, Tennessee, to superheavy element research, including the production and chemical separation of unique actinide target materials for superheavy element synthesis at ORNL’s High Flux Isotope Reactor (HFIR) and Radiochemical Engineering Development Center (REDC)".
  2. The letter n stands for the number of the period (horizontal row in the periodic table) the element belongs to. The letters "s" and "p" denote the s and p atomic orbitals, and the subsequent superscript numbers denote the numbers of electrons in each. Hence the notation ns2np5 means that the valence shells of lighter group 17 elements are composed of two s electrons and five p electrons, all located in the outermost electron energy level.