అశోక్‌నగర్, హైదరాబాదు
అశోక్‌నగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°24′25″N 78°29′19″E / 17.407036°N 78.488691°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 020 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
అశోక్‌నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న ప్రాంతం.[1] ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుకునే విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లు ఇక్కడ ఉన్నాయి.
సమీపంలోని ప్రాంతాలు
పి & టి కాలనీ, రాజా మనోహర్ కాలనీ, అశోక్ నగర్ ఎక్స్‌టెన్షన్, వివేక్ నగర్, హిమాయత్‌నగర్, దోమలగుడ, ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ ఎక్స్ రోడ్డు మొదలైన ప్రాంతాలు అశోక్ నగర్‌కు సమీపంలో ఉన్నాయి.[2]
వాణిజ్య ప్రాంతం
ఇక్కడ అనేక షాపింగ్ మాల్స్ ఉన్నాయి. యుపిఎస్‌సి, టిఎస్‌పిఎస్‌సి, ఎస్‌ఎస్‌సి, ఇతర ప్రభుత్వ పరీక్షలకు ప్రతి సంవత్సరం సుమారు 25000 - 30000 మంది విద్యార్థులు ఈ ప్రాంతంలో శిక్షణ పొందుతారు.
రవాణా
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో అశోక్‌నగర్ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] ఇక్కడికి సమీపంలోని విద్యానగర్లో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను ఉంది.
సినిమా థియేటర్లు
ఇక్కడ సుదర్శన్, దేవి, శ్రీ మయూరి థియేటర్లు ఉన్నాయి.[4]
మూలాలు
- ↑ Ashok Nagar Location
- ↑ "Ashok Nagar , Hyderabad". www.onefivenine.com. Retrieved 2021-01-23.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-23.
- ↑ "Cineam Theaters in Hyderabad". www.onefivenine.com. Retrieved 2021-01-23.