సిక్కు గ్రామం

సిక్కు గ్రామం
సమీపప్రాంతం
తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం
తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం
Nickname: 
సిక్కుల్ తోట
సిక్కు గ్రామం is located in Telangana
సిక్కు గ్రామం
సిక్కు గ్రామం
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
Coordinates: 17°27′42″N 78°29′14″E / 17.461654°N 78.487186°E / 17.461654; 78.487186
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyకంటోన్మెంట్ బోర్డు, సికింద్రాబాదు
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 009
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంకంటోన్మెంట్
పట్టణ ప్రణాళిక సంస్థకంటోన్మెంట్ బోర్డు, సికింద్రాబాదు

సిక్కు గ్రామం (సిక్కుల్ తోట), తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇది సికింద్రాబాదుకు శివారు ప్రాంతంగా ఉంది.[1] ఈ ప్రాంతం పారడైజ్ సర్కిల్ నుండి 3 కి.మీ.ల (1.9 మైళ్ళ) దూరంలో, బోయిన్‌పల్లి నుండి 2 కి.మీ.ల (1.2 మైళ్ళ) దూరంలో ఉంది.[2]

చరిత్ర

నిజాం రాజు దళాలలోని సిక్కు వర్గానికి చెందిన కొంతమంది ఒక శతాబ్దం క్రితం ఇక్కడ స్థిరపడటం వలన దీనికి సిక్కు గ్రామం అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో ఇంపీరియల్ గార్డెన్స్, జ్యువెల్ గార్డెన్స్, బాంటియా గార్డెన్స్, రాజరాజేశ్వరి గార్డెన్స్ వంటి అనేక ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. సికింద్రాబాదులోని మోండా మార్కెటును ఇక్కడికి తరలించారు. సిక్కు గ్రామంలో పండ్లు, కూరగాయలలో కూడాని పచ్చని పొలాలు ఉంటాయి. అందుకే దీనికి తోట అనే పేరు వచ్చింది.

సమీప ప్రాంతాలు

సిక్కు రోడ్, టెంపుల్ రాక్ ఎన్క్లేవ్, దేవ్ దర్శన్ కాలనీ, హన్‌మాన్‌జీ కాలనీ, ఉమానగర్ కాలనీలు మొదలైనవి ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్నాయి.[2]

విశేషాలు

ఇక్కడ తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఇదే ప్రాంతంలో భారత హాకీ ఆటగాళ్ళు ముఖేష్ కుమార్, శరణ్జీత్ సింగ్ తదితరులు నివసిస్తున్నారు. హస్మత్‌పేట్ సరస్సు దూరంగా ఉండడంవల్ల బట్టలు ఉతకడానికి బ్రిటిష్ వారు ఇచ్చిన దోబి ఘాట్‌లోనే ఈ సిక్కు గ్రామం ఉంది. ఇక్కడ మస్తానా హోటల్, గురుద్వార్, డైమండ్ పాయింట్ హోటల్ ఉన్నాయి.

రవాణా

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సిక్కు గ్రామం నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం (26, 26ఎన్, 26ఎం, 26జి, 26ఎం/వి) ఉంది. సమీపంలోని సికింద్రాబాద్ వద్ద ఎంఎంటిఎస్ రైలు స్టేషన్ ఉంది.

పాఠశాలలు

ఈ ప్రాంతంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సన్ ఫ్లవర్ స్కూల్, సర్జస్ ప్రీస్కూల్, జిజిఎస్ స్కూల్ మొదలైన పాఠశాలలు ఉన్నాయి.

మూలాలు

  1. "SCB polls: A no-show even after nine years". Archived from the original on 2012-11-05. Retrieved 2021-01-17.
  2. 2.0 2.1 "Sikh Village Locality". www.onefivenine.com. Retrieved 2021-01-17.