మీర్ ఆలం చెరువు

మీర్ ఆలం చెరువు
మీర్ ఆలం చెరువు is located in Telangana
మీర్ ఆలం చెరువు
మీర్ ఆలం చెరువు
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ
అక్షాంశ,రేఖాంశాలు17°21′N 78°26′E / 17.350°N 78.433°E / 17.350; 78.433
రకంజలాశయం
సరస్సులోకి ప్రవాహంమూసీ
వెలుపలికి ప్రవాహంమూసీ
ప్రవహించే దేశాలుభారతదేశం
ఉపరితల వైశాల్యం600 ఎకరం (240 హె.)
ద్వీపములురెండు
ప్రాంతాలుహైదరాబాదు

మీర్ ఆలం చెరువు హైదరాబాదు నగరంలో నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు అనుబంధంగా ఉన్న పెద్ద చెరువు. ఇది మూసీ నదికి దక్షిణాన ఉంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించడానికి ముందు ఇది హైదరాబాదు నగరానికి ప్రధానమైన నీటి వనరుగా ఉండేది. దీనికి సమీపంలో మీర్ ఆలం మండి మార్కెట్ ఉంది.

చరిత్ర

మీర్ ఆలం చెరువు హైదరాబాదును పరిపాలించిన 3వ నిజాం సికిందర్ జా వద్ద 1804 నుండి 1808 వరకు దివానుగా పనిచేసిన మీర్ ఆలం బహదూర్ పేరు మీద నిర్మించారు. మీర్ ఆలం 1804 జూలై 20 న ఈ చెరువు నిర్మాణానికి శంకుస్థాపన చేసాడు. రెండేళ్ళ తరువాత 1806 జూన్ 8 న దీని నిర్మాణం పూర్తైంది.

ఈ చెరువును రాజేంద్ర నగర్‌ సమీపంలో అర్థచంద్రాకారంలో నిర్మించారు. మైలార్‌దేవ్‌పల్లి, హసన్‌ నగర్‌, శంషాబాద్‌, రాజేంద్రనగర్‌ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు ఈ చెరువు లోకి చేరుతుంది.[1]

సౌకర్యాలు

ఈ చెరువును ఆనుకుని నెహ్రూ జూలాజికల్‌ పార్కును నెలకొల్పారు. 1959లో మీరాలం ట్యాంక్‌ వద్ద జూ గార్డెన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతినివ్వగా 1963 అక్టోబరు 6న ఈ జూ ప్రారంభమైంది.[2] జూపర్కు లోని జంతువులకు ఈ చెరువు తాగు నీటి సౌకర్యంగా ఉంది. చెరువులో పర్యాటక సంస్థ నిర్వహించే పడవ ప్రయాణం చెయ్యాలంటే జూపార్కు నుండే ప్రవేశించాలి.

చెరువు ఒడ్డున జిహెచ్‌ఎమ్‌సి మీర్ ఆలం పార్కును నిర్మించింది. దక్కనీ శైలిలో నిర్మించిన ఈ పార్కులో గోడలపై కుతబ్ షాహీ శైలిలో 3D చిత్రాలు ఉన్నాయి. చెరువును కొంత పూడ్చి ఈ పార్కును నిర్మించారు.[3]

మ్యూజికల్‌ ఫౌంటెన్‌

మీర్‌ఆలం చెరువు వద్ద ఏర్పాటుచేసిన మ్యూజికల్‌ ఫౌంటెన్‌ను 2022 ఏప్రిల్ 9న తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాదు పార్లమెంట్‌ సభ్యులు అసదుద్దీన్‌ ఒవైసీ, బహదూర్‌పూరా ఎమ్మెల్యే మహ్మద్ మొజం ఖాన్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[4]

రవాణా సౌకర్యం

హైదరాబాదు సిటీ బస్సు సర్వీసులు నగరం లోని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి బస్సులు నడుపుతోంది.

బయటి లింకులు

మూలాలు

  1. "మీర్ ఆలా..కాలుష్యం కాసారం | హైదరాబాద్ | www.NavaTelangana.com". నవ తెలంగాణ. Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
  2. "జూలాలా.. తిరిగొచ్చెయ్యాలా!". Sakshi. 2018-10-06. Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
  3. "Mir Alam Tank Park to bask in past glory". The New Indian Express. Retrieved 2019-05-08.
  4. telugu, NT News (2022-04-19). "నగరంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన కేటీఆర్‌". Namasthe Telangana. Archived from the original on 2022-04-19. Retrieved 2022-04-19.