ఉందానగర్

ఉందానగర్
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారంగారెడ్డి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Vehicle registrationటిఎస్
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

ఉందానగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక శివారు ప్రాంతం. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాదు సమీపంలో ఉన్నా ఈ ఉందానగర్, హైదరాబాదు - బెంగుళూరు జాతీయ రహదారిపై రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.[1][2] ఇక్కడ ఉందా సాగర్ ఉంది.

విస్తీర్ణం - జనాభా

ఉందానగర్ ప్రాంతం 1.26 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ 3,386 మంది జనాభా ఉండగా, అందులో 1726 మంది పురుషులు, 1660 మంది స్త్రీలు ఉన్నారు.[3]

సమీప ప్రాంతాలు

ఇక్కడికి సమీపంలో శంషాబాదు, బొల్లారం, బుద్వేల్, మధువన్ కాలనీ, రహీంపురా, లక్ష్మీగూడ, పెద్దమంగళారం, నాగిరెడ్డిగూడ, బాకారం జాగీర్, మేడిపల్లి, ఫిరంగి నాలా మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

రవాణా

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఉందానగర్ మీదుగా ఫలక్ నుమా, అఫ్జల్‌గంజ్, సికింద్రాబాదు, నాంపల్లి మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4] ఇక్కడ ఉందానగర్ రైల్వే స్టేషను ఉంది.

మూలాలు

  1. "Why Hyderabad Metro will chug to airport along IT corridor". The New Indian Express. Retrieved 2021-02-09.
  2. "Metro in place, MMTS extension planned to Hyderabad airport dropped". The New Indian Express. Retrieved 2021-02-09.
  3. "Umdanagar Locality". geoiq.io. Retrieved 2021-02-09.{cite web}: CS1 maint: url-status (link)[permanent dead link]
  4. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-09.{cite web}: CS1 maint: url-status (link)