భారతీయ మహిళా ముఖ్యమంత్రుల జాబితా

భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మహిళా ముఖ్యమంత్రుల సంఖ్యను సూచించే పటం

ఈ జాబితాలోని 17 మందిలో 2018 నాటికి 16 మంది మహిళలు భారతదేశ వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసారు. మిగిలిన ఇద్దరు అనగా మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా 2011 మే 20 నుండి, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి మార్లెనా సింగ్ 2024 సెప్టెంబరు 21 నుండి అధికారంలో ఉన్నారు.[1] జాబితా ప్రకారం 13 రాష్ట్రాల్లో కేవలం ఒకసారే మహిళా ముఖ్యమంత్రులు ఎన్నిక అవ్వగా, ఢిల్లీతమిళనాడుఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల మహిళా ముఖ్యమంత్రులు రెండు సార్లు ఎన్నికవడం విశేషం. ఈ 17మంది మహిళా ముఖ్యమంత్రుల్లో కాంగ్రెసుకు చెందినవారు అయిదుగురు, బిజెపి ముఖ్యమంత్రులు నలుగురు, ఇద్దరు  ఏఐడిఎంకెకు, ఒకరు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వారు ఉన్నారు. భారతదేశ మొట్ట మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపలానీ 1963-67 వరకు అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుచేతా కృపలానీ నైపుణ్యం, పారదర్శక పరిపాలనను నిరూపించారు. తన పదవీ కాలంలో దిగజారిన రాష్ట్ర ఆర్థికవ్యవస్థను నియంత్రించింది. రాష్ట్ర ఉద్యోగులు వేతనాలను పెంచాలని డిమాండు చేస్తూ 62 రోజుల సమ్మె నిర్వహించారు. కృపలానీ తన నిర్ణయంలో దృఢంగా ఉండి, కార్మికులు రాజీకి సిద్ధంగా ఉన్నప్పుడు వారి అభ్యర్థనను అంగీకరించినట్లు భావిస్తున్నారు.[2] సుచేతా కృపలానీ రాజకీయ జీవితంలో ఆమె అఖిల భారత మహిళా కాంగ్రెసును స్థాపించింది. 1949లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి ప్రతినిధిగా ఉన్న ఆమె 1961లో అంతర్జాతీయ కార్మిక సంస్థకు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించింది. 1971లో సుచేతకృపలానీ రాజకీయాల నుంచి విరమించారు. ఆమె 1974లో మరణించింది. సుచేతకృపలానీ స్వతంత్ర గణతంత్రానికి అంకితమైన జీవితం గడిపింది.

మహిళా ముఖ్యమంత్రుల జాబితా

Key

  AAP (1)   AIADMK (2)   AITC (1)   BSP (1)   BJP (4)   INC (5)   JKPDP (1)   MGP (1)   RJD (1)
వ.సంఖ్య పేరు

(జననం–మరణం)

చిత్తరువు పదవీకాలం రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం రాజకీయ పార్టీ

[a]

పదవిని స్వీకరించింది పదవీకాలం ముగింపు అధికారంలో ఉన్న కాలం
1 సుచేతా కృపలానీ

(25 జూన్ 1908 – 1 డిసెంబరు 1974)

1963 అక్టోబరు 2 1967 మార్చి 13 3 సంవత్సరాలు, 162 రోజులు ఉత్తర ప్రదేశ్ భారత జాతీయ కాంగ్రెస్
2 నందిని సత్పతీ

(9 జూన్ 1931 – 4 ఆగస్టు 2006)

14 June 1972 1976 డిసెంబరు 16[RES] 4 సంవత్సరాల, 185 రోజులు ఒడిశా భారత జాతీయ కాంగ్రెస్
3 శశికళ కకొడ్కర్

(7 జనవరి 1935 – 28 అక్టోబరు 2016)

1973 ఆగస్టు 12 1979 ఏప్రిల్ 27 5 సంవత్సరాలు, 258 రోజులు గోవా మహారాష్ట్రవాదీ గోమాంతక్ పార్టీ
4 అన్వారా తైమూరు

(24 నవంబరు 1936 – 28 సెప్టెంబరు 2020)

1980 డిసెంబరు 6 1981 జూన్ 30 206 రోజులు అసోం భారత జాతీయ కాంగ్రెస్
5 వి.ఎన్.జానకి రామచంద్రన్

(30 నవంబరు 1923 – 19 మే 1996)

1988 జనవరి 7 1988 జనవరి 30 23 రోజులు తమిళనాడు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
6 జె. జయలలిత
(1948–2016)
1991 జూన్ 24 1996 మే 12 14 సంవత్సరాల, 124 రోజులు
2001 మే 14 2001 సెప్టెంబరు 21 [RES]
2002 మార్చి 2 2006 మే 12
2011 మే 16 2014 సెప్టెంబరు 27
2015 మే 23 2016 డిసెంబరు 5 [†]
7 మాయావతి
(1956–)
1995 జూన్ 13 1995 అక్టోబరు 18 7 సంవత్సరాల, 5 రోజులు ఉత్తర ప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ
1997 మార్చి 21 1997 సెప్టెంబరు 21 [RES]
2002 మే 3 2003 ఆగస్టు 29 [RES]
2007 మే 13 2012 మార్చి 15
8 రాజిందర్ కౌర్ భట్టల్

(జ:30 సెప్టెంబరు 1945)

1996 నవంబరు 21 1997 ఫిబ్రవరి 12 83 రోజులు పంజాబ్ భారత జాతీయ కాంగ్రెస్
9 రబ్రీదేవి
(1955–)
1997 జూలై 25 1999 ఫిబ్రవరి 11 7 సంవత్సరాల, 190 రోజులు బీహార్ రాష్ట్రీయ జనతా దళ్
1999 మార్చి 9 2000 మార్చి 2 [RES]
2000 మార్చి 11 2005 మార్చి 6
10 సుష్మాస్వరాజ్

(14 ఫిబ్రవరి 1953 – 6 ఆగస్టు 2019)

1998 అక్టోబరు 13 1998 డిసెంబరు 3 51 రోజులు ఢిల్లీ భారతీయ జనతా పార్టీ
11 షీలా దీక్షిత్

(31 మార్చి 1938 – 20 జూలై 2019)

1998 డిసెంబరు 4 2013 డిసెంబరు 27 15 సంవత్సరాలు, 23 రోజులు ఢిల్లీ భారత జాతీయ కాంగ్రెస్
12 ఉమాభారతి

(జ: 1959 మే 3)

2003 డిసెంబరు 8 2004 ఆగస్టు 23 259 రోజులు మధ్య ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ
13 వసుంధర రాజే
(1953–)
2003 డిసెంబరు 8 2008 డిసెంబరు 13 10 సంవత్సరాలు, 9 రోజులు రాజస్థాన్
2013 డిసెంబరు 13 2018 డిసెంబరు 17
14 మమతా బెనర్జీ

(జ:1955 జనవరి 5)

2011 మే 20 పదవిలో ఉన్నారు 13 సంవత్సరాలు, 235 రోజులు పశ్చిమ బెంగాల్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
15 ఆనందిబెన్ పటేల్

(జ:1941 నవంబరు 21)

2014 మే 22 2016 ఆగస్టు 7 2 సంవత్సరాలు, 77 రోజులు గుజరాత్ భారతీయ జనతా పార్టీ
16 మెహబూబా ముఫ్తీ

(జ:1959 మే 22)

2016 ఏప్రిల్ 4 2018 జూన్ 20 2 సంవత్సరాలు, 77 రోజులు జమ్మూ కాశ్మీరు జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ
17 అతిషి మార్లెనా సింగ్*
(జ:1981 జూన్ 8)
2024 సెప్టెంబరు 21 ప్రస్తుతం 111 రోజులు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ

గణాంకాలు

పదవీకాలం వారీగా మహిళా ముఖ్యమంత్రుల జాబితా

వ.సంఖ్య. పేరు పార్టీ పదవీ కాలం పొడవు
సుదీర్ఘ నిరంతర పదవీ కాలం ముఖ్యమంత్రి పదవి మొత్తం పదవీకాలం
1 షీలా దీక్షిత్ INC 15 సంవత్సరాల, 25 రోజులు 15 సంవత్సరాల, 25 రోజులు
2 జె. జయలలిత AIADMK 4 సంవత్సరాల, 323 రోజులు 14 సంవత్సరాల, 124 రోజులు
3 మమతా బెనర్జీ AITC 13 సంవత్సరాలు, 235 రోజులు 13 సంవత్సరాలు, 235 రోజులు
4 వసుంధర రాజే BJP 5 సంవత్సరాల, 5 రోజులు 10 సంవత్సరాల, 9 రోజులు
5 రబ్రీ దేవి RJD 4 సంవత్సరాల, 360 రోజులు 7 సంవత్సరాల, 190 రోజులు
6 మాయావతి BSP 4 సంవత్సరాల, 307 రోజులు 7 సంవత్సరాల, 5 రోజులు
7 శశికళ కకొడ్కర్ MGP 5 సంవత్సరాల, 258 రోజులు 5 సంవత్సరాల, 258 రోజులు
8 నందిని సత్పతి INC 4 సంవత్సరాల, 185 రోజులు 4 సంవత్సరాల, 185 రోజులు
9 సుచేతా కృపలానీ INC 3 సంవత్సరాల, 162 రోజులు 3 సంవత్సరాల, 162 రోజులు
10 ఆనందీబెన్ పటేల్ BJP 2 సంవత్సరాల, 77 రోజులు 2 సంవత్సరాల, 77 రోజులు
11 మెహబూబా ముఫ్తీ JKPDP 2 సంవత్సరాల, 76 రోజులు 2 సంవత్సరాల, 76 రోజులు
12 ఉమాభారతి BJP 259 రోజులు 259 రోజులు
13 అన్వారా తైమూర్ INC 206 రోజులు 206 రోజులు
14 రాజిందర్ కౌర్ భట్టల్ INC 83 రోజులు 83 రోజులు
15 అతిషి మార్లెనా సింగ్ AAP 111 రోజులు 111 రోజులు
16 సుష్మా స్వరాజ్ BJP 52 రోజులు 52 రోజులు
17 వి.ఎన్. జానకి రామచంద్రన్ AIADMK 23 రోజులు 23 రోజులు

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "From Sucheta Kriplani to Mehbooba Mufti: List of women chief ministers in India". livemint.com/. Archived from the original on 23 ఏప్రిల్ 2021. Retrieved 23 April 2021.{cite web}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Sucheta Kripalani: India's first woman chief minister, chartered her own independent course". indianexpress.com/. Archived from the original on 23 ఏప్రిల్ 2021. Retrieved 23 April 2021.

గమనికలు

  1. This column only names the chief minister's party. The state government she heads may be a complex coalition of several parties and independents; these are not listed here.