మాణిక్ సాహా

మాణిక్ సాహా
మాణిక్ సాహా


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
15 మే 2022
గవర్నరు సత్యదేవ్ నారాయణ్ ఆర్య
నల్లు ఇంద్రసేనారెడ్డి
డిప్యూటీ జిష్ణు దేవ్ వర్మ (2 మార్చి 2023 వరకు)
ముందు బిప్లబ్ కుమార్ దేబ్

శాసనసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
26 జూన్ 2022
ముందు ఆశిష్ కుమార్ సాహా
నియోజకవర్గం టౌన్ బోర్దోవాలి

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
3 ఏప్రిల్ 2022 – 4 జూలై 2022
ముందు జర్నా దాస్
తరువాత బిప్లబ్ కుమార్ దేబ్
నియోజకవర్గం త్రిపుర

త్రిపుర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు
పదవీ కాలం
2020 – 2022

వ్యక్తిగత వివరాలు

జననం (1953-01-08) 1953 జనవరి 8 (వయసు 72)
అగర్తలా, త్రిపుర, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2016 – ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ ( 2016వరకు )
జీవిత భాగస్వామి స్వప్న సహా
సంతానం 2
పూర్వ విద్యార్థి పాట్నా డెంటల్ కాలేజీ, పాట్నా, బీహార్ (బి.డి.ఎస్)
కింగ్ జార్జ్స్ మెడికల్ యూనివర్సిటీ, లక్నో, ఉత్తర ప్రదేశ్ (ఎం.డి.ఎస్)

మానిక్ సాహా (జననం 8 జనవరి 1953) 2022 నుండి త్రిపుర 11వ, ప్రస్తుత ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఒక భారతీయ రాజకీయ నాయకుడు.[1][2] అతను 2022 నుండి త్రిపుర శాసనసభలో టౌన్ బోర్దోవాలి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతను 2022లో ముఖ్యమంత్రి అయ్యే వరకు త్రిపుర నుండి ఎన్నికైన మాజీ రాజ్యసభ సభ్యుడు. 2020 నుండి 2022 వరకు భారతీయ జనతా పార్టీ, త్రిపుర అధ్యక్షుడిగా ఉన్నారు. 2016 నుండి భారతీయ జనతా పార్టీ, 2016కి ముందు భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు.

రాజకీయ జీవితం

మాణిక్ సాహా సీపీఎం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వివిధ హోదాల్లో పనిచేసి 2016లో భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయన పార్టీలో పట్టణ ప్రాంతాలకు పన్నా ప్రముఖ్ ఇన్‌ఛార్జ్‌గా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ మేనేజ్‌మెంట్ కమిటీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించి 2020లో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. మాణిక్ సాహా 2022లో బీజేపీ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై, 2022మే 14న ముఖ్యమంత్రిగా ఉన్న విప్లవ్‌కుమార్ దేవ్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆయనను బీజేపీ అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడంతో అతను త్రిపుర 11వ ముఖ్యమంత్రిగా 2022మే 15న ప్రమాణ స్వీకారం చేశాడు.[3][4]

ఇతర పదవులు

మాణిక్ సాహా 2019లో త్రిపుర క్రికెట్ సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. ఆయన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, జాతీయ, యూనివర్సిటీ స్థాయిలో బ్యాడ్మింటన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్‌, డెంటల్ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యుడిగా ఉన్నాడు.[5]

మూలాలు

  1. "Manik Saha takes oath as Tripura chief minister". Hindustan Times (in ఇంగ్లీష్). 15 May 2022. Archived from the original on 15 May 2022. Retrieved 15 May 2022.
  2. "Who is Manik Saha, the new chief minister of Tripura". The Times of India. 14 May 2022. Archived from the original on 14 May 2022. Retrieved 14 May 2022.
  3. Sakshi (15 May 2022). "ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్‌ మాణిక్‌ సాహా". Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
  4. Andhra Jyothy (15 May 2022). "త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం" (in ఇంగ్లీష్). Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
  5. Eenadu (14 May 2022). "వైద్యుడిగా మొదలై.. సీఎం దాకా.. త్రిపుర కొత్త సీఎంగా మాణిక్‌ సాహా". Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.