సోమాజీగూడ, హైదరాబాదు
సోమాజీగూడ, తెలంగాణ రాష్ట్రం,హైదరాబాద్ జిల్లా,అమీర్‌పేట్ మండలం పరిధిలో ఉంది.[1]
సోమాజీగూడ | |
---|---|
సమీప ప్రాంతాలు | |
Coordinates: 17°25′44″N 78°27′19″E / 17.428911°N 78.455343°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రో | హైదరాబాదు |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 500 082 |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతంనిజాం కాలంలోని రెవెన్యూ విభాగపు ఉద్యోగైన సోమాజీ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో నివసించడంవల్ల, ఈ ప్రాంతానికి సోమాజీగూడ అనే పేరు వచ్చింది.[2] గవర్నరు యొక్క అధికారిక నివాసంమైన రాజ్ భవన్ సోమాజిగూడలోనే ఉంది. బేగంపేట, పంజాగుట్ట ఖైరతాబాదులకు సమీపంలో ఉన్న కారణంగా సోమాజిగూడకు ప్రాముఖ్యత వచ్చింది.
పరిసర ప్రాంతాలు
సోమాజిగూడ, రాజ్ భవన్ రోడ్డు శివారు ప్రాంతంలో ఉంది. ప్రశాంతమైన నివాసప్రాంతంగా ఉంటే సోమాజీగూడా, ప్రస్తుతం హైదరాబాదులోని ఆధునిక వ్యాపార కేంద్రాలలో ఒకటిగా రూపాంతరం చెందింది. ఇక్కడ నగల దుకాణాలు, ఆటోమొబైల్, బ్యాంకింగ్ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
- రాజ్ భవన్ రోడ్
- జఫర్ అలీ బాగ్
- దుర్గ నగర్ కాలనీ
- ఆసిఫ్ అవెన్యూ
- కపాడియా లేన్
- గుల్మోహార్ అవెన్యూ
- మాతా నగర్ కాలనీ
- బిఎస్ మఖ్టా
- ఎంఎస్ మఖ్టా
- అంబేద్కర్ నగర్
ప్రభుత్వ కార్యాలయాలు
- అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా
- లేక్ వ్యూ గెస్ట్ హౌస్
- రాజ్ భవన్
- గవర్నమెంట్ నర్సింగ్ స్కూల్
- దిల్కుషా గెస్ట్ హౌస్
- ఆంధ్రప్రదేశ్ మిల్క్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో (HAM)
ఆసుపత్రులు
- యశోదా ఆసుపత్రి
- దక్కన్ ఆసుపత్రి
- మాట్రిక ఆసుపత్రి
- మాక్సివిజన్ ఆసుపత్రి
- విజయ డయోగ్నస్టిక్స్
- జోయి ఆసుపత్రి
డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు
పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకంలో భాగంగా సోమాజీగూడ పరిధిలోని అంబేద్కర్ నగర్‌లో నిర్మించిన 330 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ సముదాయాన్ని 2021, జూన్ 26న తెలంగాణ రాష్ట్ర ఐటీ-మున్సిపల్-పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించి, లబ్ధిదారులకు అందించాడు.[3] ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి ఇతర ప్రజాపతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[4]
28 కోట్ల రూపాయలతో 330 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించడంతోపాటు వాటర్ ట్యాంక్, విద్యుత్ సౌకర్యం, దుకాణాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించబడ్డాయి. ఒక్కొ ఇళ్ళు 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో 8.50 లక్షల రూపాయలతో నిర్మించబడింది.[5]
చిత్రమాలిక
మూలాలు
- ↑ "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2019-01-14.
- ↑ Know Ap. "A History behind Street Names of Hyderabad & Secunderabad". www.knowap.com. D Ramachandram. Archived from the original on 19 జూన్ 2018. Retrieved 18 June 2018.
- ↑ telugu, NT News (2021-06-26). "అంబేద్కర్ నగర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించిన కేటీఆర్". www.ntnews.com. Archived from the original on 2021-06-30. Retrieved 2023-05-19.
- ↑ "ఇక్కడ ఒక్కో డబుల్ బెడ్రూం విలువ కోటిన్నర: కేటీఆర్". Sakshi. 2021-06-26. Archived from the original on 2021-06-26. Retrieved 2023-05-19.
- ↑ "అంబేద్కర్ నగర్‌లో నాడు- నేడు.. 330 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు". Prabha News. 2021-06-26. Archived from the original on 2023-05-19. Retrieved 2023-05-19.