చాముండి ఎక్స్‌ప్రెస్

చాముండి ఎక్స్‌ప్రెస్ (మైసూర్ - బెంగుళూర్) మార్గ పటం

చాముండి ఎక్స్‌ప్రెస్ (16215, 16216) మైసూర్, బెంగుళూరు మధ్య నడిచే ఒక రోజువారీ ప్రయాణికుల రైలు. ఈ రైలు ఉదయం 6:45 గంటలకు మైసూర్ నుండి బయలుదేరి ఉదయం 9:40 గంటలకు వద్ద బెంగుళూర్ సిటీకి చేరుతుంది.దీనికి రెండవ తరగతి పెట్టెలు, ఒక ఎయిర్ కండిషన్డ్ పెట్టె ఉంటాయి. ముందుగానే బుకింగ్ కోసం ఏర్పాటు సదుపాయం ఉంది.ఇది ప్రయాణించే మైసూరు, బెంగుళూరు రెండు నగరాలు కర్నాటక రాష్ట్రంలోనే ఉన్నాయి.రెండు నగరాలు మధ్య దూరం 139 కిలోమీటర్ల ఉంటుంది.

ఇది మైసూరు నుండి ప్రతిరోజు ఉదయం గం. 06:45 ని.లకు బయలుదేరి అదే రోజు ఉదయం గం 09:30 ని.లకు బెంగుళూరు చేరుకుంటుంది.అది మైసూరు నుండి గమ్యస్థానానికి చేరుకోవడానికి 2 గం. 45 ని.లు సమయం పడుతుంది.రైలు చివరి గమ్యస్థానం ప్రధాన స్టేషను బెంగళూరు సిటీ జంక్ష్షన్.ఇది ఒక వారంలో అన్ని రోజులు ప్రయాణిస్తుంది.[1]ఇదే పేరుతో 16216 నంబరుగలిగిన చాముండి ఎక్స్‌ప్రెస్ బెంగుళూరు నుండి ఉదయం గం.6.15 ని.ల.కు బయలుదేరి మైసూరు నగరానికి అదేరోజు ఉదయం గం.9.00 ని.ల.కు చేరుకుంటుంది.[2]

ఈ రైలులో ప్రయాణించాలనుకుంటే క్లియర్‌ట్రిప్ అనువర్తనం (యాఫ్),అధికారక వెబ్‌సైట్ ద్వారా సులభంగా టిక్కెట్లు పొందే సదుపాయం కలిగి ఉంది. ఇది స్మార్ట్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ కలిగి ఉంది.టికెట్ బుకింగ్ 120 రోజుల ముందుగానే ప్రారంభమవుతుంది.[1]

పేరు వెనుక ఔచిత్యం

ఈ రైలు పురాణాల లోని ఉన్న వాటి పేరును ఇది సూచిస్తుంది. దేవత పార్వతి అవతారములలోనిది, మహిషాసురుడును అంతంచేయటానికి చాముండి దేవత కూడా కూడా ఒక అవతారం. మైసూర్ సమీపంలోని చాముండి హిల్స్ దగ్గర ఒక ప్రసిద్ధ చాముండేశ్వరీ దేవాలయం ఉంది.

మార్గంలోని స్టేషన్లు

మూలాలు

వెలుపలి లంకెలు